E-Paper
Advertisement

ఘోరమైన యాక్సిడెంట్.. లోయలోపడిన బస్సులో 30 మంది, వీడియోలో కాపాడాలంటూ ఆర్తనాదాలు

ఘోరమైన యాక్సిడెంట్.. లోయలోపడిన బస్సులో 30 మంది, వీడియోలో కాపాడాలంటూ ఆర్తనాదాలు
Advertisement

Uttarakhand: రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో చెప్పలేము. ఆ నష్టాన్ని అస్సలు ఊహించలేము. కానీ ఆ బస్సులో చాలామంది అదృష్టవంతులు ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన బస్సు భారీ లోయలో పడింది. ఆ ఘటనలో 30 మంది ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది?

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈనెల 21న అంటే పోయిన బుధవారం జరిగిన ఘటనకు సంబంధించి వీడియో బయటకు వచ్చింది. గర్వాల్ మోటార్ ఓనర్స్ కు చెందిన ఓ బస్సు.. కోట్‌ద్వార్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తోంది. గుమ్‌ఖాల్-భదలిఖాల్ ప్రాంతానికి బస్సు వచ్చేసరికి సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా ప్రెజర్ పైపు సడన్‌గా పగిలిపోయింది. బస్సు ముందుకు కదల్లేని పరిస్థితి కొండ ప్రాంతంపై ఏర్పడింది. అయితే బస్సు వెనుక రహదారి ఏటవాలుగా ఉండటంతో అదుపు తప్పింది లోయలోకి పడిపోయింది.

లోయలోపడిన బస్సు, బయటపడిన ప్రయాణికులు

Advertisement

రోడ్డుకు ఎడమ వైపు లోయలో ఓ చెట్టును బలంగా ఢీ కొట్టింది బస్సు. చెట్ల మధ్య బస్సు ఇరుక్కుపోయింది. ఆ చెట్ల కింద ఓ భవన నిర్మాణం జరుగుతోంది. దీంతో ఆ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బోల్తా పడిన బస్సు.. లోయలో ప్రమాదకరంగా వేలాడుతూ ఊగుతూ కనిపించింది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు చెట్ల మధ్య వేలాడుతూ కనిపించడంతో అందులో ప్రయాణికులు సాహసం చేయాల్సి వచ్చింది. ఆ బస్సు నుంచి ఒకరి సాయంతో మరొకరు కిందకు దూకి బయటపడ్డారు.

బస్సు ప్రమాదం గురించి తెలియగానే దుగడ్డా-గుమ్ఖాల్ అవుట్‌పోస్టులకు చెందిన పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయాలు అయినట్టు అధికారులు వెల్లడించారు. బస్సు లోయలో వేలాడుతున్న సమయంలో కూతవేటు దూరంలో ఉన్న ఓ వ్యక్తి ఆ సన్నివేశాన్ని తన మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరణ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియోలో ప్రయాణికులు నుంచి తమను కాపాడాలంటూ ఒకటే ఆర్తనాదాలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

ALSO READ: 6 నెలలు.. 23 ఉరిశిక్షలు.. సంచలన జడ్జి రవికుమార్ దివాకర్ సడన్ ట్రాన్స్‌ఫర్!

 

 

Related News

6 నెలలు.. 23 ఉరిశిక్షలు.. సంచలన జడ్జి రవికుమార్ దివాకర్ సడన్ ట్రాన్స్‌ఫర్!

12 ఏళ్ల ‘మన్ కీ బాత్’ ప్రయాణం.. దీన్ని ‘తీర్థయాత్ర’తో పోల్చిన ప్రధాని మోదీ!

‘ఆ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తే లేదు’.. జేడీయూ వేటుపై అనంత సింగ్ ఫైర్!

ఫ్లిప్‌కార్ట్ పార్సిల్స్ చోరీ.. కస్టమర్ల ఆర్డర్లతో డెలివరీ ఏజెంట్ జంప్.. చివరికి ఎలా దొరికాడంటే!

సంచలనం రేపుతున్న సెన్సార్ బోర్డ్‌ డేటా లీక్.. 500 చిత్రాలకు రికార్డులు బయటకు

భర్త విద్యార్థి అయినా భార్యకు భరణం ఇవ్వాల్సిందే.. హై కోర్టు షాకింగ్ తీర్పు

కోపంతో మరిది ప్రైవేటు పార్ట్స్ కొరికిన వదిన, ఎన్నికుట్లు పడ్డాయంటే, యూపీలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×