E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 17th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపకు భరోసా ఇచ్చిన కార్తీక్ 

Karthika Deepam 2 Serial Today march 17th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపకు భరోసా ఇచ్చిన కార్తీక్ 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: దీపను ఓదారుస్తూ అదే టైంలో దీపకు మనోధైర్యాన్ని ఇస్తాడు కార్తీక్‌. సుమిత్ర అత్తకి ఆపరేషన్ జరిగేంత వరకు ఎన్ని రకాలుగా అవమానించినా సరే మనం భరిద్దాం.. ఇప్పుడు మనల్ని అవమానిస్తున్న వాళ్లకు మనం బిడ్డను వద్దు అనుకుంటున్నామని మాత్రమే తెలుసు.. కానీ ఎందుకు వద్దు అనుకుంటున్నామో ఇప్పుడు వాళ్లుకు మనం చెప్పగలమా?  ఒకవేళ వాళ్లు మనల్ని బాగా ప్రెషర్‌ చేసి చెప్పేలా చేస్తే… నిజం తెలుసుకున్నాక వాళ్లు అర్థం చేసుకోగలరా..? వాళ్ల సంగతి పక్కన పెట్టు అసలు ఇప్పుడు సుమిత్ర అత్త ఉన్న మెంటల్ కండీషన్‌కు ఈ నిజాలు చెబితే తాను తట్టుకోగలదా..? ఇన్ని ఏళ్లుగా తాను పెంచింది కన్నకూతురు కాదని పరాయి వాళ్ల కూతురు అని  తెలిస్తే అత్త  తట్టుకోగలదా..?

చూడు దీప అత్తకు ఆపరేషన్ జరగకపోయినా కాదు.. జ్యోత్స్న తన కన్నకూతురు కాదని తెలిసినా చనిపోతుంది.. అని కార్తీక్‌ చెప్పగానే.. దీప షాక్‌ అవుతుంది. భయంతో కంపించిపోతుంది. దీంతో కార్తీక్‌ చూడు వాళ్లిద్దరూ నిన్ను రెచ్చగొట్టి తమ ప్రశ్నలతోనే నిన్ను టార్చర్‌ పెట్టాలని చూస్తున్నారు. నువ్వు అనవసరమైన వాటిని పట్టించుకోకుండా ముందు మీ అమ్మను కాపాడుకోవాలి. ఓ కూతురుగా నువ్వేం చేస్తావో చేయ్‌.. నీ భర్తగా నేనేం చేయాలో అది చేస్తా.. అంతే కానీ ఎవరో ఏమో అనుకుంటున్నారని ఆగిపోకూడదు.. ఈ సమాజం మొత్తం వేలెత్తి చూపించినా సరే నేనే నీకు తోడుగా ఉంటాను అని కార్తీక్‌ చెప్పగానే.. అప్పటికే ఎమోషనల్‌ గా ఉన్న దీప ఏడుపు ఆపుకోలేక కార్తీక్‌ను హగ్‌ చేసుకుంటుంది. ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేను అంటూ బాధపడుతుంది.

Advertisement

గురువుగారి దగ్గర ఉన్న దశరథ బాధపడుతుంటాడు. తాను ఎవ్వరినీ పోగొట్టుకోవడానికి సిద్దంగా లేనని చెప్తాడు. దీంతో గురువు గారు జరిగే భవిష్యత్తును ఆపడం మీ వల్ల అవుతుందా..? ఎలా జరగాలని రాసి పెట్టి ఉంటే అలా జరిగిపోతుంది. ఫలితం లేని ప్రయత్నం చేయడం వృథాయే కదా అంటూ గురువు గారు హితబోధ చేయగానే.. దశరథ బాధపడుతూ.. జరిగే దానిని నేను అడ్డుకోలేకపోతున్నాను గురువుగారు.. అలాగే జరిగే దానిని మానసికంగా ఒప్పుకోలేకపోతున్నాను.. ఒక ప్రాణం కోసం మరో ప్రాణం పోతుందని తెలిస్తే దాని కంటే ముందు నా ప్రాణం పోయినా బాగుండు అంటూ దశరథ బాధపడతాడు.

నా కూతురు బాగుండాలి, నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుండాలి, నా భార్య బతకాలి.. ముగ్గురిలో ఎవరికీ ఏం కాకూడదు.. మీరే ఏదో ఒక మార్గం చూపించాలి గురువుగారు అంటూ దశరథ అడగ్గానే.. గురువుగారు హోమం చేయమని చెప్తాడు. ఆ హోమం కూడా చాలా నిష్టగా హోమం మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు  మీరు ఎటు కదలకుండా చేయాలని చెప్పగానే.. దశరథ సరే అయితే హోమానికి ఏర్పాట్లు చేయమని గురువుకు చెప్తాడు దశరథ. అయితే  ఈ విషయం మళ్లీ ఎవరికి చెప్పొద్దని మనిద్దరి మధ్యే ఉండాలని అంటాడు దశరథ. దీంతో గురు నీ సంకల్ప నెరవేరాలని ఆ భగవంతుడిని వేడుకుంటాను దశరథ అంటూ గురువు వెళ్లిపోతాడు.

Advertisement

కార్తీక్‌, దీపలు ఇద్దరూ బిడ్డను వద్దనుకుంటున్నారన్న విషయం తెలిసిన కావేరి ఇద్దరిని తిడుతుంది. దీంతో  అక్కడే ఉన్న స్వప్న, కావేరిని తిడుతుంది. వాళ్లిద్దరి గురించి మనకు తెలుసు.. ఏదో బలమైన కారణం ఉంటేనే అన్నయ్య వదిన ఇలా చేస్తారని చెప్తుంది. అక్కడే ఉన్న కాశీ కూడా స్వప్న మాటలను సమర్థిస్తూ.. కార్తీక్‌, దీపలను వెనకేసుకొస్తాడు. దీంతో శ్రీధర్‌ వాళ్లిద్దరేమో కానీ మీ ఇద్దరిని చూస్తుంటే.. చాలా ముచ్చటగా ఉందంటాడు. మీ మనసులు కలవడం లేదు.. కానీ కార్తీక్‌, దీప విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు.. నిజంగా మీ మనసులు కలవడం లేదా..? అంటూ ప్రశ్నించగానే.. కాశీ, స్వప్న ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×