E-Paper
Advertisement

జబర్దస్త్ రీ ఎంట్రీ పై స్పందించిన నాగబాబు.. కమెడియన్స్ పై షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ రీ ఎంట్రీ పై స్పందించిన నాగబాబు.. కమెడియన్స్ పై షాకింగ్ కామెంట్స్!
Advertisement

Nagababu: నాగబాబు పరిచయం అవసరం లేని పేరు. మెగా బ్రదర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన ఈయన సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నాగబాబు నిర్మాణంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈయన నటుడిగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా వెండితెర నటుడిగా మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా నాగబాబు పలు సీరియల్స్ అలాగే బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ సందడి చేశారు. ఇక నాగబాబు అంటేనే టక్కున జబర్దస్త్ జడ్జి అనే అందరికీ గుర్తుకు వస్తారు.

జబర్దస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు..

జబర్దస్త్ కామెడీ షో కార్యక్రమం మొదట్లో నాగబాబు జడ్జిగా కొనసాగే వారు అయితే కొన్ని కారణాల వల్ల ఈయన ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇలా నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఎంతోమంది ఈ కార్యక్రమంలో జడ్జెస్ గా పనిచేశారు కానీ అనుకున్న విధంగా సక్సెస్ మాత్రం కాలేకపోయారు . ఇక జబర్దస్త్ కార్యక్రమా రేటింగ్ కూడా దారుణంగా పడిపోవడంతో తిరిగి ఈ కార్యక్రమానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మల్లెమాలవారు నాగబాబును రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి నాగబాబుతో పాటు నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు..

Advertisement

గతంలో నాగబాబు రోజా ఈ కార్యక్రమానికి జడ్జెస్ గా ఉండగా రీఎంట్రీ తర్వాత నాగబాబుతో పాటు ఇంద్రజ జడ్జిగా కొనసాగుతున్నారు. ఇక నాగబాబు జడ్జిగా పాల్గొన్నటువంటి కార్యక్రమం శుక్రవారం ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోలను కూడ విడుదల చేశారు. తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి రావడం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

చాలా హ్యాపీగా ఉంది..

Advertisement

ఈ నేపథ్యంలోనే నాగబాబు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా జబర్దస్త్ స్టేజ్ పై ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ.. జబర్దస్త్ కార్యక్రమంలో కామెడీ ఏమాత్రం తగ్గలేదు. సీనియర్స్ మరింత బలంగా నిలిచారు వారికి ఇప్పుడు కావాల్సింది వాళ్లతో కలిసి ప్రయాణించే మనుషులు. జడ్జిగా ఈ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంద్రజ గారు తన సహచరి జడ్జిగా, రష్మి గౌతమ్ తో పాటు నా బాయ్స్ అందరితో కలిసి తిరిగి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా నాగబాబు జబర్దస్త్ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇవ్వడం గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. నాగబాబు తిరిగి ఈ కార్యక్రమానికి రావడంతో ఈ కార్యక్రమం పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి నాగబాబు ఎంట్రీతో జబర్దస్త్ కార్యక్రమం మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: రమణ గోగుల గుండు వెనుక రహస్యం ఏంటో తెలుసా..గొప్ప ప్రేమంటూ!

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×