E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : దీపను చంపేందుకు కొత్త ప్లాన్ చేసిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode April 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : దీపను చంపేందుకు కొత్త ప్లాన్ చేసిన జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2  serial today Episode: ఇంటికి వెళ్లిన కార్తీక్‌, దీపకు దిష్టి తీసి వెళ్లి దేవుడి దగ్గర దీపం వెలిగించు అని చెప్తాడు. దీప కంగారుగా ఏమైంది బావ అని అడిగినా ఏం లేదని కార్తీక్‌ చెప్తాడు. అయితే కాంచన మాత్రం గండం నుంచి బయటపడితేనో గండం ఉందని బయపడితేనో దిష్టి తీస్తారురా ఇప్పుడు దీపకు దిష్టి తీశావు అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా.? చెప్పు అని అడగ్గానే.. అలాంటిదేం లేదమ్మా.? కడుపుతో ఉన్న భార్య గడప దాటి బయటకు వెళితే దిష్టి తగులుతుందని నువ్వే కదా చెప్పావు అనగానే.. వీడు మాట్లాడేది జ్యోత్స్న గురించి కాదు కదా అని కాంచన, బావ మాట్లాడేది జ్యోత్స్న గురించే అయ్యుండొచ్చు అని దీప మనసులో అనుకుంటారు.

తర్వాత కార్తీక్‌ పడుకోకుండా ఏవో లెక్కలు చేస్తుంటే.. దీప పడుకోకుండా జ్యోత్స్న గురించి అడుగుతుంది. ఎందుకు పార్టీలో కంగారు పడ్డావు.. జ్యోత్స్న నువ్వు ఏం మాట్లాడుకున్నారు బావ అని అడుగుతుంది. దీంతో ఏం లేదు ఆస్థుల గురించి అడిగింది. నువ్వు అసలైన వారసురాలి అని చెప్పాను అంటూ కార్తీక్‌ చెప్పగానే.. దీప నమ్మదు.. దీంతో కార్తీక్‌ చిన్న కథ చెప్పగానే.. అంటే జ్యోత్స్న ఏదో చేసింది అంటూ దీప అనుమానిస్తుంది. కార్తీక్‌ మాత్రం మనసులో జ్యోత్స్న నీ స్థానంలోకి రావాలనుకుంటుంది ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటాడు మనసులో.. అప్పుడే పారిజాతం ఫోన్‌ చేసి దీప గురించి అడుగుతుంది. కార్తీక్‌ తిడతాడు. నువ్వు, జ్యోత్స్న కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా నువ్వు దీప మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నావు అంటూ కార్తీక్‌ తిట్టగానే.. కాదని తను కార్తీక్‌ పార్టీ అని చెప్తుంది పారిజాతం.  మరోవైపు జ్యోత్స్న తన ఫోన్‌లో కార్తీక్, దీపల ఫోటో చూస్తూ.. కోపంగా తిట్టుకుంటుంది. నా మెడలో కట్టాల్సిన తాళి సరిగ్గా రేపటి రోజున నీ మెడలో కట్టాడు నా బావ. మధ్యలో నువ్వు వచ్చి ఇన్నేళ్ల నా ప్రేమను నాది అనుకున్న నా ప్రేమను ఒక్క పసుపుతాడుతో నాకు దూరం చేశావు అంటూ తిట్టుకుంటుంది.

Advertisement

మరుసటి రోజు కార్తీక్‌, దీపలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తారు కాంచన, శ్రీధర్‌. అందరూ స్వీట్స్‌ పంచుకుంటారు. కోట్లు ఖర్చు పెట్టి చేసుకున్న పెళ్లిళ్లే పెటాకులవుతున్న వేళ మీరు మాత్రం అనుకోకుండా పెళ్లి చేసుకున్నా ఒకరికోసం ఒకరు బతుకుతున్నారు అంటూ శ్రీధర్‌ మెచ్చుకుంటాడు. అప్పుడే శౌర్య వచ్చి కార్తీక్‌, దీపలకు విషెష్‌ చెప్తుంది. తర్వాత దీప దశరథ సుమిత్రల దగ్గరకు వెళ్లి వస్తామని చెప్పగానే.. కాంచన వద్దంటుంది. దీంతో వెంటనే అక్కడ తాతయ్య ఆశీర్వాదాలు తీసుకుని వస్తామని చెప్పి వెళ్లిపోతారు. దీంతో కాంచన భయపడుతుంది. వీళ్ల పెళ్లి రోజు అని తెలిసి ఆ జ్యోత్స్న ఏం చేస్తుందోనని భయంగా ఉందని అటుంది. కార్తీక్‌ ఉన్నాడు కదా ఎందుకు భయం అంటూ శ్రీధర్‌ చెప్తాడు.

మరోవైపు ఇంటి ముందు నూనె వేసిన జ్యోత్స్న  దీప నీ కోసమే నేను ఎదురుచూస్తున్నాను.. గుమ్మం దాటి ఇంట్లోకి అడుగుపెట్టగానే.. కొన్ని ప్రాణాలు పోతాయి అంటూ మనసులో అనుకుంటూ తాను నూనె పోసింది గుర్తు చేసుకుంటుంది. ఇంతలో పారుజాతం డాన్స్‌ చేసుకుంటూ వస్తుంటే. జ్యోత్స్న తిడుతుంది. ఇంతలో కార్తీక్‌, దీప ఇంటికి వస్తారు. దీప ఇంట్లోకి అడుగుపెడుతూనే నూనె మీద కాలు వేసి జారిపడుతుంది  ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

 

 

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×