E-Paper
Advertisement

రవితేజ వారసుడు ఎంట్రీ.. థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తి రేపుతున్న ‘మారెమ్మ ‘ ట్రైలర్!

రవితేజ వారసుడు ఎంట్రీ.. థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తి రేపుతున్న ‘మారెమ్మ ‘ ట్రైలర్!
Advertisement

Maremma trailer:సినిమా ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ ఆడియన్స్ లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు రవితేజ (Raviteja) వారసుడు మిస్టీరియస్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘మారెమ్మ’. తాజాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెంచుతున్న ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

మారెమ్మ ట్రైలర్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతి రాజు (Madhav Bhupathi Raju) ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా మూవీ మారెమ్మ. దీప బాలు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు.. సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ గ్రామీణ నేపథ్యం, దైవ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, యాక్షన్ అంశాలను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

Advertisement

ట్రైలర్ విషయానికి వస్తే.. “ప్రతి దేశానికి కొత్త చరిత్ర ఉన్నట్టు.. ప్రతి ఊరి పుట్టుకకు కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది”.. అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభించారు. “ఊరిలో గత్తర లేచింది. దూడలన్నీ చస్తున్నాయి ” అంటూ ఆ ఊరిలో ఏర్పడిన సంక్షోభం గురించి గ్రామస్తులు భయపడుతున్న తీరు క్యూరియాసిటీని పెంచేసింది. “మొన్ననే జాతర చేసాము కొంచెం కనికరం చూపించు తల్లి మారెమ్మ” అంటూ గ్రామస్తులు వేడుకున్న తీరు దైవత్వాన్ని చూపిస్తోంది. “వచ్చే మూడవ పౌర్ణమి లోపల.. ఊరిలో గేదెకి మగ బిడ్డ పుడుతుంది” అంటూ ఒక జ్యోతిష్కుడు చెబుతాడు. ఆ దున్న బాధ్యతను హీరోకి అప్పగిస్తారు. జాతరలో బలివ్వడానికి దున్నపోతును పెంచుతారు . ఇక జాతర దగ్గర పడే సమయంలో దున్న కనిపించకపోవడం.. ఊరిలో ప్రజలు చనిపోవడం.. ఏడేళ్ల పగా అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి.

also read:“మాధురి రాథోడ్ నోరు విప్పితే అంతా జైలుకే”.. నిజాలు బయటపెట్టిన ఫోక్ ప్రొడ్యూసర్!

అంచనాలు పెంచుతున్న ట్రైలర్..

Advertisement

మొత్తానికి ట్రైలర్ చూశాక గ్రామంలో పాతుకుపోయిన నమ్మకాలు, స్థానిక రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు, హీరో ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఈ క్రమంలో హీరో పలు హింసాత్మక సంఘర్షణలలో చిక్కుకున్నట్లు ట్రైలర్ లో చూపించారు. మరి మారెమ్మ కథలో అసలు మిస్టరీ ఏమిటన్నది మాత్రం ట్రైలర్లో రివీల్ చేయలేదు.. పవిత్రమైన దున్న ఎందుకు కనిపించకుండా పోయింది. దాని వెనుక ఎవరి హస్తముంది? హీరో ఎదుర్కొనే సమస్యలకు, గ్రామ దేవత నమ్మకాలకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

రవితేజ వారసుడు హిట్ కొట్టినట్టేనా?

ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని ఇచ్చింది. ట్రైలర్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశారు. ఈ సినిమాతో మాధవ్ భూపతి రాజు సక్సెస్ కొట్టడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తుండగా.. వినోద్ కుమార్, వికాస్ వసిష్ట , వి.ఎస్ రూప లక్ష్మీ, దయానంద రెడ్డి తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు.

Related News

కల్కి 2 పై అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..10 రోజులు మాత్రమే అంటూ!

నా జీవితంలో నేను చేసిన ఆల్ఫా పని అదే.. ఎన్నో నిజాలు బయటపెట్టిన అల్లు అర్జున్!

‘ఇరుముడి’ డైరెక్టర్ తో బాలయ్య సినిమా..? ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం..

స్నిగ్ధ ప్రేమలో పడిందా..? ఇది అస్సలు ఊహించలేదు మావా..

‘టాక్సిక్’ తర్వాత యష్ మాస్టర్ ప్లాన్.. ఈసారి ఆ డైరెక్టర్‌తోనా?

మల్లెపూలపల్లకి పాటకి ముట్టింది ఎంతో తెలుసా ?

మలయాళం నుంచి వచ్చి టాలీవుడ్‌ను ఏలేస్తున్న ఒకే ఒక్కడు.. దుల్కర్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×