E-Paper
Advertisement

తాగుబోతు ప్రేమలో అందమైన అమ్మాయి… యమ కిక్ ఇచ్చే క్రేజీ లవ్ స్టోరీ

తాగుబోతు ప్రేమలో అందమైన అమ్మాయి… యమ కిక్ ఇచ్చే క్రేజీ లవ్ స్టోరీ
Advertisement

Romantic Comedy OTT : టీనేజ్ ప్రేమకథలు చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తెలిసి తెలియని వయసులో పడే ప్రేమలో ఆసక్తికర మలుపులు కూడా ఉంటాయి. ఈ కంటెంట్ తో వచ్చిన ఒక సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ కథ ఎప్పుడూ పార్టీలు చేసుకుంటూ, మద్యం తాగుతూ, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండే ఒక అబ్బాయి, చదువు తప్ప మరో లోకం తెలియని అమ్మాయి ప్రేమలో పడటంతో ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఇది మన పక్కింట్లో జరిగే ఒక ప్రేమకథలా చాలా నాచురల్ గా ఉంటుంది. లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమాని.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘ది స్పెక్టాక్యులర్ నౌ’ (THE SPECTACULAR NOW). ఈ సినిమాలో నటించిన మైల్స్ టెల్లర్, షైలీన్ వుడ్లీ ఇద్దరికీ ఇది కెరీర్ బ్రేక్ ఇచ్చిన సినిమా. ఇందులో వీళ్లద్దరూ లవర్స్‌గా నటిస్తే, ఆ తర్వాత వచ్చిన ఫేమస్ సిరీస్ ‘డైవర్జెంట్’ (Divergent) లో అన్నచెల్లెళ్లుగా నటించారు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా ఉంటుందని విమర్శకులు తెగ మెచ్చుకున్నారు. ఇక  దర్శకుడు జేమ్స్ పాన్సోల్డ్ ఈ సినిమాని చాలా రియలిస్టిక్‌గా తీయాలనుకున్నాడు. అందుకే షూటింగ్ సమయంలో హీరోయిన్ షైలీన్ వుడ్లీ అసలు మేకప్ వేసుకోలేదు. టీనేజ్ వయసులో ఉండే మొటిమలు, ముఖం మీద మచ్చలు అలాగే కనిపించేలా తీశారు. దీనివల్ల సినిమా చూస్తున్నప్పుడు మన పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్లే అనిపిస్తుంది. సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ జ్యూరీ మెంబర్స్ ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, హీరో హీరోయిన్లు ఇద్దరికీ కలిపి ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ యాక్టింగ్’ ఇచ్చారు. సాధారణంగా ఇలా ఇద్దరికీ కలిపి అవార్డు ఇవ్వడం చాలా అరుదు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హీరో సట్టర్ ఒక నెంబర్ వన్ తిరుగుబోతు. ఏ పనిపాటా ఉండదు, ఎప్పుడూ చేతిలో ఒక మందు గ్లాసు పట్టుకుని లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం, రేపటి గురించి ఆలోచించకూడదని బిల్డప్ ఇస్తుంటాడు. ఒకరోజు గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందని ఫుల్లుగా తాగి, ఎక్కడో ఒక ఇంటి ముందు పడిపోతాడు. తెల్లారేసరికి ఐమీ అనే ఒక అమ్మాయి అతన్ని నిద్రలేపుతుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఐమీ చాలా సింపుల్ అమ్మాయి, చదువు తప్ప లోకం తెలియదు. మనోడు వెళ్ళి ఆమెను మెల్లగా లవ్ లో దింపుతాడు. ఐమీకి కూడా ఇతగాడంటే పిచ్చి ప్రేమ పుడుతుంది, కానీ సట్టర్ మాత్రం తన తాగుడు అలవాటును, గాలి తిరుగుళ్లను వదలడు. ఇంతలో మధ్యలో తనని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిన తండ్రిని కలవడానికి వెళ్తాడు. అక్కడ తన తండ్రి కూడా తనలాగే ఒక తాగుబోతు అని, బాధ్యత లేని వాడని తెలిసి షాక్ తింటాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఐమీ మీద కూడా కోప్పడి, ఒక యాక్సిడెంట్ కి కారణం అవుతాడు. చివరికి ఐమీ తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని తెలిసి, తన తప్పులు సరిదిద్దుకోవాలని అనుకుంటాడు. ఐమీ కాలేజీ కోసం వేరే ఊరు వెళ్ళిపోతుంది. సట్టర్ కూడా తన తాగుడు మానేసి, పద్ధతిగా మారి ఆమె దగ్గరికి వెళ్తాడు. వాళ్లిద్దరూ మళ్ళీ కలిశారా లేదా అనే చిన్న సస్పెన్స్ తో ఈ సినిమా అయిపోతుంది.

Read Also : మాఫియా డాన్ల మధ్య మొదలయ్యే వేట… ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టించేలా చేసే సినిమా

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×