E-Paper
Advertisement

Tirupati Fire: తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన షాపులు!

Tirupati Fire: తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన షాపులు!
Advertisement

Tirupati Fire:  తిరుపతి ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని ఒక వేస్టేజ్ దుకాణంలో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి తీవ్రతకు తోడు, లోపల ఉన్న పాత సామాన్లు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి.

మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, చూస్తుండగానే పక్కనే ఉన్న మరో దుకాణానికి కూడా మంటలు అంటుకున్నాయి. దీనివల్ల మొత్తం రెండు వేస్టేజ్ షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతం అంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేయడంతో స్థానిక ప్రజలు, షాపుల నిర్వాహకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో జనం అటు ఇటు పరుగులు తీశారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు మరింత విస్తరించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, షాపుల్లోని విలువైన సామాగ్రి కాలి బూడిదవ్వడంతో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: ఏపీలో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన చంద్రబాబు

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×