E-Paper
Advertisement

వాల్‌నట్స్ నానబెట్టిన నీరు పారబోస్తున్నారా? ఈ లాభాలు తెలిస్తే షాక్ అవుతారు!

వాల్‌నట్స్ నానబెట్టిన నీరు పారబోస్తున్నారా? ఈ లాభాలు తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Soaked walnut water: చాలా మంది వాల్‌నట్స్‌ను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఆ పప్పులను తిని, నీటిని పారబోస్తుంటారు. కానీ నిజానికి ఆ నీటిలో కూడా వాల్‌నట్స్‌లోని పోషకాలు కరిగి ఉంటాయి. ఈ వాల్‌నట్ వాటర్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు అద్భుతంగా అందుతాయి. కేవలం బరువు తగ్గడమే కాకుండా.. థైరాయిడ్, పీసీఓఎస్ వంటి హార్మోన్ల సమస్యలకు ఇది రామబాణంలా పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల కలిగే ఆ 6 ఆశ్చర్యకరమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

సూపర్ ఫుడ్స్‌లో వాల్‌నట్స్ ఒకటి. వీటిని నానబెట్టడం వల్ల వాటిలోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి. పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. అయితే.. పప్పులతో పాటు ఈ నీటిని కూడా తాగడం వల్ల కలిగే 6 ప్రధాన లాభాలు ఇవే..

Advertisement

1. బరువు తగ్గడానికి సహకారం:
వాల్‌నట్ వాటర్ శరీరంలో మెటబాలిజం (జీవక్రియ) రేటును పెంచుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. తద్వారా మీరు అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా ఉంటారు.

2. హార్మోన్ల సమతుల్యత:
నేటి కాలంలో చాలామంది మహిళలు పీసీఓఎస్, థైరాయిడ్ , ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యలతో బాధపడుతున్నారు. వాల్‌నట్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Advertisement

3. గుండె ఆరోగ్యానికి మేలు:
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు నానబెట్టిన నీటిలో కూడా లభిస్తాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దీని వల్ల రక్త పోటు అదుపులో ఉండి, గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది.

4. మెదడు చురుగ్గా పనిచేస్తుంది:
వాల్‌నట్స్ మెదడు ఆకృతిని పోలి ఉండటమే కాకుండా.. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలకు ఈ నీటిని ఇస్తే.. వారి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

Also Read: ఎండలో వెళ్తే తలనొప్పి వస్తుందా? ఈ చిట్కాలు పాటిస్తే ఇట్టే మాయం!

5. చర్మం, జుట్టు సౌందర్యం:
ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తాయి. ఇది మొటిమలు, ముడతలు తగ్గించి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. అలాగే ఇందులోని బయోటిన్ జుట్టు రాలడాన్ని తగ్గించి.. జుట్టు దృఢంగా పెరగడానికి దోహద పడుతుంది.

6. మలబద్ధకం నుంచి ఉపశమనం:
వాల్‌నట్ వాటర్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది గొప్పగా పనిచేస్తుంది.

ఎలా తీసుకోవాలి?
రాత్రిపూట రెండు వాల్‌నట్స్‌ను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం పప్పులను తిన్న తర్వాత.. ఆ నీటిని వడకట్టి నెమ్మదిగా తాగండి.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×