E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఆపరేషన్ జ్యోత్స్న స్టార్ట్ చేసిన కార్తీక్ 

Karthika Deepam 2 Serial Today Episode April 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఆపరేషన్ జ్యోత్స్న స్టార్ట్ చేసిన కార్తీక్ 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కార్తీక్‌, దీప ఉదయమే లేచి రెడీ అయి వెళ్తుంటారు. కాంచన ఎక్కడికి వెళ్తున్నారుఅని అడగ్గానే.. డ్యూటీకి వెళ్తున్నాం అని కార్తీక్‌ చెప్తాడు. దీంతో కాంచన కోపంగా నీ చేతికి దెబ్బ తగిలింది ఎలా వెళ్తావు..? నువ్వేమీ నా పుట్టింటికి అల్లుడివి కాదు.. వెళ్లగానే.. మర్యాద చేయడానికి నువ్వు వెళ్తుంది డ్రైవర్‌ పని కోసం.. చేతికి గాయంతో ఎలా  పని చేస్తావు.. అక్కడ డ్రైవింగ్ చేయలేని నువ్వు అక్కడికి వెళ్లి ఏం చేస్తావు..? ఏమీ చేయనమ్మా అక్కడికి వెళ్లి ఊరికే తిరుగుతాను అంటావా..? ఆ తిరుగుడు ఏదో ఇక్కడే తిరగండి.. మిమ్మల్ని రమ్మని ఎవరైనా ఫోన్ చేశారా..? ఎవరు చేశారో చెప్పండి నేను మాట్లాడతాను అని చెప్పగానే.. దీప బావతో నేను ఉన్నాను కదా అత్తయ్యా అని చెప్పగానే.. నువ్వు కడుపుతో ఉన్న మనిషివి నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటూ దీపను తిడుతుంది. నాకు కూడా చెప్పుకోలేనంత సీక్రెట్స్‌ ఏమున్నాయో నా దగ్గర అంటూ కోప్పడుతుంటే.. దీప, బావ పద వెళ్దాం అంటూ బయటకు వెళ్తుంది. కార్తీక్‌ కూడా ఉంటానమ్మా అంటూ వెళ్లిపోతాడు.

దీప, కార్తీక్‌ స్కూటీ మీద ఇంట్లోకి రావడం చూస్తుంది జ్యోత్స్న.  దీప స్కూటీ నడపడం చూసి షాక్‌ అవుతుంది. వావ్‌ వీర మహిళ అంటే నువ్వే దీప అంటూ పొగుడుతుంటే.. దీపకు వైరా చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. జ్యోత్స్న దగ్గరకు వచ్చి కార్తీక్‌, దీపలను తిడుతుంటే.. కార్తీక్‌, దీప కోపంగా నువ్వు అసలు మనిషివేనా.. డబ్బుల కోసం వైరా గాడితో చేతులు కలిపావు అంటూ చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. నేను నా కోసమే బతుకుతాను.. నా స్వార్థం కోసమే బతుకుతాను.. అంటూ జ్యోత్స్న చెప్తుంటే.. ఈ విషయం మా అమ్మకు చెబితే అని దీప అడగ్గానే.. ఓసారి చెప్పి చూడు అంటుంది జ్యోత్స్న. దీంతో ఆ బలహీనతే నీకు బలం అయింది. ఆ బలాన్ని ఎలా తగ్గించాలో ఆలోచిస్తున్నాను అంటాడు కార్తీక్‌.

Advertisement

దీప మాత్రం జ్యోత్స్న నువ్వు హద్దులు మీరి మాట్లాడుతున్నావు.. నేను కూడా మర్యాద మర్చిపోవాల్సి వస్తుంది అనగానే.. జ్యోత్స్న నేనేం హద్దులు మీరలేదు దీప. బావ నీ మెడలో తాళి కట్టాడు. అదే నా కోసం అయితే ప్రాణాలు ఇవ్వడానికే సిద్దపడ్డాడు. అనగానే.. కార్తీక్‌ హలో మిస్‌ హైదరాబాద్‌ నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు. మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు అత్త ప్రాణాలు నీ దగ్గర ఉన్నాయి అనగానే.. అయినా నేను వైరాతో చేతులు కలిపినట్టు ఎలా తెలిసింది అని అడగ్గానే.. వాడే రాత్రి ఫోన్‌ చేసి చెప్పాడు అనగానే.. అంతకన్నా వాడు ఏం చేస్తాడులే అనగానే.. అయినా నువ్వు ఇంకా దిగజారుతావా..? నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ దీప తిట్టగానే.. నువ్వు ఏమైనా అను దీప బావతో నేను తాళి కట్టించుకునే వరకే నా ఆటలు అంటూ చాలెంజ్ చేసి వెళ్లిపోతుంది జ్యోత్స్న. పారిజాతం వచ్చి జ్యోత్స్న బాగా తిక్కలదిరా..? దానికి ఊరికే చెప్తే వినదు.. అనగానే.. ఎవరికి ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు కదా పారు అంటూ వెళ్లిపోతాడు.

పారిజాతం వెళ్లి దీపను తిడుతూ ఇల్లు క్లీన్‌ చేయడం ఏంటే.. నీ ఇల్లు కాలిపోతుంటే.. జాగ్రత్త పడాలి అంటూ చెప్తుంటే.. దీప ఏమైంది పారిజాతం గారు.. అని దీప అడగ్గానే.. నన్ను గారు గీరు అని పిలవకే నాన్నమ్మ అని పిలువు అని చెప్పగానే.. ఇప్పుడలా పిలవడం రాదండి అంటుంది దీప. ఇంతలో కార్తీక్ వచ్చి ఏంటి పారు నా  పెళ్లాం మీద పడ్డావు అంటూ అడగ్గానే.. పారిజాతం జ్యోత్స్నను తిడుతుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి పారిజాతాన్ని తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. జ్యోత్స్న కోపంగా పారిజాతానికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. కార్తీక్‌, పారిజాతం, దీప ముగ్గురు కలిసి తొందరలోనే జ్యోత్స్నకు పెళ్లి చేయాలని అందుకోసం ఆపరేషన్‌ జ్యోత్స్న అనే మిషన్ మొదలు పెడదాం అని ముగ్గురు అనుకుంటారు. ముగ్గురు కలిసి కిందకు వెళ్లేలోగా పంతులు వస్తాడు. పంతులును ఎవరు రమ్మన్నారు అని శివనారాయణ అడగ్గానే..కార్తీక్‌ నేనే పిలిచాను అంటూ జ్యోత్స్న  జాతకం చూపించాలని పెళ్లి కోసం ఏర్పాట్లు చేయాలని చెప్తాడు కార్తీక్‌. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×