E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 3rd: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను చంపబోయిన జ్యోత్స్న  

Karthika Deepam 2 Serial Today Episode April 3rd: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను చంపబోయిన జ్యోత్స్న  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన కార్తీక్‌ కంగారుగా దాస్‌ దగ్గరకు వెళ్తాడు. రిపోర్ట్స్‌ గురించి దాస్‌కు చెప్తాడు. విషయం మొత్తం జ్యోత్స్నకు తెలిసినట్టు ఉంది. అని చెప్పగానే.. జ్యోత్స్నకు అన్ని తెలిసి ఎందుకు సైలెంట్‌గా ఉంది అని దాస్‌ అడుగుతాడు. సైలెంట్‌ గా ఏమీ లేదని ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉంది. హాస్పిటల్‌ లో మనం ఆడిన డ్రామా తెలిసింది. పార్టీకి దీపను కచ్చితంగా రావాలని పిలిచింది.. అంటే దీప డేంజర్‌లో ఉంది మామయ్య అంటూ కార్తీక్ పరుగెత్తుకుంటూ వెళ్తాడు. దీపను చంపడానికి జ్యోత్స్న రెడీగా ఉందా..? దీపను కాపాడాలి అనుకుంటూ దాస్‌ వెళ్లిపోతాడు. మరోవైపు మేడ మీదకు వెళ్లిన దీప వెనకాలే జ్యోత్స్న వెళ్తుంది. ఇంతలో కిందకు వెళ్లిన కార్తీక్‌.. పారిజాతాన్ని దీప ఎక్కడ అని అడగ్గానే.. తెలియదు అని చెప్తుంది. జ్యోత్స్న ఎక్కడ అని అడగ్గానే.. మేడ మీదకు వెళ్లింది అని చెప్తుంది. కార్తీక్‌ పరుగెత్తుకుంటూ వెళ్తుంటే.. శౌర్య ఎదురువస్తుంది.

రౌడీ  అమ్మ ఎక్కడ అని కార్తీక్ అడిగితే పూలు అడిగానే తీసుకొస్తానని మేడ మీదకు వెళ్లింది అని చెప్పగానే.. కార్తీక్‌ కంగారుగా మేడ మీదకు వెళ్తుంటే.. దాస్‌ ఎదురొస్తాడు ఏమైంది అల్లుడు అని అడగ్గానే.. జ్యోత్స్న దీపను చంపబోతుంది అంటూ ఇద్దరూ కలిసి మేడ మీదకు వెళ్తారు. అప్పటికే పూల చెట్లకు నీళ్లు పడుతున్న దీప వెనక నుంచి వెళ్లిన జ్యోత్స్న, దీపను కిందకు తోసేయబోతుంది. అప్పుడే కార్తీక్‌ పైకి వెళ్లి దీప అని పిలుస్తాడు. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. దీప తిరిగి చూస్తుంది.  ఇంతలో జ్యోత్స్న ఏంటి దీప ఇక్కడేం చేస్తున్నావు.. అని అడగ్గానే.. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.. అని దీప అడగ్గానే.. కడుపుతో ఉన్నవాళ్లు పై నుంచి కిందకు చూస్తూ కళ్లు తిరుగుతాయి అంటారు.. అందుకే కిందకు వెళ్దాం పద అంటూ పిలుస్తున్నట్టు చెప్తుంది.  కార్తీక్‌ కూడా దీప నువ్వు కిందకు వెళ్లు అని చెప్పగానే.. దీప వెళ్లిపోతుంది. దీప వెళ్లిపోయాక నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది జ్యోత్స్న.

Advertisement

ఇక్కడితో ఆపేయ్‌ లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ కార్తీక్‌ వార్నింగ్‌ ఇస్తాడు. జ్యోత్స్న వెళ్లిపోయాక దాస్ కంగారు పడుతుంటే నువ్వేమీ తెలియనట్టే సైలెంట్‌గా ఉండు మామయ్య అని కార్తీక్‌ చెప్తాడు. ఇద్దరూ కిందకు వెళ్తారు. శివనారాయణ భోజనం చేద్దాం పదండి అనగానే.. భోజనంలో జ్యోత్స్న ఏమైనా కలిపిందేమో అని అనుమానపడుతుంటాడు కార్తీక్‌.. ఇంతలో అందరూ వెళ్లి భోజనానికి కూర్చుంటారు.. జ్యోత్స్న వచ్చి దీపకు నేను వడ్డిస్తాను అంటుంది. ఎందుకని అందరూ అడగ్గానే.. ఎందుకంటే దీప మా అమ్మ ప్రాణాలు కాపాడింది అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. డోనర్ నువ్వు అయితే దీప ఎలా కాపాడింది అంటూ శ్రీధర్‌ అడుగుతాడు. దీంతో ఈ ప్రశ్నకు కార్తీక్‌ అయితే బాగా ఎక్స్‌ప్లైన్‌ చేస్తాడు అని చెప్పగానే.. ఇక్కడ నేను చెప్పడం కంటే నువ్వైతేనే బాగా చెప్తావు అంటాడు కార్తీక్‌.  జ్యోత్స్న మాటలు విన్న కార్తీక్‌ అనుమానమే లేదు జ్యోత్స్న భోజనంలో ఏదో కలిపింది అని మనసులో అనుకుంటూ.. పారిజాతం, దీపకు భోజనం తినిపిస్తుంటే..

పారు ఆగు నువ్వు దీపకు భోజనం తినిపించడం స్పెషల్‌ ఏముంది.. దీప చేతులతో జ్యోత్స్నకు తినిపించడం స్పెషల్‌ అంటాడు. జ్యోత్స్న అయోమయంగా చూస్తుంటుంది. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు మరదలా అని మనసులో అనుకుంటుంటే. జ్యోత్స్న దీప చేత మొదటి ముద్ద తింటుంది. దీంతో కార్తీక్, దాస్‌ షాక్‌ అవుతారు. జ్యోత్స్నమాత్రం దీప ఇంకో ముద్ద పెట్టు అని అడుగుతూ తింటుంది. దీంతో కార్తీక్‌ మనసులో జ్యోత్స్న ప్లాన్‌ చేసింది ఇది కాదు.. మరేదో చేయబోతుంది. ఏంటది అని మనసులో అనుమాన పడుతుంటాడు.. తర్వాత భోజనాలు అయ్యాక అందరూ కేక్‌ కట్‌ చేయబోతుంటే.. జ్యోత్స్న  తన పెళ్లి గురించి చెప్తూ.. బావే నాకు కాబోయే భర్తను సెలెక్ట్‌ చేస్తాడని చెప్తుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Big Stories

Advertisement
×