E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు పారిజాతం షాక్  

Karthika Deepam 2 Serial Today Episode April 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు పారిజాతం షాక్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: తనను గుడికి తీసుకెళ్లాలని జ్యోత్స్న, కార్తీక్ ను అడగ్గానే.. సుమిత్ర కూడా గంటనే కదా వెళ్లండి అని చెప్పగానే.. పారిజాతం ఈరోజు వాళ్ల పెళ్లి రోజు కదా అంటుంది. గంట సేపే కదా అంటుంది సుమిత్ర. దీంతో దశరథ అయితే దీపను కూడా తీసుకెళ్లండి వాళ్ల పెళ్లి రోజు కదా వాళ్లు దేవుడిని దర్శనం చేసుకుంటారు అనగానే.. ముగ్గురు వెళ్లకూడదని జ్యోత్స్న చెప్తుంది. అవసరానికి అన్ని గుర్తుకు వస్తాయి అని కార్తీక్‌ మనసులో అనుకుంటాడు. ఇంతలో పారిజాతం నేను వస్తాను అనగానే.. నలుగురం వెళితే నా అభిషేకం చేసినట్టే అంటూ జ్యోత్సన మొండికేయగానే.. సుమిత్ర, కార్తీక్‌ను రిక్వెస్ట్ చేసి  జ్యోత్స్నతో పంపిస్తుంది. దీపను తాను వచ్చే వరకు ఇంట్లోనే ఉండమని చెప్తాడు కార్తీక్‌. దీని యవ్వారం ఏదో తేడాగా ఉందే అని పారిజాతం మనసులో అనుకుంటుంది.

గుడి దగ్గరకు వెళ్లాక కార్తీక్‌ను లోపలికి రమ్మని జ్యోత్స్న అడిగితే పూజ చేయాల్సింది మీరు నేను కాదు మీరు వెళ్లి పూజ చేసుకోండి అని చెప్పగానే.. నిన్ను ఎలా లోపలికి పిలవాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపల పూజారి దగ్గర వెళ్లి పూజారితో ఈరోజు మా పెళ్లి రోజు మా ఆయన లోపలికి రావడానికి బెట్టు చేస్తున్నారు. ఆయన లోపలికి రాగానే మాకు అభిషేకం చేయండి అని చెప్పగానే.. సరే అంటూ జ్యోత్స్న ,కార్తీక్‌కు ఫోన్‌ చేసి కారులో దండ మర్చిపోయాను తీసుకుని రా అని చెప్తుంది. కార్తీక్ ఫస్ట్ ఒప్పుకోడు. జ్యోత్స్న సుమిత్రకు కాల్ చేస్తానంటే సరే అంటూ దండ తీసుకుని లోపలికి వెళ్తాడు.

Advertisement

పూజారి, కార్తీక్‌ ను పట్టుకుని మీ ఆవిడను దూరం ఎందుకు పెడుతున్నావు అని అడగ్గానే.. ఈవిడ మా ఆవిడ కాదు అని ఎంత చెప్పినా పంతులు వినడు. దీంతో తాళి ఎక్కడుంది అడగండి అని కార్తీక్‌ చెప్పగానే.. పంతులు అవును అంటూ కన్పీజ్‌లో ఉంటే అప్పుడే పారిజాతం, దీపను తీసుకుని అక్కడికి వస్తుంది. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. నువ్వెందుకు వచ్చావు అని జ్యోత్స్న కోప్పడుతుంటే.. పారిజాతం తిడుతుంది. పారిజాతం దగ్గరుండి దీప, కార్తీక్‌ ల పెళ్లి రోజని అర్చన, అభిషేకం అన్ని చేయండి అంటూ చెప్తూ.. అది జ్యోత్స్న అది కూడా నా మనవరాలే.. దానికి పెళ్లి అవ్వడం లేదని గుళ్లు గోపురాలు పట్టుకుని తిరుగుతుంది. దానికి పెళ్లి అవ్వాలని పూజ చేయండి అని చెప్తుంది. కార్తీక్‌, దీప షాక్‌ అవుతుంటారు.

మరోవైపు ఇంట్లో ఉన్న శివనారాయణ.. దశరథ, సుమిత్రలో పారిజాతంలో వచ్చిన మార్పును చూసి షాక్‌ అవుతాడు. ఆ మార్పును చూస్తుంటే ఆనంద పడాలో అనుమానం పడాలో అర్థం కావడం లేదని అంటుంటాడు. ఆనంద పడాలి మామయ్య గారు అంటూ సుమిత్ర చెప్తుంది. కార్తీకే ఏదో చేసి ఉంటాడని దశరథ మనసులో అనుకుంటాడు. వీలునామా విషయంలో తిట్టినందుకు దశరథకు శివనారాయణ సారీ చెప్తాడు. నీ వీలునామా వల్లే జ్యోత్స్నలో మార్పు వచ్చింది. అంటూ హ్యాపీగా ఫీలవుతుంటాడు.

Advertisement

మరోవైపు గుడిలోంచి బయటకు వెళ్లిన పారిజాతం, జ్యోత్స్న గొడవపడుతుంటారు. నిన్ను సహించే ఓపిక నాకు లేదు అంటుంది జ్యోత్స్న .. దీంతో పారిజాతం కూడా ఇక నిన్ను భరించే ఓపిక నాకు లేదు అంటుంది. దీంతో జ్యోత్స్న ఆఖరి సారి చెప్తున్నా నాకు సపోర్ట్‌ చేస్తావా..? లేదా అని అడగ్గానే.. పారిజాతం కూడా నీకు ఆఖరిసారి చెప్తున్నాను దీప జోలికి రాకుండా ఉంటావా లేదా..? అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో జ్యోత్స్న కోపంగా పారిజాతాన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×