E-Paper
Advertisement

విడాకుల తర్వాత 5 ఏళ్ళు నరకం చూసా.. ఆవేదన చెందిన కార్తీక దీపం సుమిత్ర !

విడాకుల తర్వాత 5 ఏళ్ళు నరకం చూసా.. ఆవేదన చెందిన కార్తీక దీపం సుమిత్ర !
Advertisement

Karthika Deepam Sumitra: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం 2 సీరియల్ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న సీత లక్ష్మి అలియాస్ యాస్మిన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తన విడాకుల తర్వాత జీవితం గురించి అలాగే మతం మార్చుకోవడం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

విడాకుల తర్వాత బయట కనపడలేదు..

ఈమె పేరు సీత లక్ష్మీ అయినప్పటికీ యాస్మిన్ గా పేరు మార్చుకోవడం మతం మార్చుకోవడానికి గల కారణాలను తెలిపారు. తన పేరు సీత లక్ష్మి అని అయితే తన జీవితంలో ఒక సంఘటన కారణంగా తను మతం మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తనకు మొదట పెళ్లి తర్వాత అనుకోకుండా విడాకులు జరిగాయని, విడాకుల కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. విడాకులు తీసుకున్న తర్వాత దాదాపు 5 సంవత్సరాల పాటు తాను బయటకు కూడా రాలేదని బయటికి వెళ్తే ఎవరేమనుకుంటారోనని ఇంట్లోనే కుమలిపోతూ ఉన్నానని తెలిపారు.

అబ్దుల్ ఖాదర్ తో రెండో వివాహం..

Advertisement

ఇలా తన విడాకులైన తర్వాత తన స్కూల్ క్లాస్మేట్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యారు విడాకుల బాధలో ఉన్న నాకు అతని పరిచయం బాగా ఉపశమనం కల్పించింది. ఈ నేపథ్యంలోనే అబ్దుల్ ఖాదర్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఇలా తన స్నేహితుడిని పెళ్లి చేసుకోవడం వల్ల తాను సీత లక్ష్మీ నుంచి యాస్మిన్ గా మారానని తెలిపారు. తాను తన పేరు మార్చుకున్నప్పటికీ ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వంటి వాటిలో తన పేరు సీత లక్ష్మి గానే ఉందని ఈమె తెలిపారు. ఇక తాను యాస్మిన్ గా మారడానికి కారణం రెండో పెళ్లి చేసుకోవడమేనని, పెళ్లి చేసుకోవాలి అంటే తన అత్తగారి కోసం కొన్ని మార్చుకోవాల్సి వచ్చింది అందులో భాగంగానే తన పేరు మతం మారిందని సీతాలక్ష్మి తెలిపారు.

?igsh=MTViendraHhqaXk2aQ%3D%3D

Advertisement

ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా తనని ఫాలో అవుతున్న వారందరూ కూడా తన పేరు సీత లక్ష్మీ అయినప్పటికీ యాస్మిన్ గా ఎందుకు పేరు పెట్టుకున్నాను బొట్టు ఎందుకు పెట్టుకోవడం లేదు అంటూ తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలా ప్రశ్నలు అడిగే వారందరికీ కూడా ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇక ఈమెకు సంతానం లేరనే సంగతి కూడా తెలిసిందే. కొన్ని కారణాల వల్ల తన గర్భాశయం తొలగించడంతో తనకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని గతంలో సీతాలక్ష్మి తెలిపారు. తాజాగా మతం మార్పిడి గురించి , విడాకులు తర్వాత జీవితం గురించి కూడా ఈమె క్లారిటీ ఇస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: నాని ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ అప్డేట్..ఈసారి లవ్ లో పడేయనున్న జడల్!

Related News

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Big Stories

Advertisement
×