E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాశీ, స్వప్న లను కలిపిన కార్తీక్  

Karthika Deepam 2 Serial Today Episode May 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాశీ, స్వప్న లను కలిపిన కార్తీక్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: రోడ్డు పక్కన పుడ్‌ ట్రక్‌ పెట్టి నడిపిస్తున్న సూరజ్‌ను చూసి కార్తీక్‌, దీప వెళ్లి థాంక్స్‌ చెప్తారు. దీంతో తాను ఏం గొప్ప పని చేయలేదని సూరజ్‌ చెప్తాడు. అలాగే కార్తీక్‌ గురించి సూరజ్‌ చెప్తాడు. దీంతో తన గురించి ఎలా తెలుసని కార్తీక్‌ అడగ్గానే.. మీ గురించి పూర్తిగా తెలుసు.. ఒక సీఈవోగా ఉన్న మీరు డ్రైవర్‌ అవతారం ఎందుకు ఎత్తారని సూరజ్‌ అడగ్గానే.. అదంతా పెద్ద కథ అది చెప్పేంత దగ్గర అయినప్పుడు చెప్తాను అంటాడు కార్తీక్‌. దీంతో ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత కార్తీక్‌, సూరజ్‌ను పెళ్లి అయిందా అని అడగ్గానే.. తనను అర్థం చేసుకునే అమ్మాయి ఇంకా దొరకలేదని దొరికితే తప్పకుండా చేసుకుంటానని చెప్తాడు. తర్వాత కార్తీక్‌, దీప వెళ్లిపోతారు.. సూరజ్‌ గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటారు. పైకి చెప్పడం లేదు కానీ ఆరోజు నాన్న కాపాడటం వల్లే తన అపార్చునిటీ పోయింది. టైం వచ్చినప్పుడు ఇతని మనం హెల్ప్‌ చేయాలి దీప అంటాడు కార్తీక్‌. దీంతో పెళ్లి అయిందా అని ఎందుకు అడిగావు అంటూ దీప అడగ్గానే.. తర్వాత చెప్తానులే అంటూ వెళ్లిపోతారు.

కాశీ, స్వప్న దగ్గరకు వెళ్లి తాను చెప్పింది ఏం ఆలోచించావు అని అడుగుతాడు. ఈ టైంలో మరో పెళ్లి అంటే మామయ్య గురించి ఆలోచించు అనగానే.. స్వప్న కోపంగా వచ్చిన అవకాశాన్ని బలే ఉపయోగించుకుంటున్నావు అంటూ తిడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కావేరీ స్వప్నను తిడుతుంది. నువ్వింక మారవే అంటూ కోప్పడుతుంది. దీంతో స్వప్న కోపంగా కాశీ ఇలా కళ్ల ముందు కనిపిస్తున్నాడు కాబట్టే మా నాన్న ఇలా అయ్యాడు.. ముందు నువ్వు బయటకు పోరా అంటూ తిడుతుంది స్వప్న. కావేరీ కోపంగా మొగుణ్ని పట్టుకుని రా అంటావా..? అంటూ చెంప పగులగొడుతుంది. పొగరుతో కళ్లు మూసుకుపోయి మాట్లాడుతున్నావు.. ఈ మాట మీ నాన్న వింటే ఏమవుతుందో తెలుసా.. అనగానే.. శ్రీధర్‌ ఏమవుతుంది కావేరీ విన్నాను.. ఏం కాలేదుగా.. అనగానే.. స్వప్న సారీ చెప్తుంది.

Advertisement

శ్రీధర్‌ మాత్రం సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమయ్యింది. ఈరోజే పరిష్కరిస్తాను లోపలికి రండి అంటూ వెళ్లగానే.. స్వప్న కోపంగా రేపటి నుంచి నీ ముఖం కూడా చూడను అంటుంది. కట్‌ చేస్తే.. శ్రీధర్‌ ఇంట్లో కార్తీక్‌ ఉంటాడు. ఏమైందని అడుగుతుంటాడు. దీంతో శ్రీధర్‌ ఎమోషనల్‌ అవుతూ కార్తీక్‌తో మాట్లాడుతుంటే అందరూ షాక్‌ అవుతారు. స్వప్న మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ.. శ్రీధర్‌ ఎమోషనల్ అవుతాడు. ఇవాళ ఇంట్లో జరిగే నా కూతురు విడాకుల కేసులో నువ్వే జడ్జి, నేనే లాయరును, కావేరీయే న్యాయదేవత అంటూ వాదిస్తూ శ్రీధర్‌ బాధపడుతుంటే.. కార్తీక్‌ కలగజేసుకుని ఇద్దరి మధ్య రాజీ కోసం ప్రయత్నిస్తాడు. మీ నిర్ణయం చెప్పండి లేదంటే పిన్ని, నాన్నను తీసుకుని వెళ్లిపోతానని కార్తీక్‌ చెప్పగానే.. పక్కకు వెళ్లి మాట్లాడుకుని కాశీ, స్వప్న వస్తారు. ఏంటో మీ నిర్ణయం చెప్పమని అడగ్గానే.. స్వప్న ఆలోచిస్తూ.. మేము కలిసే ఉంటాం అంటారు.. దీంతో కార్తీక్, శ్రీధర్‌ను న్యాయవాది గారు మీరు కేసు గెలిచారు అనగానే.. నువ్వే గెలిపించావురా అంటాడు శ్రీధర్‌. దీంతో కార్తీక్‌ కాశీ, స్వప్నను కలిపేస్తాడు. ఇంతలో దాస్‌ వచ్చి చాలా బాగా చెప్పావు అల్లుడు ఈ జనరేషన్‌కు నీ మాట ఆణిముత్యం లాంటిది అంటాడు. ఇంతలో కార్తీక్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇంటికి వెళ్లిన కార్తీక్‌ శ్రీధర్ ఇంట్లో జరిగింది చెప్పగానే.. కాంచన హ్యాపీగా ఫీలవుతుంది. మంచి శుభవార్త చెప్పావని అంటుంది. కానీ కార్తీక్‌ జీవితంలో కూడా ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నట్టు చెప్తుంది. దీంతో కార్తీక్‌, దీప సైలెంట్‌ అయిపోతారు. తర్వాత కార్తీక్‌.. కాంచను ఓదారుస్తూ.. తన మాటలతో కన్వీన్స్‌ చేయాలని చూస్తాడు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×