E-Paper
Advertisement

నొప్పిలోనే సుఖం వెతుక్కునే భర్త… ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే మైండ్ బ్లోయింగ్ మూవీ

నొప్పిలోనే సుఖం వెతుక్కునే భర్త… ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే మైండ్ బ్లోయింగ్ మూవీ
Advertisement

Romantic Comedy movie on OTT : బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఓటీటీలో కొదవలేదు. అయితే ఇలాంటి కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలు అవార్డులను కూడా అందుకుంటాయి. నిజమే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటుంది. అయినా అవార్డుల పంటే పండింది. ఈ సినిమా ‘BDSM’ నేపథ్యంతో సాగే ఒక వింతైన సైకలాజికల్ ఎమోషనల్ అడల్ట్ డ్రామా. బయటకి ఇది బూతు సినిమా లాగా అనిపించినా, లోపల మాత్రం భార్యను కోల్పోయిన ఒక భర్త డిప్రెషన్ నుండి బయటపడటానికి అతను చేసే పిచ్చి ప్రయత్నాలను చూపిస్తుంది. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రశంసలు అందుకున్న ఈ మూవీ, కేవలం 18 ఏళ్లు పైబడిన మెచ్యూర్డ్ ఆడియన్స్‌కు మాత్రమే సరిపోతుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఎరోటిక్ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘డ్యాగ్స్ డోంట్ వేర్ ప్యాంట్స్’ (Dogs Don’t Wear Pants). ఈ సినిమా అవార్డుల పరంగా ఇంటర్నేషనల్ లెవెల్లో దుమ్ము లేపింది. కేవలం 1.4 మిలియన్ యూరోల (దాదాపు ₹13 కోట్లు) తక్కువ బడ్జెట్‌తో ఫిన్లాండ్, లాట్వియా దేశాల పార్ట్‌నర్‌షిప్‌లో తెరకెక్కిన ఈ ఆర్ట్-హౌస్ సినిమా.. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ షోగా ప్రదర్శించబడింది. ఆ తర్వాత జరిగిన ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’లో బెస్ట్ పిక్చర్ అవార్డును కొట్టేసింది. అంతేకాదు ఫిన్లాండ్ దేశపు ఆస్కార్స్ లాంటి ‘జుస్సి అవార్డ్స్’ లో ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్, కెమెరా, ఎడిటింగ్, మ్యూజిక్, సౌండ్, మేకప్ లాంటి ఏకంగా 6 కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. ఈ సినిమా అంత గొప్పగా రావడానికి మెయిన్ రీజన్ అందులోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. కెమెరామెన్ పీతరి పెల్టోలా వాడిన డార్క్, నియాన్ కలర్ లైటింగ్.. చూసేవాడికి ఒక వింతైన లోకంలో ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మైఖేల్ నెజ్టెక్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్లలోని ఎమోషన్‌ని పిచ్చగా ఎలివేట్ చేసింది. ఈ సినిమా MUBI, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జుహా అనే ఒక పెద్ద హార్ట్ డాక్టర్ ఉంటాడు. అతనికి పెళ్లాం అంటే ప్రాణం. అయితే ఒకరోజు ఆమె నీళ్లలో మునిగి చచ్చిపోద్ది. ఆ షాక్ నుంచి జుహా అస్సలు కోలుకోలేడు. గుండె రాయి అయిపోద్ది. కూతురున్నా కూడా కనీసం మాట్లాడడు, నవ్వడు, ఏడవడు. లోపల ఎంత బాధ ఉన్నా బయటకి చెప్పుకోలేక, ఏ ఎమోషన్స్ లేకుండా ఓ బతికున్న శవంలా తిరుగుతుంటాడు.ఇలాంటి టైమ్‌లో మోనా అనే ఒక డామినాట్రిక్స్ (కస్టమర్లను కొడుతూ, నరుకుతూ శాడిజం చూపించే ఆడది) పరిచయం అవుతుంది. ఆమె ఒక సారి అతని గొంతు కాసేపు ఊపిరి ఆడకుండా పిసికేస్తుంది. ఊపిరి ఆడక చచ్చిపోయే టైమ్‌లో అతనికి చనిపోయిన పెళ్లాం మొహం కళ్లముందు కదలాడుతుంది. అంతవరకు మొద్దుబారిన వాడి గుండెల్లో ఆ నొప్పే ఒక కొత్త ఫీలింగ్‌ని ఇస్తుంది. అంతే ఆ ఊపిరి ఆగిపోయే నొప్పే వాడికి పిచ్చెక్కిస్తుంది. పెళ్లాం గుర్తొస్తుందని చెప్పి రోజూ మోనా దగ్గరికి వెళ్లి నా గొంతు పిసికేయ్ అని బతిమాలుతుంటాడు. మొదట్లో డబ్బుల కోసం చేసిన మోనా కూడా వాడి పిచ్చిని చూసి లవ్‌లో పడిపోద్ది. ఇద్దరూ కలిసి రకరకాల వింత వింత వేషాలు వేస్తూ, నొప్పులు భరిస్తూ, ఆఖరికి ఆ బాధలోంచే ఒకరినొకరు అర్థం చేసుకుని కథని ఒక కొలిక్కి తెస్తారు.

Read Also : దాని కోసం పరాయి వ్యక్తులకు అమ్ముడుపోయిన విద్యార్థిని… ఇది పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×