E-Paper
Advertisement

ఆస్తి కోసం కన్న తండ్రినే కాటేసిన కొడుకు.. ఉత్తరప్రదేశ్‌లో ఘోరం

ఆస్తి కోసం కన్న తండ్రినే కాటేసిన కొడుకు.. ఉత్తరప్రదేశ్‌లో ఘోరం
Advertisement

Property dispute: ఆస్తి వ్యామోహం మనుషులను ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. కన్నప్రేమను, రక్తం పంచుకు పుట్టిన బంధాన్ని సైతం మర్చిపోయేలా చేస్తోంది. కేవలం డబ్బు, భూమి కోసమే కన్నతండ్రిని ఓ కుమారుడు అత్యంత దారుణంగా కాల్చి చంపిన ఘోర ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఘాజియాబాద్ జిల్లాలోని మోదీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలు వివాదం ఏంటి?
బుదానా గ్రామానికి చెందిన హరి ఓమ్ చౌదరి ఆ ప్రాంతంలోనే అత్యంత సంపన్న రైతుగా పేరుగాంచారు. ఆయనకు సుమారు 50 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమితో పాటు, ఒక పెద్ద కమర్షియల్ మార్కెట్ కూడా ఉంది. వీటి మొత్తం విలువ సుమారు రూ. 150 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. హరి ఓమ్ చౌదరికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కొడుకు నిఖిల్‌(32) భవిష్యత్తు బాగుండాలని మార్కెట్‌లోని విలువైన షాపులతో పాటు 15 ఎకరాల భూమిని ఇప్పటికే అతని పేరిట రాసిచ్చాడు. అయితే, విలాసాలకు, మద్యానికి బానిసైన నిఖిల్ కన్న తండ్రి దగ్గరున్న మిగతా ఆస్తిపై పడింది. మిగిలిన భూమిని కూడా తనకే రాసివ్వాలంటూ అతను ప్రతిరోజూ తండ్రితో గొడవకు దిగడమే ఈ వివాదానికి ప్రధాన కారణం.

Advertisement

మద్యం మత్తులో ఘాతుకం..
బుధవారం రాత్రి ఎప్పటిలాగే విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన నిఖిల్, ఆస్తిని తన పేరిట బదిలీ చేయాలంటూ తండ్రి హరి ఓమ్‌తో మళ్లీ తీవ్రమైన వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నిఖిల్, ముందస్తు ప్రణాళికతోనే తన వద్ద దాచుకున్న పిస్టల్ బయటకు తీశాడు. కన్నతండ్రి అని కూడా చూడకుండా హరి ఓమ్ ముఖం, ఛాతి, పొట్ట భాగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో బుల్లెట్లు దూసుకుపోవడంతో హరి ఓమ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం నిందితుడు నిఖిల్ అక్కడి నుంచి పరారయ్యాడు.

పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు
కాల్పుల శబ్దాలు విని ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. హరి ఓమ్ శరీరంపై ఏకంగా ఆరు తూటాల గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని బట్టి నిందితుడు ఎంతటి కసిగా, క్రూరంగా తండ్రిని చంపేందుకు తెగించాడో అర్థమవుతోంది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, విచారణాధికారులు కీలక ఆధారాలను సేకరించారు.

Advertisement

నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసిన మోదీ నగర్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిఖిల్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తండ్రిని పొట్టనబెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అల్లారుముద్దుగా పెంచిన కొడుకే, ఆస్తి పిచ్చితో కన్నతండ్రిని కాల్చి చంపిన ఈ ఘాతుకం బుదానా గ్రామంలో విషాద ఛాయలు నింపింది.

Also Read: షాక్ అంటే ఇది.. విద్యుత్ బిల్లు సవాల్ చేస్తే కోర్టు ఏకంగా రూ. 20 లక్షల జరిమానా వేసింది!

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×