E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  పోటీ లో దీపకు షాక్ ఇచ్చిన మాలిని  

Karthika Deepam 2 Serial Today Episode July 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  పోటీ లో దీపకు షాక్ ఇచ్చిన మాలిని  
Advertisement

Karthika Deepam 2 serial today Episode:మాలినితో సూరజ్‌ మాటలు విన్న శివనారాయణ దగ్గరకు వెళ్లి సూరజ్‌ను మెచ్చుకుంటాడు. చాటు నుంచి అంతా విన్నారా..? బాబాయ్‌ అని అడగ్గానే.. వినకపోతే నిజానిజాలు తెలియవు కదా..? అంటూ శివనారాయణ చెప్పగానే.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. పారు, జ్యోత్స్న ఇరిటేట్‌గా ఫీలవుతుంటారు.

లోపలికి వెళ్లాక పోటీకి అందరూ సిద్దంగా ఉంటారు. వంటల పోటీ మొదలవబోతుంది. రెండు రెస్టారెంట్లకు చెందిన చెఫులు ఇక్కడకు రండి అని చెప్పగానే.. దీప కిరణ్‌ అని పిలవగానే.. కిరణ్‌ వచ్చి దీప సైడు నిలబడగానే.. మాలినిని మీ చెఫ్‌ ఎక్కడున్నాడండి అని అడగ్గానే.. వస్తాడు అని చెప్తుంది. అప్పుడే కిరణ్‌ వెళ్లి మాలని వైపు నిలబడతాడు. కిరణ్‌ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ దీప అడగ్గానే.. కిరణ్‌ మౌనంగా ఉంటాడు. శివనారాయణ కోపంగా తిట్టగానే.. నేను ఇప్పుడు డీఎం రెస్టారెంట్‌ వైపు కుక్‌ చేయడానికి వచ్చాను అంటూ కిరణ్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. శివనారాయణ కోపంగా ఏంటి దక్షిణమూర్తి మోసం చేసి గెలవాలనుకుంటున్నావా..? అంటూ నిలదీయగానే.. దక్షిణమూర్తి,  మాలినిని ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు.

Advertisement

తాను తెలిసి చేయలేదని.. రాత్రి ఆ చెఫ్‌ ఫోన్‌ చేసి మన రెస్టారెంట్‌లో జాయిన్‌ అవుతానన్నాడు. ఇంతకు ముందు ఎక్కడ పనిచేశావని అడిగాను జ్యోత్స్న రెస్టారెంట్‌లో పని చేశానని అక్కడ అగ్రిమెంట్‌ లేదని.. ఏమైనా ప్రాబ్లమ్‌ వస్తే తాను చూసుకుంటానని చెప్పాడు అందుకే తీసుకున్నాను అని చెప్తుంది. అంతా పక్క నుంచి గమనిస్తున్న పారు, జ్యోతో నేను చెప్పానా ఈ మాలిని మామూలుది కాదని అంటుంది. దెబ్బ అదుర్స్‌ కదా…? మనం చేయాల్సిన పని తను చేసింది. కానీ దీని వల్ల దీప చెడ్డది కాలేదు అంటుంది. నేను చేస్తాను కదా అంటూ పారు బాధ్యతుల నీ మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా దీప అంటుంది. కార్తీక్‌ కోపంగా పారును తిడుతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇంతలో మాలిని మీరు పోటీలో ఉంటారా..? తప్పుకుంటారా..? పది నిమిషాల్లో డిసైడ్‌ అవ్వండి అని చెప్తుంది. శివనారాయణ పోటీలో ఉంటానని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు.

సూరజ్‌ బయటకు వెళ్లి జ్యూస్‌ తాగుతుంటే.. జ్యోత్స్న వెళ్లి తన వైపు రమ్మని తాను చెప్పింది వినమని అడుగుతుంది. ఇప్పుటిదాకా నువ్వు అనుకున్నదే జరిగింది కదా..? ఇంకా నేనెందుకు నీవైపు రావాలి అని అడుగుతాడు సూరజ్‌ అందుకు జ్యో ఇప్పుడు నువ్వు వెళ్లి దీపకు ఏదో ఒకరకంగా హెల్ప్‌ చేయాలని చూస్తావు.. అది చేయోద్దని చెప్తున్నాను.. చేస్తే ఏం ఇస్తావని సూరజ్‌ అడిగితే.. నువ్వు ఏం కావాలని అడిగినా ఇస్తానని జ్యో చెప్తుంది. బాగా ఆలోచించి చెప్పు అనగానే.. జ్యో ఆలోచించే చెప్తున్నాను అంటుంది. అందుకు సూరజ్‌, దీపను ఓడించలేను అని చెప్తాడు. అందుకు జ్యో చేస్తే నువ్వు ఏం అడిగినా ఇస్తాను అంటూ చెప్తుంది. అందుకు సూరజ్‌ ఓకే బంగారం ఈ ఒక్కరోజు నేను నీసైడే ఉంటాను.. కానీ నువ్వు ఏం చెప్తే అది చేయను.. నిన్న సమర్థిస్తాను అని సూరజ్‌ చెప్పగానే.. ఈ మాట మీదే నిలబడతావా..? అని అడుగుతుంది. నువ్వు నన్ను మోసం చేయనంతవరకు నేను నిన్ను మోసం చేయను అంటాడు సూరజ్‌.

Advertisement

శివనారాయణ ఆలోచిస్తుంటే.. సుమిత్ర వచ్చి తనను క్షమించమని అడుగుతుంది. ఇదంతా తాను ముందే ఊహించానని చెప్తాడు. పారిజాతం వచ్చి దీపను తిడుతుంది. దీప అసమర్థత వల్లే ఇలా జరిగిందని తిడుతుంది. కార్తీక్‌ కోపంగా వాడు అమ్ముడుపోతే దీపను అంటావేంటి పారు అని అడుగుతుంటే.. అప్పుడే జ్యోత్స్న వచ్చి దీపనే తిడుతుంది. దీప అలసత్వం వల్లే ఇలా జరిగింది అంటూ మాట్లాడుతుంది. అయితే కార్తీక్‌ మాత్రం వెంటనే మనకో మంచి చెఫ్‌ కావాలి ఎలా అని అడగ్గానే.. సూరజ్‌ మంచి చెఫ్‌ ఉన్నారు బ్రదర్‌.. అదీ ఇక్కడే ఉన్నారు అని చెప్పగానే.. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే..

మేడం జ్యోత్స్న గారే మంచి చెఫ్‌.. వీరే తాతగారి పరువు నిలబెడతారు అంటాడు. సూరజ్‌ మాటలకు జ్యో, పారు షాక్‌ అవుతారు. వీడేంటి నన్ను ఇలా ఇరికించారు.. అని మనసులో తిట్టుకుంటుంది. అందరూ వద్దని చెప్తుంటే.. ముందు మీరు నన్ను నమ్మండి.. నమ్ముతున్నారా లేదా అని అడగ్గానే.. శివనారాయణ నేను నమ్ముతున్నాను అని చెప్పగానే.. దీప కూడా నమ్ముతున్నాను అంటుంది. కార్తీక్‌ మాత్రం ఏం జరిగినా కంపెనీ సీఈవోగా దీప తల దించుకోవాలి. చైర్మన్‌గా సార్‌ తల దించుకోవాలి అంటూ చెప్పి అందరూ లోపలికి వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×