E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సీఈవోలుగా సమాన ఓట్లు తెచ్చుకున్న దీప, జ్యోత్స్న  

Karthika Deepam 2 Serial Today Episode May 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సీఈవోలుగా సమాన ఓట్లు తెచ్చుకున్న దీప, జ్యోత్స్న  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: బోర్డు మీటింగ్‌లో ఓటింగ్‌ జరిగిన తర్వాత లెక్కింపు జరుగుతుంది. ఓటింగ్‌ స్లిప్పులు ఒక్కొక్కటి తీసి చూసి పేరు చదివి శివనారాయణకు ఇస్తుంది జ్యోత్స్న. మెజారిటీకి దీపకు ఒక్క ఓటు తక్కువ ఉండటంలో జ్యోత్స్న టెన్షన్‌ పడుతుంది. ఇంతలో కార్తీక్‌ ఇంక ఒక్క ఓటు దీపకు వస్తే దీప గెలిచినట్టే అని చెప్తాడు. జ్యోత్స్న కూడా ఇది కనక దీపకు వస్తే ఇక నా పరువు గంగలో కలిపిసోయినట్టే అని భయపడుతూ.. చీటి తెరిచి చూస్తుంది. అందులో జ్యోత్స్న పేరు వస్తుంది. దీంతో శివనారాయణ అదేంటి ఇద్దరికీ సమానమైన ఓట్లు వచ్చాయి ఇప్పుడెలా అంటూ చెప్పగానే.. ఏముంది ఇద్దరూ సీఈవోలుగా ఉంటారు అని చెప్పగానే.. జ్యోత్స్న అదెలా సాధ్యం అవుతుంది అంటూ ప్రశ్నిస్తుంది. సాధ్యం అవుతుంది ఇద్దరినీ సీఈవోగా చేస్తాను కానీ ఇద్దరికీ పరీక్ష పెట్టి ఎవరు ఆ పరీక్షలో సక్సెస్‌ అవుతారో వారికే పూర్తి సీఈవో బాధ్యతలు అప్పగిస్తానని శివనారాయణ చెప్తాడు..

దీంతో ఏం పరీక్ష పెడతారని పారిజాతం అడగ్గా.. మన రెస్టారెంట్లలో రెండు లాసులో ఉన్నాయి వాటిలో చెరోకటి ఇస్తాను రెండు వారాల తర్వాత ఎవరైతే రెస్టారెంట్‌ను లాభాల బాటలో నడిపిస్తారో వారికే రెండు వారాల తర్వాత బోర్డు మీటింగ్‌ ఏర్పాటు చేసి పూర్తి బాధ్యతలు అప్పగిస్తాను.. మీకు ఓకేనా అని అడగ్గానే.. జ్యోత్స్న నాకు ఓకే చైర్మన్‌ గారు అంటుంది. దీప కూడా ఓకే అంటుంది. చాలా న్యాయబద్దమైన పోటీ పెట్టారు థాంక్యూ చైర్మన్‌ గారు అని చెప్పగానే.. జ్యోత్స్న వెంటనే పోటీలో దీపకు కార్తీక్‌ ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు అని చెప్తుంది. దీంతో కార్తీక్‌ సలహాలు ఇవ్వను.. అని చెప్పగానే.. పాయింట్‌ నెంబర్‌ టూ నువ్వు దీప విడిపోవాలి అనగానే.. అందరూ షాక్‌ అవుతారు. దశరథ కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. అనగానే..

Advertisement

విడిపోవాలి అంటే శాశ్వతంగా కాదు డాడీ ఈ పోటీ జరుగుతున్న రెండు వారాలు బావ, దీప కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదు అని చెప్పగానే.. కార్తీక్‌ కోప్పడతాడు. దీంతో జ్యోత్స్న నాతో పోటీ పడగలిగే దమ్ము దీపకు ఉంటే నాతో పోటీ పడమనండి.. లేదంటే పోటీ నుంచి తప్పుకోమని చెప్పమనండి.. చెప్పు దీప అందరూ నీ నిర్ణయం కోసమే వెయిట్‌ చేస్తున్నారు.. అని అడగ్గానే.. కార్తీక్‌ ఒప్పుకోవద్దు అని చెప్తుండగానే.. దీప పోటీకి నేను ఒప్పుకుంటున్నాను… ఈ రెండు వారాలు నీకు దూరంగా ఉండటానికి నేను ఒప్పుకుంటున్నాను.. అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. జ్యోత్స్న తన మాటలతో దీపను రెచ్చగొడుతుంది. దీపను తొందరపడొద్దని చెప్పరా అంటూ దశరథ చెప్పినా అదంతా నా చేతుల్లోంచి జారిపోయింది మామయ్య దీప ఏం చెప్పినా కట్టుబడి ఉండాల్సిందే.. అంటాడు. దీప పోటీ నుంచి తప్పుకోనని చెప్పగానే.. అగ్రిమెంట్స్‌ రేపు రెడీ చేయిస్తానని మీటింగ్‌ అయిపోయిందని శివనారాయణ చెప్పి వెళ్లిపోతాడు.

ఇంటికి వెళ్లిన శ్రీధర్‌, కాంచనతో ఆఫీసులో జరిగిన విషయాలు చెప్తుంటే.. అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న  నేను చెప్తాను ఉండు మామయ్య అంటూ చెప్పగానే.. కాంచన కోప్పడుతుంది. జ్యోత్స్నను ఇంటికి ఎందుకు వచ్చావని తిడుతుంది. నీ ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇస్తుంది. జ్యోత్స్న, కార్తీక్‌ను తీసుకెళ్తుంటే.. ఆపేసి కాంచన కోప్పడుతుంది. దీంతో రెండు వారాల కార్తీక్‌ మా ఇంట్లోనే ఉంటాడని అసలు విషయం చెప్తుంది జ్యోత్స్న. కాంచన షాక్‌ అవుతుంది. కార్తీక్‌ ను తిడుతుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×