E-Paper
Advertisement

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..
Advertisement

Ranbir Kapoor: రణబీర్ కపూర్ రామాయణ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలకు సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బెంగళూరులో ఇటీవల ఒక ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్..

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor)స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈయన చేతికి ధరించిన వాచ్ అంతటి దృష్టిని ఆకర్షించింది ఈ నేపథ్యంలోనే రణబీర్ ధరించిన ఈ వాచ్ ఏ కంపెనీకి సంబంధించినది? దీని ధర ఎంత? ఈ వాచ్ ప్రత్యేకత ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే రణబీర్ ధరించిన ఈ వాచ్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని తెలిసిన నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వాచ్ ప్రత్యేకత ఏంటి అనే విషయానికి వస్తే..

శ్రీరాముడు, హనుమంతుడి రూపాలతో..

Advertisement

రణబీర్ కపూర్ చేతికి పెట్టుకున్న ఈ వాచ్ జాకబ్ & కో. కంపెనీ వారి ఎపిక్ ఎక్స్ కలెక్షన్‌కు చెందిన వాచ్ .
ఈ వాచ్ రామ్ జన్మభూమి (Ram Janmabhoomi) రోజ్ గోల్డ్ స్పెషల్ ఎడిషన్. దీని ప్రారంభ ధర రూ.78 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ వాచ్ లోపల అయోధ్య లోని రామ మందిరం అలాగే శ్రీరాముడు (Lord Sriram)విల్లుతో నిలబడి ఉన్నటువంటి ఫోటో అలాగే హనుమంతుడి రూపాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక ఈ వాచ్ డయల్ పై హిందూ దేవతలకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ వాచ్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

వాచ్ ధర రూ. 78 లక్షలు…

రామాయణ(Ramayana) సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన రాముడి పాత్రకు అనుగుణంగానే తన చేతి వాచ్ కూడా ఉండటం విశేషం. ఇక ఈ వాచ్ ప్రారంభం ధర 78 లక్షలు అనే విషయం తెలిసిన నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వాచ్ స్పెషల్ ఎడిషన్ లో భాగంగా టైటానియం ఎడిషన్ ధర రూ.35.88 లక్షలు, రోజ్ గోల్డ్ ఎడిషన్ రేట్ రూ.78 లక్షలు,గోల్డ్ ఎడిషన్ ధర రూ.83 లక్షల నుంచి రూ.1.08 కోట్ల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇంత ఖరీదైన, రామభూమి స్పెషల్ డిజైన్ తో రూపొందించిన వాచ్ తో రణబీర్ కపూర్ కనిపించడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించగా, సీతగా సాయి పల్లవి (Sai Pallavi)నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Related News

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. భారత్ వదిలి వెళ్లాల్సిందేనా?

చిరంజీవితో మల్టీస్టారర్.. కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున!

రణబాలి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదా? ఎవరంటే?

Big Stories

Advertisement
×