E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కేక్ లో విషం కలిపిన జ్యోత్న్స 

Karthika Deepam 2 Serial Today Episode April 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కేక్ లో విషం కలిపిన జ్యోత్న్స 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: అందరూ ఏదేదో మాట్లాడుతుంటే ఇక ఆపండి ఇప్పుడు మమ్మీ కేక్‌ కట్‌ చేస్తుంది. ఈ కేక్‌ను  నేనే దగ్గరుండి మరీ రెడీ చేయించాను అని చెప్తూ.. అందులో ఏదో కలిపిన విషయం గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న.  దాస్‌ కంగారుగా కార్తీక్‌తో అల్లుడు నా కూతురును చూస్తుంటే ఏదో భయంగా ఉంది అంటాడు. చూద్దాం మామయ్య అంటాడు కార్తీక్‌. కార్తీక్‌ టెన్షన్ పడటం చూసిన జ్యోత్స్న మాత్రం నువ్విలా ఉంటే చూడ్డానికి నాకు చాలా బాగుంది బావ అనుకుంటుంది మనసులో ఇంతలో సుమిత్ర కేక్‌ కట్‌ చేసి జ్యోత్స్నకు తినిపిస్తుంటే.. దశరథ అడ్డుపడి ముందు దీపకు పెట్టు అంటాడు.

దీంతో జ్యోత్స్న ఎక్స్‌లెంట్‌ డాడ్‌ అంటుంది. ముందుగా దీపకు ఎందుకు ముందు జ్యోత్స్నకు పెట్టమనండి మామయ్య అని చెప్తాడు. వద్దని దశరథ చెప్పగానే.. దీప కూడా ఈ అవకాశం వస్తుందో రాదో ఎందుకు అలా చెప్తారు అనగానే.. జ్యోత్స్న మాత్రం నేను ఇందులో కలపింది మామూలు విషం కాదు బావ తిన్న పది సెకండ్లకే చనిపోతారు అని మనసులో అనుకుంటుంది. దీపను సుమిత్ర వైపు తోసేసి మమ్మీ తినిపించు అని చెప్తుంది. సుమిత్ర కేక్‌ దీపకు తినిపిస్తుంది. కార్తీక్‌, దాస్‌ షాకింగ్‌ గా చూస్తుంటారు. జ్యోత్స్న మాత్రం నేను అనుకున్నది అయిపోయింది బావ అంటుంది. దాస్‌ కంగారు పడుతుంటాడు. అల్లుడు ఆపలేకపోయాడేంటి.?అనుకుంటాడు. జ్యోత్స్న దీపను చూసి దీపకు ఏం కాలేదు ఏంటి..? అనుకుంటుంది.

Advertisement

అప్పుడే కార్తీక్‌ అత్తా నా భార్యకు తినిపించావు కదా ఇప్పుడు నాకు తినిపించు అంటూ జ్యోత్స్ను వెటకారంగా చూస్తూ.. కేక్‌ తింటూ టేస్ట్‌ అదిరిపోయింది అత్తా.. ఇప్పుడు జ్యోత్స్నకు నేను తినిపిస్తా..? తిను మరదలా ఇలాంటి రోజు ఇలాంటి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ఏంటి టెన్షన్‌ పడుతున్నావు.. నువ్వు కేక్‌లో విషం కలపడం నేను చూశాను. అప్పుడే ఆపి ఉంటే నువ్వు మరో ప్లాన్‌ చేస్తావు అని చెప్పలేదు.. అంటూ మెల్లగా చెప్తుంటే.. శివనారాయణ రేయ్‌ మీలో మీరే మాట్లాడుకుంటారేంట్రా అదేంటో మాకు చెప్పండి అంటాడు. తప్పకుండా చెప్తాను.. అంటూ కేక్‌ గురించే మాట్లాడుతున్నాను తాత అంటాడు కార్తీక్‌. కేక్‌ గురించి ఏంటి..? అని అడగ్గా.. జ్యోత్స్న  ఈ కేక్‌లో ఏం కలిపింది అంటే.. అంటూ ఆగిపోగానే.. జ్యోత్స్న టెన్షన్‌ పడుతుంది. అందరూ ఆశ్చర్యంగా ఎదురుచూస్తుంటారు. ప్రేమ కలిపింది అని కార్తీక్‌ చెప్పగానే.. అందరూ నవ్వుకుంటారు.. అందరూ కలిసి సెల్ఫీ దిగుతారు. తర్వాత శ్రీధర్‌, కాంచన, దీప, శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో కార్తీక్‌, జ్యోత్స్నతో కొంచెం మాట్లాడాలి అంటాడు. సరే అంటూ జ్యోత్స్న, కార్తీక్‌ వెళ్లిపోతారు.

మరోవైపు స్వప్న, కాశీ, వసంత్‌ కారులో వెళ్తుంటారు. స్వప్నను చీర బాగుందని వసంత్‌  చెప్తాడు. దీంతో స్వప్న ఏదో ఒకటి ఇవ్వమంటే మా అమ్మ ఇది ఇచ్చిందని మనసులో అనుకుంటుంది. స్వప్న గురించి ఏమైనా చెప్తారా..? అని వసంత్‌ అడగ్గానే.. సరే చెప్తాను అంటూ కాశీ, స్వప్న గురించి కవితలు చెప్తుంటాడు. ఆ కవితలకు స్వప్న ఎమోషనల్ అవుతుంది కానీ బయటకు తెలియనివ్వదు.

Advertisement

మరోవైపు పక్కకు వెల్లిన కార్తీక్‌, జ్యోత్స్న ఒకరినొకరు వెటకారంగా మాట్లాడుకుంటుంటారు. ఇంతలో దాస్‌ వెళ్లి జ్యోత్స్ను తిడుతాడు. నిజం ఎవ్వరికి చెప్పనని ఓట్టేశావు.. నువ్వు ఒట్టు దాటి కూతురును చంపుకున్నావు.. కూతురును చంపేసుకున్న నువ్వు తండ్రివేనా..? అంటుంది. దీంతో కార్తీక్‌ కన్నతల్లిలా చూసుకున్న మా అమ్మనే చంపాలనుకున్నావు అని కార్తీక్‌ అడగ్గానే.. నేను ఎవ్వరినీ చంపాలనుకోలేదు అనగానే.. నన్ను చంపాలనుకోలేదా..? అంటూ దాస్‌ అనగానే.. ఆరోజు ఉన్న టెన్షన్‌లో అలా చేశాను అంటుంది జ్యోత్స్న. మరి దీపను ఎందుకు చంపాలనుకున్నావు అంటూ కార్తీక్‌ అడగ్గానే.. నాకు అడ్డుగా వచ్చింది దీప అందుకో చంపాలనుకున్నాను అంటూ కోప్పడుతుంది జ్యోత్స్న ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×