E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ :  దీపను చంపేస్తానన్న జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode May 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ :  దీపను చంపేస్తానన్న జ్యోత్స్న
Advertisement

karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్నను సీఈవోను చేయడంపై కార్తీక్‌, శ్రీధర్‌ ఇద్దరూ శివనారాయణ దగ్గరకు వెళ్లి ఆబ్జెక్షన్‌ చెప్తారు. ఎందుకు జ్యోత్స్నను సీఈవోగా ప్రకటించారని అడగ్గానే.. శివనారాయణ బోర్డు మెంబర్‌ చెప్పిన మాటలు గుర్తు చేస్తాడు. బయటి వ్యక్తులను లోపలికి తీసుకొస్తే లోపలి వ్యక్తులు బయటకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు కదా..? దాని కంటే ముఖ్యమైనది మరోకటి జరిగింది. జ్యోత్స్న సీఈవో కావాలనే తన నిర్ణయాన్ని నా ముందు సుమిత్రకు చెప్పింది. అలాగే మనం ఏమనుకున్నామో అదే జ్యోత్స్న చెప్పింది తనకు ఎలా తెలిసిందో తెలియదు.. అలాగే సుమిత్ర ఆనందం కోసం కూడా జ్యోత్స్నను సీఈవోగా ప్రకటించాను అని నా కొడలి కోసమే జ్యోత్స్నను సీఈవోను చేశాను అని చెప్తుండగానే.. దశరథ వస్తాడు. నెల్లూరు బ్రాంచీ ఎలా ఉంది అని అడగ్గానే.. బాగానే ఉందని చెప్పగానే.. శివనారాయణ, శ్రీధర్‌ వెళ్లిపోతారు. దశరథ, కార్తీక్‌ ఇద్దరూ కలిసి జ్యోత్స్న ఆడిన నాటకం గురించి మాట్లాడుకుంటారు.

మరోవైపు పారిజాతం, జ్యోత్స్న పార్టీ చేసుకుంటుంటారు. నువ్వు చాలా సాధించావే అంటూ పారిజాతం మెచ్చుకోగానే.. నేను ఇంకా సాధించాలి. నేను సీఈవో కాదు చైర్మన్‌ కావాలి అని చెప్తుంది. దీంతో ఓ తాత పోస్టుకే ఎసరు పెట్టావన్నమాట.. ఆస్థి మొత్తం నీ చేతిలో ఉడేలా ప్లాన్ చేశావన్నమాట. ఇక కొత్త సీఈవోను పెళ్లి చేసుకో అంటూ చెప్పగానే.. నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోను బావను తప్పా ఈ ఆస్థి నాదే బావ నావాడే.. అంటూ చెప్పగానే.. పారిజాతం కోపంగా అంటే నీకింకా వాడి మీద ఆశ చావలేదా..? అని అడగ్గానే.. జ్యోత్స్న కూడా కోపంగా చావలేదు గ్రాని ఇదంతా జరగాలంటే దీప ఉండకూడదు. నా ఆస్థి నాకు దక్కాలంటే కూడా దీప ఉండకూడదు.. అనగానే.. నువ్వు మళ్లీ ఏదో తప్పు చేస్తున్నావే అంటుంది పారిజాతం. జ్యోత్స్న మాత్రం ఇప్పుడే కరెక్ట్‌ చేస్తున్నాను. అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత కార్తీక్‌, దీప వెళ్లిపోతుంటే జ్యోత్స్న వెళ్లి నా దెబ్బ ఎలా ఉంది అంటూ అడుగుతుంది. దీంతో దీప కోపంగా గెలిచానని అప్పుడే సంబరపడిపోకు మా బావ మాటిచ్చినట్టు నెల రోజుల్లోనే నీ పెళ్లి చేస్తాం అంటుంది. మాట తప్పేది లేదు.. ఓడిపోయేది లేదు అనగానే.. జ్యోత్స్న ఒకవేళ ఓడిపోతే అని అడగ్గానే.. దీప నువ్వు ఏది అడిగితే అది ఇస్తాం.. అనగానే.. మాట మీద ఉంటావా..? అని జ్యోత్స్న అడగ్గానే.. మాట ఇస్తే తప్పము అంటూ దీప చెబితే ఈ మాట బావను చెప్పమను అంటూ జ్యోత్స్న అడిగితే..కార్తీక్‌ కూడా ఇక్కడ రెండు మాటలు లేదు చిన్న మరదలా..? ఒకటే మాట ఒకటే బాట అని చెప్పగానే.. డోర్‌ దగ్గర నుంచి అంతా గమనిస్తున్న శ్రీధర్‌ షాక్‌ అవుతాడు. జ్యోత్స్న మాత్రం అయితే మాట ఇచ్చారు అది నిలబెట్టుకోండి అనగానే.. దీప కౌంటర్‌గా మేము గెలుస్తామన్న భయం నీలో మొదలైనట్టు ఉంది అనగానే.. అలా కనిపిస్తున్నానా..? అనగానే.. తొందరలోనే కనిపించేలా చేస్తాను అనగానే అయితే వెళ్దాం పదండి.. అంటూ ముగ్గురు బయటకు రాగానే.. జ్యోత్స్న శ్రీధర్‌ను చూసి ఏంటి మామయ్య మీరు ఇంకా వెళ్లలేదా..? అని అడగ్గానే.. వీళ్ల కోసమే ఆగాను అంటాడు. జ్యోత్స్న మాత్రం వీళ్లను నేను డ్రాప్‌ చేస్తాను మీరు వెళ్లండి మామయ్య అంటుంది. శ్రీధర్‌ వెళ్లిపోతాడు.

ఇంటికి వెళ్లిన శ్రీధర్‌, శివనారాయణ ఇంట్లో జరిగిన కార్తీక్‌, దీప, జ్యోత్స్న మాట్లాడుకున్నది మొత్తం చెప్తాడు. కాంచన టెన్షన్‌ పడుతుంది. ఇంతలో కార్తీక్‌, దీప వస్తారు. శ్రీధర్‌ను ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారేంటి..? అని అడగ్గానే.. నీతో మాట్లాడాలి అని వచ్చాను అని చెప్పగానే.. కార్తీక్‌ సరే అంటూ చెప్పగానే.. శ్రీధర్‌ బయటకు వెళ్లి మాట్లాడుకుందాం పద అంటూ ఇద్దరూ బయటకు వెళ్తారు.

Advertisement

బయటకు వెళ్లిన శ్రీధర్‌, జ్యోత్స్న చాలా డేంజర్‌ అని మీరెందుకు మీ జీవితాలను పణంగా పెట్టి ఈ గేమ్‌ ఎందుకు ఆడుతున్నారు. దీపకు జ్యోత్స్నకు ఏంటి సంబంధం. దీపకు ఆ కుటుంబానికి ఏంటి సంబంధం అని అడగ్గానే.. దీపకు ఆ కుటుంబానికి సంబంధం ఉంది అని కార్తీక్‌ చెప్పగానే.. శ్రీధర్‌ షాక్‌ అవుతాడు. ఏంటా సంబంధం అని శ్రీధర్‌ అడిగినా కార్తీక్‌ సంబంధం ఉంది కానీ ఏంటా సంబంధం అని మాత్రం చెప్పడు.. కొద్ది రోజుల్లో అన్ని కుదురుకుంటాయి. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్లు అంటూ శ్రీధర్‌ను ఇంటికి పంపిస్తాడు కార్తీక్‌.

తర్వాత బోర్డు మీటింగ్‌లో జ్యోత్స్నను సీఈవోగా తాను ఒప్పుకోవడం లేదని దశరథ చెప్తాడు. అందరూ ఆలోచించి కార్తీక్‌ను సీఈవోగా ఉండమని రిక్వెస్ట్‌ చేస్తారు. కార్తీక్‌ అందుకు ఒప్పుకోడు. ఈ పరిణామాలకు గమనించిన జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×