E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       
Advertisement

Karthika Deepam 2 serial today Episode: హాస్పిటల్‌లో దశరథ కోపంగా దీప, కార్తీక్‌ల ముఖం చూడలేనని వెళ్లిపోమ్మని అంటాడు. అందుకు దీప బాధపడుతుంది. ఏంటి బావ నాన్న ఇలా మాట్లాడుతున్నారు అని అడిగితే.. పరిస్థితులు అలా ఉన్నాయి దీప. ఇక్కడ మామయ్య, తాతయ్యలే ఇలా ఉన్నారంటే అక్కడ జ్యోత్స్న ఇంకెలా ఉందో అని భయపడతాడు కార్తీక్‌. దీప మాత్రం దశరథ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది.

ఇంట్లో జ్యోత్స్న తాళి పట్టుకుని సూరజ్‌ గురించి ఆలోచిస్తుంది. మాలిని అన్న మాటలు, సూరజ్‌ తాళి వదిలేయడం అంతా గుర్తు చేసుకుని బాధపడుతుంది. అప్పుడే సూరజ్‌ అక్కడకు వెళ్తాడు. సూరజ్‌ను చూసిన జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ప్రేమగా సూరజ్‌ దగ్గరకు వెళ్లి నా కోసమే వచ్చావు కదా..? నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని.. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు నా ప్రేమ కూడా నిన్ను మారుస్తుంది అంటూ జ్యోత్స్న చెప్తుంటే.. నిన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయాను కదా ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనుకుంటున్నావు అంటూ సూరజ్‌ అడిగితే.. నా కుటుంబం మీద నీ పగ నిజం అయినప్పుడు నా మీద నీ ప్రేమ కూడా నిజమే అవుతుంది అంటూ జ్యోత్స్న చెప్తుంటే.. సూరజ్‌ మాత్రం తనను మర్చిపోమ్మని చెప్తాడు.

Advertisement

అవేమీ జ్యోత్స్న పట్టించుకోకుండా అయితే నేను నీ మనసులో లేనని నా మీద ఒట్టేసి చెప్పరా అంటూ సూరజ్‌ చేయి తన తల మీద పెట్టుకుంటే చేయి వెనక్కి లాక్కుంటాడు సూరజ్‌. చూశావా నీ మనసులో ఉన్న ప్రేమే నీ చేయిని వెనక్కి లాగేలా చేసింది.. నువ్వు లేకుండా నేను బతకలేను ఇదిగో ఈ తాళి తీసుకుని ఇప్పుడే నా మెడలో కట్టు తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటూ జ్యోత్స్న.. సూరజ్‌కు తాళి ఇస్తుంది. సూరజ్‌ అలాగే చూస్తుంటాడు. పక్కనే ఉన్న శివనారాయణ, పారిజాతం బాధపడుతుంటారు. కట్‌ చేస్తే జ్యోత్స్న అదంతా కల కంటుంది. పక్కన సూరజ్‌ ఎవ్వరూ ఉండరు.. శివనారాయణ, పారిజాతం బాధపడుతూ ఏమైందమ్మా అని అడిగితే.. ఓ ఇది కలా అంటూ బాధపడుతుంది జ్యోత్స్న.  తర్వాత తనకు నిద్ర వస్తుందని వెళ్లి మీరు కూడా పడుకోండని శివనారాయణ, పారులకు చెప్తూ దుప్పటి మూసుకుని పడుకుంటుంది జ్యోత్స్న.

కార్తీక్‌, కాంచన ఒడిలో పడుకుని బాధపడుతూ అమ్మా నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు..? అసలు యాక్సిడెంట్‌ ఎందుకు జరిగింది అంటూ అడగ్గానే.. కాంచన కూడా ఏడుస్తూ.. అన్నయ్యను దూరం చేసుకోవడం కంటే నా కాళ్లు దూరం చేసుకోవడమే మంచిదనిపించింది. సూరజ్‌ మీతో మాట్లాడిన మాటలు వింటే ఎవ్వరైనా మిమ్మల్నే తప్పుబడతారు. కానీ జ్యోత్స్న పరిస్థితి తలుచుకుంటేనే బాధేస్తుంది. ఆ పిచ్చిది ఎంతలా ప్రేమించింది. మనసులో ఇప్పుడు ఎంత బాధను మోస్తుందో అంటూ కాంచన బాధపడుతుంది. జ్యోత్స్నను ఇలాగే వదిలేస్తే పిచ్చిది అయిపోతుంది. ఆ పాపం కూడా మీదే అవుతుంది. అందుకే జ్యోత్స్నను మామూలు మనిషిని చేయాల్సింది కూడా మీరే అంటూ కాంచన చెప్తుంది.

Advertisement

మరుసటి రోజు జ్యోత్స్న, సూరజ్‌ ఉన్న అవుట్‌ హౌస్‌లోకి వెళ్లి సూరజ్‌ను తలుచుకుని బాధపడుతుంది. ఏడుస్తూ రూం అంతా కలియ చూస్తుంది. అప్పుడే కార్తక్‌, దీప వెళ్తారు. జ్యోత్స్నకు సారీ చెప్తారు. మా వల్లే ఇలా జరిగింది అంటూ బాధపడతారు. జ్యోత్స్న మాత్రం ఇదంతా నా ఇష్టం వల్లే జరిగిందని.. అందుకు మీరు కారణం ఎలా అవుతారని ప్రశ్నిస్తుంది. సూరజ్‌ను తాను ఇష్టపడకపోతే ఇంత దూరం వచ్చేదే కాదని పైగా సూరజ్‌తో నా పెళ్లి జరిపించాలని మీ ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్‌ చేశాను కాబట్టి ఇందులో ఎవ్వరి తప్పు లేదు.. తప్పంతా తనదే అంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Big Stories

Advertisement
×