E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దక్షిణమూర్తికి యాక్సిడెంట్ – బ్లడ్ డొనేట్ చేసిన శివనారాయణ 

Karthika Deepam 2 Serial Today Episode May 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దక్షిణమూర్తికి యాక్సిడెంట్ – బ్లడ్ డొనేట్ చేసిన శివనారాయణ 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కార్తీక్‌, దీప ఇద్దరూ కలిసి స్కూటీ మీద వెళ్తుంటే.. రోడ్డు మీద దక్షిణమూర్తి కారు రిపేరి అయి నిలబడి ఉంటాడు. అప్పుడే కార్తీక్‌, దీపలను చూసి  పిలుస్తాడు. కార్తీక్‌ తిరిగి చూసి దక్షిణమూర్తి కోసం వెళ్తుంటే.. వెనక నుంచి వచ్చి వెహికిల్‌ దక్షిణమూర్తిని గుద్దేసి పోతుంది. దీంతో దక్షిణమూర్తి తల బండరాయికి తగులుతుంది. స్పృహ కోల్పోతాడు. కార్తీక్‌, దీప దక్షిణమూర్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఆయనకు సీరియస్‌గా ఉందని వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్తారు. కార్తీక్‌ చేయమని డాక్టర్లకు చెప్పి.. డ్రైవర్‌ను పిలిచి దక్షిణమూర్తి వివరాలు అడిగితే తాను లోకల్‌ డ్రైవర్‌ అని సార్‌ ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్‌ చేసి పిలుస్తాడని సార్‌ను పికప్‌ చేసుకుని తిప్పుతుంటానని అంతకు మించి తనకేం తెలియదని డ్రైవర్‌ చెప్తాడు.

అదే సమయంలో శివనారాయణ, శ్రీధర్‌ హాస్పిటల్‌ లో డాక్టర్‌ దగ్గర మాట్లాడుతుంటారు. శ్రీధర్‌ కు వీలైనంత త్వరగా ఆపరేషన్‌ చేయాలని చెప్తాడు. శివనారాయణ షాక్‌ అవుతాడు. ఆపరేషనా..? అంటూ కంగారుగా అడగ్గానే.. శ్రీధర్‌ మామయ్య గారు నాది గట్టి పిండం నాకేం కాదు మీరేం భయపడకండి అంటూ ధైర్యం చెప్పి ఇంట్లో వాళ్లతో మాట్లాడి మళ్లీ వచ్చి కలుస్తామని చెప్పి శ్రీధర్‌, శివనారాయణ వెళ్లిపోతారు.

Advertisement

ఇంట్లో కూర్చున్న జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కార్తీక్‌, దీపలు గుడికి వెళ్లి ఇంకా రాలేదేంటని ఆలోచిస్తుంటారు. జ్యోత్స్న, కార్తీక్‌కు ఫోన్‌ చేస్తుంది. ఎక్కడున్నాని అడుగుతుంది. దీంతో కార్తీక్‌ తెలిసిన మనిషికి యాక్సిడెంట్‌ అయితే హాస్పిటల్‌కు తీసుకొచ్చామని చెబితే కట్టుకథలు చెప్పకు అంటూ జ్యోత్స్న అంటుంది. కార్తీక్ కోపంగా తిడుతూ.. మాట్లాడుతూ కాల్ కట్‌ చేస్తాడు. అప్పుడే శివనారాయణ, శ్రీధర్‌ బయటకు వెళ్తూ.. కార్తీక్‌, దీపలను చూస్తారు. దగ్గరకు వెళ్లి మీరేంటి ఇక్కడున్నారు.. ఆ చేతి రక్తం మరకలేంటి..? అని అడగ్గానే.. కార్తీక్‌, దీపలు షాక్‌ అవుతారు. ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తుంటారు. అప్పుడే డాక్టర్‌ వచ్చి కార్తీక్‌ పేషెంట్‌కు బ్లడ్‌ ఎక్కువగా పోయింది. చాలా సీరియస్‌గా ఉంది. కాపాడటం చాలా కష్టం.. అర్జెంట్‌గా ఏ పాజిటివ్‌ బ్లడ్‌ కావాలి అని చెప్పగానే.. శ్రీధర్‌, శివనారాయణ ఏం జరిగిందిరా..? ఎవరు..? మన ఇంట్లో వాళ్లు అయితే కాదు కదా..? అంటూ అడగ్గానే..

కాదు తాత అని కార్తీక్‌ చెప్పగానే.. అయితే నాది ఏ పాజిటివ్‌ బ్లడ్‌ తీసుకోండి అంటూ శివనారాయణ బ్లడ్‌ డోనేట్‌ చేస్తాడు. కార్తీక్‌ మాత్రం మనసులో భయడపడుతుంటాడు. ఇంతలో శ్రీధర్‌ వెళ్లి ఐసీయూలో ఉన్న దక్షిణమూర్తిని చూస్తాడు. వెంటనే షాక్‌ అవుతాడు. కార్తీక్‌ చూసి కంగారుపడతాడు. నాన్నకు నిజం తెలిసిపోయింది అని దీపతో చెప్తాడు. కంగారుగా ఐసీయూలోంచి శ్రీధర్‌ బయటకు వస్తాడు. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందో తెలుసా..? అనగానే.. అవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయని అంటాడు కార్తీక్‌. శ్రీధర్‌ మాత్రం శివనారాయణకు నిజం తెలిస్తే.. నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అంటాడు. అయితే నన్నేం చేయమంటావు అని కార్తీక్‌ అడిగితే నిజం చెప్పేయ్‌ అంటాడు శ్రీధర్‌. అప్పుడే బ్లడ్‌ ఇచ్చిన శివనారాయణ బయటకు వస్తాడు. బ్లడ్‌ ఇచ్చాను.. అతనికి ఏ ప్రాబ్లమ్‌ లేదు అంటాడు. అలాగే శ్రీధర్‌ అతన్ని ఒకసారి చూద్దాం పద అంటాడు శివనారాయన. కార్తీక్‌, దీప, శ్రీధర్‌ భపడుతుంటారు. శివనారాయణ ఐసీయూ వైపు వెళ్తుంటాడు. ఐసీయూ డోర్‌ ఓపెన్‌ చేస్తుండగానే.. శివనారాయణకు ఫోన్‌ వస్తుంది. శివనారాయణ దక్షిణమూర్తిని చూడకుండానే.. శ్రీధర్‌ ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

ఇంటికి వెళ్లిన శ్రీధర్‌ హాస్పిటల్‌ లో జరిగిన విషయం కాంచనకు చెప్తుంటే.. చాటు నుంచి జ్యోత్స్న, పారిజాతం వింటారు. ఈ నిజం మామయ్య గారికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది కాంచన అని చెప్పగానే.. జ్యోత్స్న మాత్రం మనం ఓ చాన్స్‌ కోసం చూస్తుంటే.. వాళ్లే గోల్డెన్‌ చాన్స్‌ ఇచ్చారు. ఇక అంత ఈజీగా వదలకూడదు అంటుంది. ఇక హాస్పిటల్ లో స్పృహలోకి వచ్చిన దక్షిణమూర్తి, కార్తీక్‌, దీపలకు థాంక్స్‌ చెప్తుంటే.. మాకు కాదని శివనారాయణకు చెప్పమని మీకు రక్తం ఇచ్చింది మా తాతనే అని కార్తీక్‌ చెప్పగానే.. దక్షిణమూర్తి షాక్‌ అవుతాడు. ఎమోషనల్ అవుతాడు. దీంతో కార్తీక్‌ కర్మసిద్దాంతం ఎవ్వరూ తప్పించలేరు అంటాడు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×