E-Paper
Advertisement

BB Jodi2 winners: బిబి జోడి 2 విజేతలుగా మానస్ శ్రేష్టి వర్మ… రన్నర్స్ ఎవరంటే?

BB Jodi2 winners: బిబి జోడి 2 విజేతలుగా మానస్ శ్రేష్టి వర్మ… రన్నర్స్ ఎవరంటే?
Advertisement

BB Jodi2 winners: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిబి జోడి సీజన్ 2 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం సెమీఫైనల్స్ జరుగుతున్న నేపథ్యంలో మరొక రెండు వారాలలో ఈ కార్యక్రమం పూర్తి కాబోతోంది అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి విజేతలు ఎవరనే విషయంపై పెద్ద ఎత్తున వార్తల చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సెమీఫైనల్స్ జరుగుతున్నప్పటికీ ఫైనల్స్ లో ఎవరు విజేతలుగా నిలవబోతున్నారనే విషయానికి వస్తే.. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని జోడీలు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫైనల్స్ లో మానస్, శ్రేష్టి వర్మ, విశ్వ, నేహ చౌదరి జంటల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది.

బిబి జోడి2 విజేతలుగా మానస్ శ్రేష్టి..

ఇక ఈ కార్యక్రమం ఫినాలే మరొక రెండు వారాలలో పూర్తికానున్న నేపథ్యంలోనే ఈ సీజన్ విన్నర్ గా మానస్(Manas), శ్రేష్టి వర్మ(srishti Varma) నిలవబోతున్నారని తెలుస్తోంది. అలాగే రన్నర్లుగా నేహా చౌదరి విశ్వ నిలిచారని సమాచారం. ఇక ఈ కార్యక్రమంలో అమర్ దీప్, నైనిక కూడా మొదటి నుంచి ఎంతో అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తూ వచ్చారు.. ఇలా నైనిక అమర్ రేస్ లో లేరనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలా మానస్ శ్రేష్ఠి బిబి జోడి 2 విజేతలుగా నిలవడంతో ఈయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి సీజన్ విజేతలుగా ఆర్జే సూర్య, ఫైమా..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా 12 జోడిల మధ్య ఎంతో పోటాపోటీ నెలకొంది. ఇక ఈ కార్యక్రమంలో కేవలం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారు మాత్రమే పాల్గొంటున్న సంగతి తెలిసింది ఇదివరకే మొదటి సీజన్ ప్రసారం కాగా మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు. ఈ సీజన్ లో ఆర్జే సూర్య, ఫైమా విజేతలుగా నిలవగా అరియానా , అవినాష్ రన్నర్లుగా నిలిచారు. ఇక ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో సీజన్ 2 కూడా గత ఏడాది డిసెంబర్ నెలలో ఎంతో ఘనంగా ప్రారంభమైంది.

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గా శ్రేష్టి…

Advertisement

ఇక ఈ కార్యక్రమానికి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించగా, శేఖర్ మాస్టర్ పాటు హీరోయిన్స్ సదా, శ్రీదేవి జడ్జెస్ గా వ్యవహరించారు. ఇక త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి కానుంది. ఇక శ్రేష్టి వర్మ డాన్స్ కొరియోగ్రాఫర్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పని చేశారు. ఇలా డాన్స్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈమె మొదటి ఎపిసోడ్ నుంచి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చారు.. ఇటీవల ప్రసారమైన సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. హౌస్ లోకి వెళ్లిన మొదటి వారమే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మానస్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు.

Also Read: Anchor Lasya: భర్త పుట్టినరోజు.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన లాస్య…మంజునాథ్ ఎమోషనల్!

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×