E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: భోజనం చేస్తుటే వెళ్లి గొడవ చేసిన దక్షిణమూర్తి – కోపంతో ఊగిపోయిన శివనారాయణ  

Karthika Deepam 2 Serial Today Episode October 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: భోజనం చేస్తుటే వెళ్లి గొడవ చేసిన దక్షిణమూర్తి – కోపంతో ఊగిపోయిన శివనారాయణ  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఆరుబయట కూర్చున దీప దగ్గరకు శౌర్య వెళ్లి తనకు హోం వర్క్‌లో హెల్ప్‌ చేయమని అడుగుతుంది. అందుకు దీప ఆ ఇంగ్లీష్‌ తనకు రాదని తాను చెప్పలేనని అంటుంది. శౌర్య ఇప్పుడు నేను ఎవరిని అడగాలి అంటూ ప్రశ్నిస్తుంటే.. దశరథ వెళ్లి తాను చెప్తానని శౌర్యకు హెల్ప్‌ చేస్తాడు. తనను అడిగినట్టే స్కూల్‌ లో మీ టీచర్‌ను కూడా డౌట్స్‌ అడగాలని చెప్తాడు. సరే అంటుంది శౌర్య. తర్వాత అక్కడికి శివనారాయణ, కార్తీక్‌ వస్తారు. శౌర్య అందరితో సరదాగా మాట్లాడుతుంది. అప్పుడే దీప ఇక భోజనం టైం అవుతుంది వెళ్దాం పదండి అంటూ అందరికీ చెప్తుంది.

దీప ముందు ఇంట్లోకి వెళ్లి భోజనం రెడీ చేస్తుంది. శివనారాయణ, దశరథ, కార్తీక్‌, శౌర్య ఇంట్లోకి వస్తుంటారు. జ్యోత్స్న వచ్చి ఇవాళ స్పెషల్‌ ఏంటో తెలుసా తాత అంటూ చెప్పబోతుంటే.. శివనారాయణ పలకకుండా వెళ్లిపోతాడు. ఏంటి తాత నాతో మాట్లాడటం లేదని అంటే ఇవాళ వద్దన్నా జాబ్‌ చేయడానికి వెళ్లావు కదా అందుకే తాత నీతో మాట్లాడటం లేదని దశరథ చెబితే అయితే తాతను ఎలా కూల్‌ చేయాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

Advertisement

అందరూ భోజనానికి కూర్చుని తినబోతుంటే.. బయటి నుంచి ఓరేయ్‌ శివనారాయణ అనుకుంటూ దక్షిణమూర్తి, మాలిని వస్తారు. శివనారాయణ కోపంగా ఒరేయ్‌ భోజనం చేస్తున్నాము బయట వెయిట్‌ చేయ్‌ తిన్న తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. అందుకు దక్షిణమూర్తి కోపంగా నేను నా మనవరాలితో మాట్లాడటానికి వచ్చాను అంటాడు దక్షిణమూర్తి. మనవరాలా అలాంటి వ్యక్తి ఎవ్వరూ లేరు ఇక్కడ మీరు వెళ్లిపోవచ్చు అంటూ సుమిత్ర చెప్తుంది. అప్పుడే జ్యోత్స్న ఏంటో చెప్పు తాత అంటుంది. దీంతో దక్షిణమూర్తి చూశావా సుమిత్ర ఎవరూ లేరన్నావు.. ఈ పిలుపుతో అర్థం అయిందనుకుంటాను అంటూ జ్యోత్స్న, మాలిని మీద కేసు పెట్టిందని ఆ కేసు వెనక్కి తీసుకోమని చెప్తాడు.

అందుకు శివనారాయణ కోపంగా ఒక్కరి మీద కేసు పెట్టి తప్పు చేశావు జ్యోత్స్న ముగ్గురి మీద పెట్టాల్సింది అంటాడు. జ్యోత్స్న కేసు వెనక్కి తీసుకోదు అంటూ సుమిత్ర చెప్తుంది. దీంతో దక్షిణమూర్తి ఎమోషనల్ అవుతూ అయితే మాలిని వాళ్ల ఆస్థి వాళ్లకు ఇచ్చేయ్‌ అమ్మా అప్పుడైనా కేసు వెనక్కి తీసుకుంటారు అంటూ చెబుతూనే చిరిగిపోయిన చీర కట్టుకున్న సుమిత్ర స్థితి చూసి దక్షిణమూర్తి కోపంతో ఒరేయ్‌ శివనారాయణ నీ మూర్ఖత్వం వల్ల ఇక్కడ నా కూతుర అక్కడ నా కోడలి సుఖంగా బతకడం లేదురా అంటాడు. మాలిని మీద కాదు కేసు తన మీద పెట్టమని తాను కావాలంటే జైలుకు వెళ్లిపోతానని మీ ఆస్థి మీకు తిరిగి ఇస్తామని మాలిని మీద కేసు వెనక్కి తీసుకోమని చెప్తాడు. అందుకు సుమిత్ర కోపంగా బేరం కుదరలేదని ఈ నాటకాలు ఆడుతున్నావా..? కోడలిని కాపాడుకోవడానికి ఈ కన్నీళ్లు కారుస్తూ కూతురు మీద ప్రేమ నటిస్తున్నావా.. అంటూ తిడుతుంది.

Advertisement

అప్పటికే సూరజ్‌, జ్యోత్స్నకు కాల్స్‌ చేస్తుంటాడు. జ్యోత్స్న కాల్స్‌ కట్‌ చేస్తుంది. పదే పదే చేస్తుటే.. జ్యోత్స్న లోపలికి వెళ్లి కాల్‌ లిఫ్ట్‌ చేసి ఎందుకురా మీ తాత, అమ్మ వచ్చి ప్రశాంతంగా తిననివ్వడలేదు.. నువ్వేమో ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని తిడుతూ కాల్‌ కట్‌ చేసి బయటకు వస్తుంది. అప్పటికే దక్షిణమూర్తి, మాలిని వెళ్లిపోయి ఉంటారు. బయటకు వచ్చిన జ్యోత్స్నతో ఇందుకే నిన్ను ఆఫీసుకు వెళ్లొద్దని చెప్పాము అంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : నారాయణ స్టోరీతో కన్నీళ్లు.. మాధవ్ మాటతో షాక్.. చక్రీకి అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అమూల్యకు షాక్.. రామరాజు మాటతో సాగర్ ఫైర్.. భద్రకు కన్నీళ్లు..

Brahmamudi Serial Today Episode October 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీ కేసులో మేనేజర్‌ నుంచి రాజు నిజం రాబడతాడా..?  

Intinti Ramayanam Today Episode: పల్లవి రచ్చ.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్.. అవనికి షాక్..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్కటి అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode October 26th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కోసం అమర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి     

Big Stories

Advertisement
×