E-Paper
Advertisement

పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్.. పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి!

పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్.. పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి!
Advertisement

Madhuri Rathod:ఇటీవల కాలంలో “బాసింగ బలాలు” అంటూ ఫోక్ ఆల్బమ్ వీడియో సాంగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈశ్వర్ సాయి(Eshwar Sai), మాధురి రాథోడ్ (Madhuri Rathod) ఏకాంతంగా గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఈశ్వర్ సాయి భార్యకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. వేములవాడలోని రెడ్డి భవన్ లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసి మరీ.. ఇందులో తన భర్త తప్పు ఏమీ లేదని, మాధురి వల్లే తన భర్త ఇలా తయారయ్యాడు అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఆ తర్వాత ఈశ్వర్ సాయి ఒక వీడియో రిలీజ్ చేస్తూ మాధురి తప్పేమీ లేదని, ఒత్తిడితో అలా చేశానని ఒకసారి, మరొకసారి మాధురి రాథోడ్ గదిలోని వాష్ రూమ్ ఉపయోగించుకోవడానికి వెళ్లగా తన భార్య కొంతమందితో వచ్చి ఇలా తప్పుడుగా వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేసిందని కామెంట్లు చేశారు. అంతేకాదు బహిరంగంగా తన భార్య తరఫున , తన తరఫున మాధురి రాథోడ్ కు క్షమాపణలు చెప్పాడు.

ప్రేమ పేరుతో మోసం..ఈశ్వర్ సాయిపై కేస్ ఫైల్..

మరోవైపు మాధురి రాథోడ్ వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఈశ్వర్ సాయి భార్యపై అలాగే అక్కడికి వచ్చి తనపై చేయి చేసుకున్న వారిపై కంప్లైంట్ ఇచ్చింది. తన ప్రమేయం లేకుండానే తనను బూతులు తిడుతూ.. తన పరువుకు భంగం కలిగిస్తూ తనపై దాడి చేశారు అంటూ కంప్లైంట్ ఇచ్చింది. ఇక నిన్నటికి నిన్న ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు అని, ఫిజికల్ గా ఎన్నోసార్లు కలిసాము అంటూ ఒక లేఖ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ఒక లెటర్ వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని ఇప్పుడు దూరం పెడుతున్నారు అంటూ ఈశ్వర్ సాయిపై కంప్లైంట్ ఇచ్చింది.

Advertisement

also read:రవితేజ వారసుడు ఎంట్రీ.. థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తి రేపుతున్న ‘మారెమ్మ ‘ ట్రైలర్!

పరారీలో ఈశ్వర్ సాయి..

మాధురి రాథోడ్ కంప్లైంట్ తీసుకున్న నార్సింగి పోలీస్ స్టేషన్ పోలీసులు.. ఈశ్వర్ సాయిపై పలు మోసపూరిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతనిని అదుపులోకి తీసుకునేందుకు రెండు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. మొత్తానికి అయితే మాధురి రాథోడ్ కంప్లైంట్ ఇవ్వగా.. పోలీసులకు చిక్కకుండా ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నారు. మరి ఇతడిని అరెస్టు చేయాలి అంటూ మాధురి రాథోడ్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఫోక్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ..

Advertisement

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ప్రమీల ఓ ప్రమీల, సీటీ చీర, సన్న సన్న బియ్యమే, రాతిరి రాతిరి రాతిరిలో, కళ్ళకు కాటుక దిద్దినారో, అది అబ్బబ్బాగా పోరి, లయి లయి లబ్బరి బొమ్మ , బాసింగ బలాలు వంటి పాటలతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈశ్వర్ సాయి తోనే కలిసి డాన్స్ చేయడం విశేషం. వీటితోపాటు మరెన్నో పాటలలో ఆమె అద్భుతమైన ప్రదర్శన కనిపించారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×