E-Paper
Advertisement

Srinagar: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌

Srinagar: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌
Advertisement

Srinagar: జమ్మూకాశ్మీర్‌లోని ఎన్ఐటీలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లారు సదరు విద్యార్థి. అనుకోకుండా అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ విషయం తెలియగానే విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్

Advertisement

హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల ఆనంద్ మోహన్ జమ్మూకాశ్మీర్‌లో చదువుతున్నాయి. శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-(ఎన్ఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి క్యాంపస్ సమీపంలోవున్న అలకనంద నదికి వెళ్ళాడు.

సరదాగా నదిలోకి ఈత చేయడానికి దిగాడు ఆనంద్. అదే సమయంలో ఎగువ ప్రాంతం నుంచి బలమైన నీటి ప్రవాహం రావడంతో కొట్టుకుపోయాడు. ఎంతకీ ఆనంద్ నీటిలో నుంచి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే క్యాంపస్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

సరదాగా నదిలోకి దిగిన ఆనంద్, పెరిగిన నీటి ప్రవాహం

ఘటన గురించి సమాచారం అందుకున్న శ్రీనగర్ పోలీసులు-విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. చీకటి పడటం, నది ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రాత్రికి గాలింపును తాత్కాలికంగా నిలిపి వేశారు. అలకనంద నదిలో ప్రవాహం అధికంగా ఉండడంతో సహాయక బృందాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

సోమవారం ఉదయం నుంచి డైవర్ల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నది దిగువ ప్రాంతాల్లో గాలింపు చేపట్టినట్టు కోత్వాలి శ్రీనగర్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఛార్జ్ కుల్దీప్ సింగ్ వెల్లడించారు. వేసవి కాలంలో నదులు, వాగుల వద్దకు స్నానానికి వెళ్లేటప్పుడు యువత అత్యంత జాగ్రత్త ఉండాలని అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ALSO READ: ఎట్టకేలకు ఉత్కంఠకు తెర.. గవర్నర్ కోటాలో అజారుద్దీన్-కోదండరామ్‌లు, కాకపోతే 

నదిలో ఆనంద్ మోహన్ మిస్సింగ్ అయ్యాడనే విషయం తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆనంద్ ఆచూకీ కోసం అక్కడి అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×