E-Paper
Advertisement

టాస్క్ ఎఫెక్ట్.. స్పీడ్ పెంచిన నరేష్.. వారిద్దరిపై వేటు తప్పదా?

టాస్క్ ఎఫెక్ట్.. స్పీడ్ పెంచిన నరేష్.. వారిద్దరిపై వేటు తప్పదా?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో గోట్ అవ్వడానికి కంటెస్టెంట్స్ మధ్య వార్ గట్టిగానే జరుగుతోంది. ముఖ్యంగా హౌస్ లో ఉన్న 17 మందిని మూడు లెవెల్స్ గా డివైడ్ చేశారు బిగ్ బాస్. అందులో రెడ్ లెవెల్ లో ఉన్న వారిని గోట్ కోసం పోటీపడే అర్హత లేదని తేల్చి చెప్పారు. నిన్నటి టాస్క్ లో పోటీ పడగా అందులో ముగ్గురు విజేతలుగా నిలిచారు. దేబ్జానీ , నీతూ , అమన్ ముగ్గురు కూడా గోట్ లుగా మారి 2 వారాల ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు. ఇకపోతే టాస్క్ లో గెలిచినప్పటికీ తనను విజేతగా చేయలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న నరేష్ .. నేటి ఎపిసోడ్లో మరింత జోరు పెంచినట్టు కనిపించారు. మరోవైపు టాస్క్ లో గొడవ పడడంతో ముఖేష్ (Mukhesh), శివ (Shiva) లను టాస్క్ నుండి డిస్ క్వాలిఫై చేస్తానంటూ సంచాలక్ గా వ్యవహరించిన అమన్ (Aman) చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

కనిపెట్టు చూద్దాం..

బిగ్ బాస్ సీజన్ 10 47వ రోజుకు సంబంధించి విడుదల చేసిన రెండవ ప్రోమోలో.. గ్రీన్ లెవెల్ లోకి వెళ్లి గోట్ గా మారేందుకు మిగిలిన ఆరు సభ్యులకు ఇస్తున్న మరో ఛాన్స్ ఇది అంటూ బిగ్ బాస్ చెబుతాడు. ఇక పోటీదారుల కోసం ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది వాటి సమాధానాలు బెల్ మోగించి చెప్పండి అంటూ బిగ్ బాస్ టాస్క్ నిర్వహించారు. ఎవరైతే ముందుగా బెల్ మోగిస్తారో.. వారికి సమాధానం చెప్పే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మొదటి ప్రశ్నలో భాగంగా.. “1 కిలో తడిగా ఉన్న కాటన్ బరువుగా ఉంటుందా? లేదా ఒక కిలో పొడిగా ఉన్న కాటన్ బరువుగా ఉంటుందా? అన్న ప్రశ్నకు ముఖేష్ తడిగా ఉన్న కాటన్ బరువుగా ఉంటుంది. అంటూ చెప్పాడు. ఇక బిగ్ బాస్ అది రాంగ్ ఆన్సర్ అని చెప్తాడు. వెంటనే శివ , నరేష్ లు మేం చెప్తామని ముందుకు రాగా సంచాలక్ గా వ్యవహరించిన అమన్ నరేష్ కి అవకాశం ఇచ్చాడు. ఇక నరేష్ 2 సమాన బరువు ఉంటాయని చెప్పాడు.. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ నరేష్ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ..బోని కొట్టారుగా అంటూ నరేష్ ఖాతాలో ఒక పాయింట్ వేశారు.

Advertisement

also read:కోర్ట్ బ్యూటీ శ్రీదేవి ‘ హైకూ’ మూవీ రివ్యూ.. తొలిప్రేమ ఎలా ఉందంటే?

జోరు పెంచిన నరేష్..

ఇక తర్వాత మరో ఫోటో చూపించి తెలుగు సినిమా ఏంటో చెప్పాలని అడగగా సలార్ అంటూ తెలిపారు నరేష్. అలా రెండు పాయింట్లు తన అకౌంట్లో వేసుకున్నారు. ఇక తర్వాత మరో మూవీ ని గెస్ చేయమని చెప్పగా.. త్రిగుణ్ ఓజీ బిగ్ బాస్ అని చెప్పాడు. ఇక మీ ప్రకారం ఇంట్లో ఎవరు ఓజీ అని అడగగా .. నేనే బిగ్ బాస్ .. త్రిగుణ్ అన్న దూత అంటూ తనను తాను మరోసారి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చే సౌండ్ ఏంటో గుర్తించండి అని బిగ్ బాస్ చెప్పగా.. మ్యాజిక్ ఫైర్ స్టిక్ అని శివ వర్షిని తోసుకొంటూ వచ్చి బెల్ కొట్టి చెప్పాడు.

గొడవ పెట్టుకున్న ముఖేష్.. శివ పై వేటు..

Advertisement

అయితే ముఖేష్ మాత్రం తోసేసి వెళ్ళాడు అంటూ గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు శివ మాట్లాడుతూ.. ఇందాక మీరు కూడా తోసేశారు కదా.. నేను కూడా కిందపడ్డాను కదా..అంటూ శివ చెప్పాడు. ముఖేష్ అంతటితో ఆగకుండా ప్రామిస్ చేసి చెప్పు అంటూ చిన్నపిల్లాడిలా అడిగే ప్రయత్నం చేశారు. అలా ఇద్దరి మధ్య గొడవ పీక్స్ కి చేరడంతో సంచాలక్ గా వ్యవహరించిన వీరిద్దరిని డిస్ క్వాలిఫై చేద్దాం అనుకుంటున్నాను అంటూ చెప్పాడు. ఏది ఏమైనా ఇద్దరి మధ్య గొడవ గేమ్ నుండి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది అంటూ ఇద్దరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

Related News

రెండేళ్లలోపే అరుదైన ఘనత సాధించిన బిగ్ బాస్ మానస్ కొడుకు!

కళ్లకు చూపు లేదు.. కానీ పాటలతో ఫేమస్! రషీద్, సమీరా జీవితంలో ఇన్ని కష్టాలా?

నరేష్ కి బిగ్ బాస్ అన్యాయం.. ఆ ముగ్గురే విజేతలు!

Podarillu : కన్నా తల్లి నిజం చెప్తుందా..? ఇలాంటి ట్విస్ట్ నెవ్వర్ బిఫోర్..

Illu Illaalu Pillalu : సీరియల్లో మరో ట్విస్ట్.. ఆ క్యారక్టర్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనా పై ప్రశంసలు.. కన్నీళ్లు తెప్పించాడు భయ్యా..

Podarillu Today Episode : కన్నాకు మహా వార్నింగ్.. మహా నిజం చెప్తుందా..? మాధవ్ కన్నీళ్లు..

Big Stories

Advertisement
×