Karthika Deepam 2 serial today Episode: మాలినితో గొడవ పడుతున్న జ్యోత్స్నను సూరజ్ వెళ్లి మీ ఇంట్లో చెప్పే వచ్చావా..? అని అడుగుతాడు. ఇక చాలు మాట్లాడింది మీ ఇంటికి వెళ్లు అంటాడు. అందుకు జ్యోత్స్న సరే వస్తాను అంటూ వెళ్లబోతుంటే.. వెళ్లు మళ్లీ రాకు అంటుంది మాలిని. వచ్చే రాత ఉంటే ఎవరు ఆపలేరు అత్త అంటూ జ్యోత్స్న వెళ్లబోతుంటే.. జ్యోత్స్నను డ్రాప్ చేసి రమ్మని దక్షణమూర్తి, సూరజ్‌కు చెప్తాడు. సూరజ్ కొన్ని అప్పగింతలు ఉన్నాయమ్మ అప్పజెప్పి వస్తాను అంటాడు. అత్తా ఏదో అప్పగింతలు అంటున్నాడు నీకొడుకు అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది.
బయటకు వెళ్లిన జ్యోత్స్నను సూరజ్ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అంటే జ్యోత్స్న తనకు సూరజ్ పెట్టిన మెసేజ్‌లు వినిపిస్తుంది అవి నా పీఏకు పెట్టాను అని సూరజ్ అంటే నువ్వు నీ పెళ్లానికి పెట్టావు అని నేను అనలేదు కదా అంటుంది జ్యోత్స్న. అయినా నీకు ఇంత మొండితనం ఎందుకు అసలు ఈ మూడు రోజులు ఎక్కడున్నావు అంటే చెప్పవు.. ఏదేదో మాట్లాడతావు.. ముందు అయితే వెళ్దాం పద మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటే ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తావా.? లేక మధ్యలో ఎక్కడైనా వదిలేసి వెళ్తావా..? అంటుంది జ్యోత్స్న.
ఇంట్లో జ్యోత్స్న కనిపించడం లేదని సుమిత్ర కంగారు పడుతుంది. అందరినీ పిలిచి విషయం చెప్తుంది. వెంటనే కార్తీక్, సూరజ్‌కు ఫోన్ చేస్తాడు. జోత్స్న ఎక్కడుందని అడిగితే.. మా ఇంట్లోనే ఉంది అయినా నువ్వే పింపించి ఉంటావు కదా నీకే తెలియదా జ్యోత్స్న ఎక్కడున్నది అంటాడు సూరజ్. కార్తీక్ కోపంగా సూరజ్ ఏం మాట్లాడుతున్నావు ముందు జ్యోత్స్నను ఇంటికి పంపించండి అంటాడు. సుమిత్ర బాధపడుతూ అది ఇంటికి రాని చెప్తాను అంటుంది. కారు ఎక్కిన జ్యోత్స్న, సూరజ్ చేయి పట్టుకుంటుంది. సూరజ్ విదిలిస్తే.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటుంది జ్యోత్స్న లేదని సూరజ్ చెబితే.. మరి హాస్పిటల్ మార్చురీ దగ్గర ఎందుకు ఏడ్చావు అని అడుగుతుంది. అందుకు సూరజ్ నీకేమైనా అయితే ఆ నింద మా మీద పడుతుందని చెప్తాడు. అంత లేదని జ్యోత్స్న వెటకారంగా నవ్వుతుంది. సూరజ్ అంతే ఉంది ఇంకేం లేదని చెప్తూ.. అంటే మార్చురీ నాటకం ఆడింది నువ్వేనా అంటాడు. జ్యోత్స్న మౌనంగా ఉండిపోతుంది. చెప్పు జ్యోత్స్న ఎందుకు నాటకం ఆడావు అంటాడు.. అప్పుడే ఇల్లు రావడంతో ఇల్లు వచ్చింది నేను వెళ్తాను అంటూ జ్యోత్స్న కారు దిగుతుంది.
జ్యోత్స్న చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లిన సూరజ్, సుమిత్రతో అత్త ఇదిగో నీ కూతురు. పొద్దున్నే ఒకసారి అప్పగించాను.. వదిలేశారు.. ఇప్పుడు మళ్లీ అప్పగిస్తున్నాను ఈసారి ఏమైనా మాకు సంబంధం లేదు అలాగే ఉద్యోగం చేయడానికి మా ఆఫీసుకు రావాల్సిన అవసరం కూడా లేదని చెప్తాడు. శివనారాయణ కోపంగా నా మనవరాలిని తన వైపు తిప్పుకోవడానికి మీ తాత ఉద్యోగం ఆశ చూపాడురా అంటాడు. సూరజ్ ఏదో అనబోతే శివనారాయణ తిడుతూ నిన్ను కార్తీక్‌ను మనవళ్లు అనుకున్నాను కానీ మీరు ఆ నమ్మకం పోగొట్టుకున్నారు అంటాడు. సూరజ్ మాత్రం మీ ఇష్టం ఏమైనా అనుకోండి కానీ మీ మనవరాలిని మాత్రం మా ఇంటికి కానీ మా ఆఫీసుకు కానీ.. ఇంకా చెప్పాలంటే నా మీదకు రాకుండా ఆపుకోండి అంటూ చెప్పి వెళ్లిపోతాడు. సూరజ్ మాటకు అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.