Heinrich Klaasen : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే 30కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈసారి జరుగుతున్న సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా రానిస్తోంది. మొదట్లో కొన్ని మ్యాచ్ లు ఓడిపోయినప్పటికీ, ఇప్పుడు గాడిలో పడింది. వరుసగా మూడు విజయాలను కూడా నమోదు చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ డేంజర్ ఆటగాడు, కాటేరామ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ ( Heinrich Klaasen flying kiss) వైరల్ గా మారింది. తన భార్య అలాగే పిల్లలకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు క్లాసెన్. అయితే అక్కడే ఉన్న కావ్య పాప ( KAvya Maran).. ఈ సంఘటనను చూసి షాక్ అయింది. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కావ్య పాపకు ఆ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. భార్య, పిల్లలకు ఇస్తున్నట్లు నటిస్తూ, SRH ఓనర్ కావ్య పాపకే ఎసరు పెట్టాడని క్లాసెన్ ను ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల ( Sunrisers Hyderabad vs Delhi Capitals, 31st Match) మధ్య రెండు రోజుల కిందట కీలక మ్యాచ్ జరిగింది. ఏప్రిల్ 21వ తేదీన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ( Rajiv Gandhi International Stadium, Hyderabad ) ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ అద్భుతంగా రాణించి 47 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 242 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 195 పరుగులు మాత్రమే సాధించగలిగింది.
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ లో క్లాసెన్ చేసిన పని వైరల్ గా మారింది. బ్యాటింగ్ పూర్తయిన తర్వాత, డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే ముందు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్. అక్కడే కావ్య పాప కూడా ఉంది. దీంతో ఆమె అవాక్కయ్యారు. వాస్తవంగా కావ్య పాప పక్కనే క్లాసెన్ ( Klasen) భార్య పిల్లలు ఉన్నారు. వాళ్లను ఉద్దేశించి, ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు క్లాసెన్. కానీ కావ్య పాపకు ఇచ్చిందని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. కావ్య పాపను క్లాసెన్ ట్రై చేస్తున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు.
Look at Kavya Maran’s reaction when Heinrich Klaasen gave a flying kiss to his wife and kids during the DC vs SRH match. ❤
Cutest moment of IPL 2026. pic.twitter.com/XLlWXbCLjl
— Sonu (@Cricket_live247) April 23, 2026