E-Paper
Advertisement

Podarillu Today Episode : ప్రతాప్ కు షాకిచ్చిన చక్రీ.. పుట్టింటికి వెళ్లిన మహా.. సెంటిమెంట్ సీన్ తో హైలెట్..

Podarillu Today Episode : ప్రతాప్ కు షాకిచ్చిన చక్రీ.. పుట్టింటికి వెళ్లిన మహా.. సెంటిమెంట్ సీన్ తో హైలెట్..
Advertisement

Podarillu Today Episode May 26th : అందరూ భోజనం చేసిన తర్వాత ప్రతాప్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అందుకే ఇంత దూరం వచ్చాను అని అంటాడు. నేను ఇంత దూరం రావడానికి ఒక కారణం ఉంది ఎన్ని రోజులైనా నా కూతురికి నేను దూరంగా ఉంటాను అందుకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అని అంటారు ప్రతాప్. ఇన్ని రోజులు నా కూతుర్నే అల్లుడిని దూరం చేసుకున్నాను.. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను కొద్ది రోజుల తర్వాత వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు అని ప్రతాప్ అంటాడు.. ఆ మాట వినగానే చక్రి షాక్ అవుతాడు. మహాలక్ష్మి మాత్రం నేను ఆ ఇంటికి రాను నాన్న నాకు చాలా కోరికలు ఉన్నాయి వాటిని తీర్చుకున్న తర్వాత ఆ ఇంటికి వస్తాను అని అంటుంది.. అందరూ చాలా సంతోషంగా ఉంటారు.

నేను రాను.. మహా రాదు..

ప్రతాప్ తన కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పగానే అందరూ ఒప్పుకుంటారు కానీ చక్రి మాత్రం నాకు రావడానికి వీల్లేదు అని చెప్తాడు. ఇంపార్టెంట్ ట్రిపుల్ చాలా పడ్డాయి పోయినసారి చాలా వదిలేసినందుకు నాకు ఇప్పుడు కరెక్ట్ గా చేయాలి అని వార్నింగ్ ఇచ్చారు అని అంటాడు. నేను రాను కాబట్టి మహాలక్ష్మి కూడా రాదు అని అంటాడు. ఆ మాట వినగానే ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అల్లుడు గారు మీరు మాట్లాడేది మీ కుదరకపోతే చెప్పండి నేను మహాను తీసుకొని వెళ్ళిపోతాను అని ప్రతాప్ అనగానే చక్రి తో మాట్లాడాలి అని మహా బయటకు తీసుకుని వెళుతుంది..

చక్రికీ షాకిచ్చిన మహా..

Advertisement

మీతో ఒకసారి నేను మాట్లాడాలి ఒకసారి పక్కకు వస్తారా అని అడుగుతుంది మహాలక్ష్మి. అయితే మహాలక్ష్మి ఎందుకు పిలుస్తున్నానని పక్కకు వెళ్లిన చక్రి ఏమైందండీ ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతాడు.. మీరు ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని మహాలక్ష్మి అంటుంది.. నాకు యాక్షన్ ఏ సరిగ్గా రాదు ఓవరాక్షన్ ఏం చేస్తాను మీరేం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అని చక్రి అడుగుతాడు.. మా నాన్న అంతట ఆయనే వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాను అని అన్నాడు కదా ఇప్పుడు మీరు ఎందుకు ఇంతగా ఇది చేస్తున్నారు అని మహా అంటుంది.. మీకోసం నేను వస్తాను లేండి అని చక్రి అనగానే మహా సరే అంటుంది.

పుట్టింటికి వెళ్లిన మహా..

మహాలక్ష్మి తన తండ్రి భర్తతో కలిసి మొదటిసారి పుట్టింటికి బయలుదేరుతుంది.. ప్రతాప్ ప్లాన్ ప్రకారం మహాలక్ష్మిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు.. ఈయన ఎందుకు తన కూతుర్ని సడన్గా తీసుకుని వెళుతున్నాడు నాకర్థం కావడం లేదు. ఛాలెంజ్లో భాగంగా వెళ్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే కేశవ మాత్రం చక్రి వెళ్లే ముందు పక్కకు పిలిచి ఏంట్రా వెళ్ళనివ్వను అని ఇప్పుడు మాట మార్చావేంటి అని అంటాడు.. ఆయన కావాలని తీసుకుని వెళుతున్నాడు రా నేను వెళ్లకపోతే ఇంకెప్పటికీ మహాలక్ష్మి ఇంటికి పంపించడు అని అనగానే అవునురా నువ్వు చెప్పింది కూడా నిజమే వెళ్లేసి మళ్లీ మహాలక్ష్మిని తీసుకొని రా అని అంటాడు..

కేశవకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

కేశవ షాపు దగ్గరికి శైలు వచ్చి చోటుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంట్రా మంచి మర్యాద లేకుండా అలా వెళ్ళిపోతున్నావు కనీసం పలకరించడం కూడా లేదు కదా అనేసి శైలు అడుగుతుంది. నువ్వేమన్నా నా చుట్టానివా లేకపోతే ఇదేమైనా నీకు కాలేజా నువ్వు రాగానే నిన్ను పలకరించి నీకు మర్యాదలు చేయడానికి అని కేశవ అడుగుతాడు అయితే శైలు ఇక్కడికి రావద్దు అన్న ఎందుకు వచ్చావు అని అంటున్నావు. నేను వచ్చింది నీకోసం కాదు నా ఫ్యాన్స్ కోసం అని అనగానే షాక్ అవుతాడు. నీతో రిలీజ్ చేసిన పాపానికి ఆ హ్యాండ్ ఎవరిదో చూపించమని నా ఫ్యాన్స్ అడుగుతున్నారు ఒక్క రీల్ చేద్దామని ఎంతగా బ్రతిమిలాడినా కేశవ మాత్రం ఒప్పుకోకపోవడంతో పాటు అక్కడి నుంచి శైలు తరిమేస్తాడు.

ఇంట్లోకి అడుగుపెట్టిన మహా..

మహాలక్ష్మి వాళ్ళు వెళుతుండగా మధ్యలో కార్ ఆపిన ప్రతాప్ డ్రైవర్ ని పంపిస్తాడు ఇక చక్రిని డ్రైవింగ్ చేయమని చెప్పగానే చక్రి నాకు అర్థం అయిపోయింది అని అనుకుంటాడు మొత్తానికి మహాలక్ష్మి తన పుట్టింటికి వెళ్తుంది తన వాళ్ళందరిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది . లలిత మొదట కోపంగా ఉన్న సరే తన కూతురుని చూడగానే గుండెలకి హత్తుకొని బాధపడుతుంది. హారతి ఇచ్చి చక్రి మహనీ లోపలికి తీసుకుని వెళ్తారు ఆ తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆది మహా ఇద్దరు కూడా ఒకరినొకరు మాటలు యుద్ధం చేసుకుంటూ పోట్లాడుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అమూల్య దెబ్బకు షాక్.. ఫ్యామిలీ లేడీస్ ఫైటింగ్ హైలెట్.. రామరాజు మాటకు నర్మద కన్నీళ్లు..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×