E-Paper
Advertisement

YS Sharmila: వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే సవాల్.. షర్మిల స్కెచ్ మామూలుగా లేదుగా!

YS Sharmila: వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే సవాల్..  షర్మిల స్కెచ్ మామూలుగా లేదుగా!
Advertisement

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్వర్‌పై ఇండియా బ్లాక్ ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానానికి వైకాపా మద్దతు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైకాపా చేసిన ఆరోపణలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని జగన్ ‘దొంగ ఏడుపులు’ ఏడుస్తున్నారని విమర్శిస్తూ.. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలని షర్మిల పేర్కొన్నారు. వైకాపా ఎంపీలందరూ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి సంతకాలు చేయాలని, అభిశంసన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాలని ఆమె సవాల్ విసిరారు.

Advertisement

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే దమ్ము జగన్‌కు ఉందా అని ఆమె ప్రశ్నించారు. కేవలం సాకులు చెప్పడమే కాకుండా, ఎన్నికల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని షర్మిల స్పష్టం చేశారు. ఈ సవాల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈవీఎంల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

Also Read: తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన షాపులు!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×