E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సూరజ్  

Karthika Deepam 2 Serial Today Episode May 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సూరజ్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: సూరజ్‌ రోడ్డు మీద క్యాబ్‌ కోసం వెయిట్‌ చేస్తుంటే కారులో వెళ్తున్న జ్యోత్స్న చూసి దగ్గరకు వెళ్తుంది. ఆరోజు షాపులో వీడు నాతో గొడవ పెట్టుకున్నాడు. వీడి ఈగో మీద దెబ్బ కొట్టాలి అనుకుంటూ దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. నన్ను గుర్తు పట్టరా..?అని అడుగుతుంది. దీంతో ఆరోజు గిఫ్ట్‌ షాపులో నాతో గొడవ పెట్టుకున్నారు కదా అంటాడు సూరజ్‌. మరెందుకు తెలియనట్టు ముఖం పెట్టారు అంటూ జ్యోత్స్న అడగ్గానే.. మీరేం నా బంధువు కాదు.. ఫ్రెండ్‌ కాదు మీరు కనబడగానే.. నవ్వడానికి అని చెప్తాడు. అయితే నీ తల పొగరు దించుతానురా అంటూ నవ్వుతూ మాట్లాడి సూరజ్‌ను ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తానని నమ్మించి కారెక్కించుకుని వెళ్తుంది.

మరోవైపు శ్రీధర్‌ నా డౌటు తీర్చుకున్నాకే ఇవాళ ఇంటికి వెళ్తాను అంటూ కాంచన చెప్తుంటే.. అప్పుడే కార్తీక్‌, దీప వస్తారు. హలో మాస్టారు మీరు ఇంకా వెళ్లలేదా..? అని అడగ్గానే.. ఆయనకే రెస్ట్ కాదు అందరికీ రెస్ట్ కావాలని ఆయన అంటున్నారు అని కాంచన చెప్తూనే.. దీపను రేపటి నుంచి ఆ ఇంటికి వెళ్లొద్దని ఆర్డర్‌ వేస్తుంది. కార్తీక్‌ అడ్డు పడితే శ్రీధర్‌ నీ భార్య ఏ కారణం చేత ఆ ఇంటికి వెళ్లాలి అంటూ అడగ్గానే..  చిన్నాభిన్నమైన మన ఫ్యామిలీ కోసం మేము కష్టపడుతున్నాం అని కార్తీక్‌ చెప్పగానే.. కాంచన కోపంగా అన్ని బరువులు నిన్ను మోయోద్దు అని చెప్తున్నాను అర్థం చేసుకో అంటుంది. కాంచన ఎంత చెప్పినా కార్తీక్‌ మాత్రం కన్వీన్స్‌ కాడు. కానీ నెల రోజుల్లో ఆ ఇంటికి వెళ్లడం మానేస్తామని కార్తీక్‌, దీప మాటిస్తారు. ఇంతలో శ్రీధర్‌ వెళ్లబోతుంటే.. నేను డ్రాప్‌ చేస్తాను పదండి అంటాడు కార్తీక్‌.

Advertisement

మరోవైపు సూరజ్ కారులో ఎక్కించుకున్న జ్యోత్స్న మధ్యలో దించేస్తుంది. సూరజ్‌ తనను మెయిన్‌ రోడ్డు దగ్గర డ్రాప్‌ చేయమని అడిగితే సారీ సూరజ్‌ గారు నేను రాలేను మీరు ఇంకా లెఫ్ట్‌ రైట్‌ కొట్టుకుంటూ వెళ్లండి అనగానే.. కొందరికి మాటల కంటే చేతలే మంచి గుణపాఠం నేర్పిస్తాయి అంటూ సూరజ్‌ వెళ్లిపోతాడు. జ్యోత్స్న కారు ఎక్కి స్టార్ట్‌ చేయబోతుంటే.. కీస్‌ ఉండవు.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. వాడు చివరలో చెప్పిన డైలాగ్‌ అర్థం ఇదా..? అనుకుంటూ సూరజ్‌ను తిడుతుంది. నేను నీకు షాక్‌ ఇద్దామనుకుంటే..నువ్వు నాకు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చావు కదరా..? అంటూ వెళ్లిపోతుంది.

మరోవైపు దీపను కార్తీక్‌ తిడుతుంటాడు. కాంచనకు మాటెందుకు ఇచ్చావని నిలదీస్తాడు. దీంతో దీప నువ్వు మా అమ్మ కోసం ఆరాటపడుతున్నప్పుడు నేను మీ అమ్మ కోసం మాటిచ్చాను అంటుంది. నువ్వు మాటిచ్చావని నేను మాటిచ్చాను అంటాడు కార్తీక్‌. కానీ జ్యోత్స్న ఏం చిన్న పిల్ల కాదు ప్రతిసారి బావతో పెళ్లి అని ఎందకు అంటుందో తెలుసా..? అందరినీ మెంటల్‌గా ప్రిపేర్ చేస్తుంది అని దీప చెప్పగానే.. అయితే ఊరికే పడుకో నేనేం చిన్న పిల్లాడిని కాదు.. నువ్వు పడుకో అంటాడు కార్తీర్‌. కానీ జ్యోత్స్న ఏదో ప్లాన్‌ లోనే ఉంది అంటుంది దీప. అవన్నీ పెళ్లి అయ్యే వరకే అంటాడు కార్తీక్‌. ఆ వచ్చే వాడు జ్యోత్స్నను ఎలా భరిస్తాడో ఏంటో అంటుంది దీప.

Advertisement

మరోవైపు రోడ్డు మీద నడుస్తున్న జ్యోత్స్న సూరజ్‌ను తిట్టుకుంటూ ఇక్కడ క్యాబ్ కూడా కనిపించడం లేదు అనుకుంటుండగా.. ఒక ఆటో వస్తుంది. అందులో సూరజ్‌ వస్తుంటాడు. ఆటోను ఆపిన జ్యోత్స్న సూరజ్‌ను చూసి షాక్‌ అవుతుంది. ఈ ఏరియా మంచిది కాదని సూరజ్‌ చెప్పగానే.. సైలెంట్‌గా ఆటో ఎక్కుంతుంది జ్యోత్స్న. మరోవైపు జ్యోత్స్న కోసం ఇంట్లో వాళ్లు కంగారు పడుతుంటారు. సుమిత్ర ఏడుస్తుంటుంది. దశరథ ఓదారుస్తుంటాడు. ఇంతలో దశరథ కార్తీక్‌కు ఫోన్‌ చేస్తాడు. జ్యోత్స్న రాలేదని చెప్తాడు. కార్తీక్‌, దీప కంగారు పడుతుంటారు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×