Madhuri Rathod:మాధురి రాథోడ్ ..ఎన్నో ఫోక్స్ సాంగ్స్ చేసినప్పటికీ అంతగా పాపులర్ కాని ఈమె ఈశ్వర్ సాయితో రెడ్ హ్యాండెడ్ గా రెడ్డి భవన్ లో దొరకడంతో ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.ఇక ఎక్కడ చూసినా మాధురి రాథోడ్ పేరే చక్కర్లు కొట్టింది. పైగా ఈశ్వర్ సాయి వైఫ్ తప్పంతా మాధురిదే అనడం, ఆపే అటు ఈశ్వర్ సాయి వైఫ్,ఇటు ఇద్దరూ సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లలో కంప్లైంట్ ఇచ్చుకోవడం మనకి తెల్సిందే. ఇక తనవైపు నుండి జరగ కూడని తప్పు జరిగిపోయిందని ఓపెన్ గా ఊపుకున్నాడు కూడా.
ఇద్దరూ కెరీర్ లో బిజీ అయ్యేందుకు ట్రై
ఇక ఇదిలా ఉంటె ఆ బ్యాడ్ ఫేజ్ ని మర్చిపోయే ప్రయత్నంలో అటు ఈశ్వర్ సాయి, ఇటు మాధురి రాథోడ్ ఇద్దరూ కెరీర్ లో బిజీ అయ్యేందుకు ట్రై చేయడం ఇక్కడ మెచ్చుకోతగ్గ విషయం. గత కొన్ని రోజుల కిందటే మోహబ్బత్ అనే సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నానని, గతంలో జరిగిన విషయాలని మర్చిపోయి సరికొత్తగా జీవితాన్ని మొదలెడదామని అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు కూడా.
ఏకంగా 4.4మిలియన్ల వ్యూస్
ఇక ఈశ్వర్ సాయి సంగతి అలా ఉంటే ఇటు మాధురి రాథోడ్ కూడా గత చేదు జ్ఞాపకాలని మర్చిపోతూ మళ్ళీ ఫోక్ సాంగ్స్ తో బిజీ అవ్వడం విశేషం. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల కిందట బిందెలు బిందెలు బావయ్య అనే పాట చేయగా అది తొమ్మిది రోజుల్లోనే ఏకంగా 4.4మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టడం చూస్తుంటే మాధురికి ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఐదు రోజుల కిందటే రిలీజ్ అయిన గాజులోల్ల పోరడ అనే పాట ఏకంగా 1.2 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి దూసుకుపోతుంది కూడా.
ఈ ప్రశ్నలకి సమాదానం చెప్పడానికి
ఇక అలా రెండు పాటలు నెట్టింట్లో దుమ్ము రేపుతుండగానే తాజాగా భామ సుందరాలో అంటూ మరో పాటకి సంబంధించిన గ్లిమ్స్ ఇపుడు సోషల్ మీడియాని చుట్టేస్తుంది. ముఖ్యంగా ఇందులో వచ్చే సూటి పోటి మాటలతో ఎన్నెల అనే లిరిక్స్ మాధురి జీవితంలో జరిగిన సంఘటనని గుర్తుకు చేస్తుందని సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఈ పాట చివరలో ఈ ప్రశ్నలకి సమాదానం చెప్పడానికి ఈ పాటతో త్వరలో మీ ముందుకు వస్తున్నా అంటూ చివర్లో చెప్పడం బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది కూడా.
ఈ ఫోక్ బ్యూటీ ఎలాంటి సమాధానం ఇస్తుందో
ఇక ఇదిలా ఉంటే పాట గ్లిమ్ప్స్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్. మాధురి రాథోడ్ ఏ సాంగ్ తీసిన ప్లాప్ అయినట్టు చరిత్రలోనే లేదు అని ఒకరంటే మాధురి రాథోడ్ దెబ్బ కి జాను అబ్బా అనాల్సిందే అంటూ మరొకరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు .ఇక డియర్ మధురి రాథోడ్ గారు, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. సమాజం మిమ్మల్ని దోషిగా చిత్రీకరిస్తూ ఎన్ని నెగెటివ్ కామెంట్స్ చేసినా, వాటిని పట్టించుకోకుండా మీ పని మీద దృష్టి పెట్టి ధైర్యంగా ముందుకు సాగుతున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ఎన్ని విమర్శలు ఎదురైనా లక్ష్యాన్ని మర్చిపోకుండా ముందుకు వెళ్లాలని మీ ప్రయాణం చూసి నేర్చుకోవాలి అంటూ మరొకరు మాధురి రాథోడ్ కి సపోర్ట్ గా నిలవడం విశేషం. చూడాలి మరి ఈ పాటతో ఈ ఫోక్ బ్యూటీ ఎలాంటి సమాధానం ఇస్తుందో !