E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today February 27th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను ఏడిపించేందుకు జ్యో, పారిజాతం ప్లాన్

Karthika Deepam 2 Serial Today February 27th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను ఏడిపించేందుకు జ్యో, పారిజాతం ప్లాన్
Advertisement

Karthika Deepam 2  serial today Episode:    

కార్తీక్‌, శివనారాయణను కలిసి జరిగిన విషయం చెప్పి నీకు టెన్షన్‌ లేదా అని అడుగుతాడు. ఇందులో టెన్షన్‌ పడాల్సిన విషయం ఏముంది. దాస్‌ వచ్చి తనను గుడిలో కలిశాడని దశరథ చెప్పాడు అది కిడ్నాప్‌ ఎలా అవుతుంది అంటాడు శివన్నారాయణ. సుమిత్ర గురించి అడిగి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లిపోగానే భలే తప్పించుకున్నావని పారు మీద సెటెర్లు వేస్తాడు కార్తీక్‌. తర్వాత దశరథ కార్తీక్‌, దీపలను తీసుకుని సుమిత్ర దగ్గరకు వెళ్లి పరిచయం చేయాలనుకుంటాడు. దీప తమ కన్న బిడ్డ అని చెప్పాలని ఆరాటపడుతుంటాడు. .

ఎక్కడైనా తండ్రిని బిడ్డలకు తల్లి పరిచయం చేస్తుందని ఇక్కడ నేను తండ్రిగా ఉంటూ ఒక తల్లికి తన బిడ్డను పరిచయం చేసే కర్మ పట్టిందని బాధపడతాడు. అదే విషయం సుమిత్రకు వినిపించేలా చెప్పబోతుంటే.. దీప, కార్తీక్‌ ఆపేస్తారు. అయినా సరే సుమిత్రకు నిజం చెప్పాలని దశరథ ప్రయత్నిస్తుంటాడు. నువ్వు ఎవరో తెలియకముందే మీ అమ్మను రౌడీ బారి నుంచి కాపాడావు.. ఇప్పుడు మరోసారి తల్లికి ప్రాణం పోస్తున్నావు.. నిన్నటి వరకు నా భార్య బతుకుతుందో లేదోనని టెన్షన్ ఉండేది.. ఇప్పుడు కన్నకూతురు ఉండటంతో చాలా ధైర్యంగా ఉందని దశరథ ఎమోషన్‌ అవుతుంటాడు. ఇంతలో కార్తీక్‌, దీపను బయటకు తీసుకెళ్తుంటే.. నా బిడ్డ పొత్తిళ్లలో ఉన్నప్పుడు కూడా ఇలాగే తీసుకెళ్లారు. మళ్లీ నువ్వు ఇప్పుడు అలాగే తీసుకెళ్తావా..? అంటూ కార్తీక్‌ ను ప్రశ్నిస్తాడు దశరథ.

Advertisement

దీంతో కార్తీక్‌ అయోమయంలో పడిపోతాడు. మరోవైపు ఎలాగైన దీపను బాధపెట్టాలని దాని కళ్లల్లో నీళ్లు చూడాలని జ్యోత్స్న, పారిజాతం ఆలోచిస్తుంటారు. అందుకోసం ప్లాన్‌ చేస్తారు. వెంటనే జ్యోత్స్న దీపకు కాపీ తీసుకురమ్మని చెప్తుంది. కాపీ తీసుకుని వచ్చిన దీప కాళ్లకు కాళ్లు అడ్డం పెడుతుంది జ్యోత్న్స. దీంతో కాఫీ పారిజాతం మీద పడుతుంది. కోపంతో పారిజాతం దీపను కొట్టబోతుంటే.. దశరథ వచ్చి ఆపేస్తాడు. జ్యోత్స్న, పారిజాతాన్ని గట్టిగా తిడతాడు. జ్యోత్స్న కాలు అడ్డు పెట్టడం వల్లే ఇలా జరిగిందని దశరథ చెప్పగానే.. జ్యో బయపడుతుంది. ఇక దీపను కొట్టబోయిన పారిజాతాని చెడామడా తిడతాడు దశరథ.

దీప నా మేనల్లుడి భార్య, నా చెల్లెలి కోడలు, నీకు దీప పనిమనిషి కావొచ్చు, కానీ నాకు మాత్రం ఇంట్లో మనిషి. నా ఆప్తురాలు, నా శ్రేయోభిలాషి, నా భార్య ప్రాణదాత అంటాడు. దీంతో పారిజాతం కోపంగా ఎప్పుడో ఒకసారి సుమిత్ర ప్రాణాలు కాపాడిందని ఇంకా గతాన్ని గుర్తుపెట్టుకున్నావా..? అంటుంది. దీంతో దశరథ కోపంగా నీకు గతమే కావొచ్చు.. కానీ అది కొందరికీ కథ. దీప పనిమినిషే కావొచ్చు.. తను కడుపుతో ఉన్న మనిషి. నీకు కాఫీ కావాలంటే జ్యోత్స్నను అడగాలి జ్యోత్స్న తీసుకువస్తుంది అని చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా నేను కిచెన్‌లోకి వెళ్లడం నువ్వు ఎప్పుడైనా చూశావా? కాఫీ నన్ను పెట్టమంటావా? నేనెందుకు ఇంటి పని చేయాలి అంటూ కోప్పడుతుంది.

Advertisement

అయినా సరే ఈరోజు నుంచి నీకు, పిన్నికి ఏం కావాలన్నా దీప మాత్రం ఇవ్వదు.. మీకు మీరే సర్వ్‌ చేసుకోండి అన్నట్టు చెప్తాడు. శివన్నారాయణ వచ్చి ఏమైంది రా నీకు, జ్యోత్స్న మీద ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావంటూ కోప్పడతాడు. పెళ్లై వేరే ఇంటికి వెళ్లాల్సిన జ్యో ఇంటి పని నేర్చుకోవాల్సిందే.. రేపు భర్త కాపీ, టీలు అడిగితే రావని చెప్తుందా..? అంటూ దశరథ కోప్పడుతుంటే కార్తీక్‌ వచ్చి దశరథను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×