E-Paper
Advertisement

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!
Advertisement

Nepal Floods: హిమాలయాల్లో సంభవించిన హిమపాతం, దానివెంట వచ్చిన అకస్మిక వరదలు నేపాల్, చైనాను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా నేపాల్లో ఈ విపత్తు ప్రభావం అధికంగా ఉంది. ఈ జల ప్రళయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. వరదలో కొట్టుకుపోయిన వారి ఆచూకి కోసం నేపాల్ పోలీసులు గాలిస్తుండగా.. విషాధకర పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. వరద ధాటికి కొట్టుకుపోయిన ఓ ఇంటి నుంచి ఏకంగా 24 మృతదేహాలను తాజాగా రెస్క్యూ బృందం వెలికి తీసింది.

వివరాల్లోకి వెళ్తే..

నేపాల్‌లోని నువాకోట్ జిల్లా బెత్రవతి ప్రాంతంలో ఈ అత్యంత విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. వరద ధాటికి కొట్టుకుపోయిన ఓ భవనం నుంచి రెస్క్యూ బృందాలు ఏకంగా 24 మృతదేహాలను వెలికితీశాయి. ‘ఉత్తరగాయ మినీ మార్ట్’ (Uttargaya Mini Mart) నిర్వహిస్తున్న ఓ ఇంటిలో ఈ శవాలన్నీ లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోస్ట్ మార్టంకు తరలింపు

Advertisement

అయితే భవనంలో దొరికిన మృతదేహాలను గుర్తించే పనిలో నేపాల్ పోలీసులు పడ్డారు. చట్టపరమైన ప్రక్రియలు కొనసాగిస్తూ మృతుల వివరాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పోస్ట్ మార్ట్ నిమిత్తం మృతదేహాలను మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ విశ్వవిద్యాలయ టీచింగ్ ఆసుపత్రికి తరలించనున్నట్లు నువాకోట్ జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.

1000 దాటిన మరణాలు

నేపాల్, చైనాలను ఒకేసారి ముంచెత్తిన ఈ విపత్తులో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1000 దాటింది. దాదాపు 4,400 మందికి పైగా ఆచూకీ లభించకుండా పోయారు. ఒక్క నేపాల్‌లోనే ఇప్పటివరకు 987 మంది ప్రాణాలు కోల్పోగా 583 మంది విదేశీయులతో సహా 3,916 మంది గల్లంతైనట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ (NDRRMA) ప్రకటించింది. ఇక చైనాలో 16 మంది మృతి చెందగా 261 మంది విదేశీయులు సహా 546 మంది జాడ తెలియకుండా పోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

హిమపాతమే విపత్తుకు కారణం

ఆగస్టు 26న హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతంలో చోటుచేసుకున్న హిమపాతమే ఈ జల ప్రళయానికి దారితీసింది. నేపాల్-టిబెట్ సరిహద్దులోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద చోటుచేసుకున్న ఘటనే కారణమని తెలుస్తోంది. అక్కడ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు, కొండచరియలు విరిగి దాదాపు 1,200 మీటర్ల కిందకు పడటంతో లెండే నది ఉప్పొంగింది. నదీ ప్రవాహంతో పాటు మంచు, రాళ్లు, బురద విపరీతమైన వేగంతో కొట్టుకొచ్చి గ్రామాలు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను ధ్వంసం చేశాయి.

Also Read: తెల్లని బట్లలు పాతబడి పసుపుపచ్చగా మారుతున్నాయా? మళ్లీ మెరిసిపోయే తెల్లదనం కోసం టిప్స్

Tags

Related News

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

Big Stories

Advertisement
×