E-Paper
Advertisement

జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు… జడ్జిగా దూరమైన ఆ పని మానలేదన్న మెగా బ్రదర్!

జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు… జడ్జిగా దూరమైన ఆ పని మానలేదన్న మెగా బ్రదర్!
Advertisement

Nagababu: బుల్లితెర పై ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ మంచి ఆదరణను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త ఆదరణ తగ్గిపోయింది. ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మెగా బ్రదర్స్ నాగబాబు(Nagababu) రంగంలోకి దిగారు. జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా నాగబాబుకి జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం ఘన స్వాగతం పలికారు. ఇలా నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రోమో కాస్త హైలెట్ గా నిలిచింది.ఇప్పటి వరకు ఒక లెక్క.. కానీ ఈవారం నుంచి మరో లెక్క. ది గ్రేట్ మెగా బ్రదర్.. నవ్వుల రారాజు, ది బాస్ ఈజ్ బ్యాక్ అంటూ యాంకర్ రష్మీ చెప్పగానే ఒక్కసారిగా కమెడియన్స్ మొత్తం పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నాగబాబుకు ఘన స్వాగతం పలికారు. నాగబాబు వేదిక పైకి రాగానే కమెడియన్స్ వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

లోకేషన్ కి వెళ్లి కొడదామా అనిపించేది..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలోకి నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వడంతో యాంకర్ రష్మీ మాట్లాడుతూ.. జడ్జిగా ఆ చైర్ లో ఎంతమంది కూర్చున్నా ఎప్పటికీ ఆ చైర్ మాత్రం మీదే అంటూ రష్మి తెలిపారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. తాను జడ్జిగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ జబర్దస్త్ కార్యక్రమాన్ని మాత్రం మిస్ అవ్వలేదని ప్రతివారం చూసే వాడినని తెలిపారు. అయితే కొన్నిసార్లు కమెడియన్స్ సరిగా చేసేవారు కాదు ఆ సమయంలో లొకేషన్ లోకి వెళ్లి వారిని లాగి పెట్టి కొడదామా అనే ఫీలింగ్ నాకు వచ్చేదని ఈ సందర్భంగా నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక జబర్దస్త్ కమెడియన్స్ గురించి ఈయన మాట్లాడుతూ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో కమెడియన్స్ లేకపోవడంతో ఇండస్ట్రీకి జబర్దస్త్ కమెడియన్స్ ను పంపించింది అంటూ ఈ సందర్భంగా నాగబాబు తెలియజేశారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం బుల్లెట్ భాస్కర్ ఫైమా వంటి తదితరులు తమస్కిట్ల ద్వారా ప్రేక్షకులను మెప్పించబోతున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి నాగబాబుతో పాటు ఇంద్రజ కూడా జడ్జిగా కొనసాగుతున్నారు. జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో నాగబాబు ఈ కార్యక్రమానికి మొట్టమొదటి జడ్జిగా కొనసాగారు ఈయనతో పాటు అప్పట్లో రోజా జడ్జిగా కొనసాగే వారు. కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఎంతోమంది నాగబాబు స్థానంలో వచ్చినప్పటికీ ఎవరూ కూడా ఈ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకోలేకపోయారు. నాగబాబు తిరిగి జబర్దస్త్ లోకి రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి మంచి రోజులు వచ్చాయని, ఈ కార్యక్రమానికి పూర్వ వైభవం రాబోతుందని తెలియచేశారు.

Also Read: ఎక్సక్లూజివ్ కంటెంట్ సబ్ స్క్రిప్షన్ చేసుకోండి.. విష్ణు ప్రియ భాటలో మరో బిగ్ బాస్ బ్యూటీ!

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×