E-Paper
Advertisement

స్టేజ్ పై గొడవపడ్డ కృష్ణ భగవాన్, యమునా?

స్టేజ్ పై గొడవపడ్డ కృష్ణ భగవాన్, యమునా?
Advertisement

Krishna Bhagavan vs Yamuna :ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందివ్వడానికి ఎన్నో ఛానల్స్ సరికొత్త షోలతో ఆడియన్స్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ షోలు అంటే ఒకప్పుడు కేవలం కమెడియన్స్ , ఇండస్ట్రీలోకి తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి వచ్చే కొత్త వాళ్ళతో మాత్రమే ఈ షోలు రన్ అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమాలు మొదలుకొని సీరియల్స్ లో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా షోలోకి వచ్చి తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. అంతేకాదు తమ సీరియల్స్ ను, సినిమాలను ఈ షోలలో ప్రమోట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ సినీనటుడు కృష్ణ భగవాన్ (Krishna bhagavan ), ఒకప్పుడు తన సినిమాలతో ఆకట్టుకొని ఇప్పుడు సీరియల్స్ తో దూసుకుపోతున్న యమునా (Y.Yamuna ) ఇద్దరు స్టేజ్ పై గొడవ పడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టేజ్ పై గొడవపడ్డ కృష్ణ భగవాన్.. యమునా..

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్నేళ్లుగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ టాలెంట్ కి వేదికగా నిలుస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఇప్పుడు సరికొత్త టాస్క్ లతో .. సరికొత్త సెలబ్రిటీలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఒకప్పుడు రష్మీ యాంకర్ గా వ్యవహరించగా.. ఇప్పుడు ప్రదీప్ వచ్చాక షో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 13వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో కృష్ణ భగవాన్ , యమున గొడవపడ్డారు.

Advertisement

also read:దిష్టి పెట్టకండి.. లావైపోతా.. అనసూయ వీడియో వైరల్!

అసలేం జరిగిందంటే?

ప్రోమో మొదలవ్వగానే.. కృష్ణ భగవాన్ తన అసిస్టెంట్ సహాయంతో స్టేజ్ మీదకు వస్తాడు. యమునా కూడా.. అసిస్టెంట్ గొడుగు పట్టుకుంటే..పాట పాడుతూ స్టేజ్ పైకి వస్తుంది. ఆమెను చూడగానే కృష్ణ భగవాన్.. “మీరు చాలా అందంగా ఉన్నారండి” అంటూ చెబుతాడు. దీనికి యమునా సిగ్గు పడిపోయి.. “థాంక్స్” అని చెబుతుంది. ఇక దీనికి కృష్ణ భగవాన్..”ఈమధ్య నా కళ్ళు కొంచెం సరిగ్గా కనిపించట్లేదండి” అంటూ చెబితే.. యమునా..” ఈ వయసులో కామన్ అండి” అంటుంది. అప్పుడు కృష్ణ భగవాన్ “మీది కూడా అదే వయసే కదా” అంటూ కౌంటర్ ఇస్తాడు. కృష్ణ భగవాన్ మాట్లాడుతూ “షో అంటే మీకెందుకు అంత కోపం?” అని అడిగితే.. దానికి యమునా “షో అంటే కోపం లేదు.. మా సీరియల్ మీద మమకారం” అంటూ చెబుతుంది. కృష్ణ భగవాన్ మాట్లాడుతూ..” షో అంటే మీరు తేలిగ్గా తీసుకోవద్దు” అంటూ వేలు చూపిస్తూ ఫైర్ అవుతాడు. యమునా కూడా అంతే సీరియస్ గా మీరు కూడా సీరియల్స్ అంటే అంత తేలిగ్గా తీసుకోవద్దు అంటూ మండిపడుతుంది.

వార్ పీక్స్.. మధ్యలో దూరిన హైపర్ ఆది..

Advertisement

అలా వార్ వీక్స్ కి చేరుకోగా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది “అద్దాలు పెట్టుకోవాల్సిన వయసులో ఈ యుద్ధాలు అవసరమా?” అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్ వేసి కౌంటర్ ఇస్తాడు. ఒక దాంతో షో వాతావరణం మారిపోతుంది. అలా మొత్తానికైతే మా సీరియల్స్ గొప్ప.. షోలే గొప్ప అంటూ రెండు గ్రూపుల మధ్య వివాదం మొదలవుతుంది. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారో తెలియాలి అంటే.. సెప్టెంబర్ 13న ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

‘వీసా స్కామ్ ‘.. మీడియాతో నందన కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

దిష్టి పెట్టకండి.. లావైపోతా.. అనసూయ వీడియో వైరల్!

బిగ్‌బాస్ ఓటింగ్.. ఎలిమినేషన్ కి దగ్గరగా ఆ ఇద్దరే!

బిగ్ బాస్ కి టాలెంట్ అక్కర్లేదా.. రిజెక్ట్ చేయడంతో నిజాలు బయటపెట్టిన రాజకుమారి!

బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ మనోజ్.. గుణ దెబ్బకు రోహిణి అవుట్..

Podarillu Today Episode : కన్నాకు టెన్షన్.. మనసు మార్చుకొని మాధవ్.. బాధపడ్డ మనీష..

Big Stories

Advertisement
×