kissik talks :మిథిలేష్ రెడ్డి ..బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ కంటెస్టెంట్ తాజాగా బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కిసిక్ టాక్స్ లో పాల్గొని సందడి చేశాడు.ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రేమ, బ్రేకప్ అనుభవాల గురించి కూడా మాట్లాడారు.దీంతో కిసిక్ టాక్స్ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి
ఇక ఇంటర్వ్యూలో మిథిలేష్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నాడు. వర్ష మాట్లాడుతూ గతంలో ఎప్పుడైనా బ్రేకప్ ఎదురైందా అని ప్రశ్నించగా, బీటెక్ చదువుతున్న సమయంలో ఓ అమ్మాయితో తనకు ప్రేమకు సంబంధించిన అనుభవం ఉందని తెలిపారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిస్థితులు, అపార్థాలు తన జీవితంలో ఓ జ్ఞాపకంగా మిగిలిపోయాయని మనసులోని బాధని బయటపెట్టాడు.
ఆ అమ్మాయితో సమస్యను పరిష్కరించుకునేందుకు తాను ప్రయత్నించానని మిథిలేష్ చెప్పారు. అయితే తాను చెప్పిన విషయాలను ఆమె నమ్మలేదని, అవతలి వ్యక్తికి నమ్మకం లేనప్పుడు ఎంత వివరించినా ప్రయోజనం ఉండదనే ఆలోచనతో తాను కూడా ఆ బందానికి గుడ్ బాయ్ చెప్పానని ప్రేమ రోజులని గుర్తు చేసుకున్నాడు.
ఆమె అంగీకరించినా తాను ఒప్పుకోను
ఇక ఇప్పుడు ఓక గుర్తింపు వచ్చింది కదా ఈ సమయంలో ఆ అమ్మాయి తన ప్రేమను నమ్మి తిరిగి వస్తే ఎలా స్పందిస్తారని అడిగగా మిథిలేష్ మాట్లాడుతూ ఇప్పుడు ఆమె అంగీకరించినా తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు. అప్పుడే తన మాటలను నమ్మి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయాడు. గతంలో తనను నమ్మని వ్యక్తి ఇప్పుడు పరిస్థితులు మారిన తర్వాత అంగీకరించినంత మాత్రాన తన నిర్ణయం మారదని తేల్చేశాడు.
ఇక సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు బిగ్బాస్ హౌస్లో కనిపించినప్పుడు ప్రేక్షకులు వారితో త్వరగా కనెక్ట్ అవుతుంటారని , తమలాంటి మనుషులు కూడా అలా ఎదగవచ్చని వారికి అనిపిస్తుందని తెలిపాడు. సెలబ్రిటీలకు ఇప్పటికే కొంత గుర్తింపు ఉంటుందని ,కామనర్స్ జర్నీ మాత్రం ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంటుందని అన్నాడు.
8 గంటలకు BIG TVలో ప్రసారం కానున్న కిసిక్ టాక్స్
సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడాతో కాకుండా అందరూ సమానంగా పోటీ పడితేనే షో మరింత ఆసక్తికరంగా ఉంటుందనే అభిప్రాయన్ని మిథిలేష్ బయటపెట్టాడు. తాము సెలబ్రిటీలమనే ఫీలింగ్ తో కాకుండా ఇతరులను తక్కువగా చూడకుండా, ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంపై దృష్టి పెట్టడం ముఖ్యమని తెలిపారు. ఇక బిగ్బాస్ రియాలిటీ షోలో పాపులారిటీ ఒక్కటే సరిపోదని, హౌస్లో అతడు ఎలా ప్రవర్తిస్తాడనేది కూడా ముఖ్యమని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి 8 గంటలకు BIG TVలో ప్రసారం కానున్న కిసిక్ టాక్స్ ని చూడాల్సిందే.