E-Paper
Advertisement

చూడటానికి సాధారణ ఇల్లాలు.. కట్ చేస్తే 14 కేసులు ఉన్న లేడీ విలన్.. ఎవరో తెలుసా?

చూడటానికి సాధారణ ఇల్లాలు.. కట్ చేస్తే 14 కేసులు ఉన్న లేడీ విలన్.. ఎవరో తెలుసా?
Advertisement

Koneti Sulochana: చూడగానే పక్కింటి పిన్నిగారి మాదిరిగా కనిపిస్తుంది కదా? వాకింట్లో ముగ్గులు వేసి.. వంటింట్లో గారెలు వేసే మాములు హౌస్ వైఫ్‌ కాదు. పెద్ద గ్యాంగ్‌నే మెయింటైన్ చేసే లేడీ డాన్. భర్త దగ్గర రిమోట్ లాక్కునే సాధారణమైన ఇల్లాలు కాదు. జనాల దగ్గర భూములను లాక్కునే టైప్.. బీరువాలో ఉన్న చీరెలను చూసి మురిసిపోయే రకం కాదు.. ఆమెపై ఉన్న కేసులను చూపించి బెదరించే లేడీ విలన్.

సులోచనలకు బ్యాడ్‌ టైమ్..

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కోనేటి సులోచన పేరు వింటే చాలు.. చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి. నేనే డాన్ అన్నట్టు దర్జాగా తిరుగుతుంది. అయితే ఈసారి సులోచనలకు బ్యాడ్‌ టైమ్ నడుస్తుంది. అదును చూసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ నన్నెవరు పట్టుకుంటారు? అనుకున్న ఫ్రాడ్ మేడమ్ ఇప్పుడు స్టేషన్‌లో కూర్చుంది.

ఆట ఏంటో తెలుసా?

Advertisement

ఈ సులోచన ఆట ఏంటో తెలుసా? ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. సులోచన పేరుపై రిజిస్ట్రేషన్‌ కావాల్సిందే ఈమె కబ్జా కోరలు మదనపల్లెతో ఆగలేదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విస్తరించాయి. అమాయకుల్ని మాటలతో బుట్టలో వేసి, నమ్మించి, నట్టేట ముంచేయడం ఈమె టాలెంట్. ఎవరైనా ఎదురు తిరిగితే? దబాయించడం వినకుంటే బెదిరించడం ఈమె స్టైల్.

చీటింగ్, భూ కబ్జా..

మదనపల్లె వన్‌టౌన్, టూటౌన్, తాలూకా ఈ మూడు స్టేషన్ల ఫైళ్లలోనూ సులోచన పేరే కనిపిస్తోంది. అన్ని ఫైళ్లను లెక్కేస్తే సులోచనపై 14కేసులు ఉన్నాయి. చీటింగ్, భూ కబ్జా.. చివరికి హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. కేసులు ఉన్నంత మాత్రాన ఎవరూ దోషిగా తేలిపోయినట్టు కాదు. ప్రతి కేసులోనూ ఆధారాలు, విచారణ, న్యాయస్థానం నిర్ణయమే కీలకం. అయినప్పటికీ 14 కేసుల ప్రస్తావనతో సులోచన పేరు మదనపల్లిలో మార్మోగిపోతోంది.

Advertisement

Also read: ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Tags

Related News

ప్లాస్టిక్, చైనా బొమ్మలు చెక్.. అమరావతి యువకుడి అద్భుత ప్రయోగం?

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ టికెట్ ఎవరికి?.. రేసులో ఉన్న టాప్ నేతలు వీరే!

ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విచిత్రం.. ఒకే గ్రామం నుంచి జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నిక!

సీజేపీ నేతల అరెస్టును ఖండిస్తూ.. ఎక్స్‌లో వైఎస్ జగన్ సంచలన ట్వీట్..?

జగన్‌తో పొత్తు ఎలా? అంటూ మాధవ్ ప్రశ్న, ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య

వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు, అవినాష్ అరెస్టుకు సంకేతాలు! ఇవాళ విచారణకు

ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్

Big Stories

Advertisement
×