Bellamkonda Sreenivas:ఈ ఏడాది చిత్ర పరిశ్రమలో పలువురు టాలీవుడ్ హీరోలు పెళ్లి పీటలెక్కుతూ కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda), అల్లు హీరో అల్లు శిరీష్ (Allu Sirish) తమకు నచ్చిన వారిని పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మరొక జంట తమ ప్రేమను పెద్దలకు చెప్పి, ఒప్పించి ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతోంది.. వారే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యువ కథానాయకుడిగా పేరు సొంతం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda sai Srinivas) ఆయన ప్రేయసి కావ్యారెడ్డి (Kavya Reddy). గత రెండేళ్లుగా రహస్యంగా ప్రేమాయణం సాగించిన వీరు ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇకపోతే తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి సాయి శ్రీనివాస్ అత్యంత సన్నిహితల సమక్షంలో ప్రీ ఎంగేజ్మెంట్ జరుపుకొని అధికారికంగా ప్రకటించారు.
ఇక రెండు వారాల క్రితం ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయింది . ఇక పెళ్లికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పెళ్లి పిలుపుల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబం. ముఖ్యంగా తన జీవితంలో ప్రారంభం కాబోతున్న ఈ కొత్త అధ్యాయం కోసం సాయి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి ఆహ్వాన పత్రికలను పలువురు సినీ ప్రముఖులకు స్వయంగా అందజేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తన తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తో పాటు తల్లి అలాగే తనకు కాబోయే భార్య కావ్యతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు పెళ్లి పత్రిక అందజేసి వేడుకకు కుటుంబ సమేతంగా తప్పకుండా రావాలని సాదరంగా ఆహ్వానించారు బెల్లంకొండ ఫ్యామిలీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కాబోయే నూతన దంపతులు సాయి శ్రీనివాస్ , కావ్య రెడ్డి లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:బ్లాక్ బస్టర్ జవాన్ సీక్వెల్ కి సర్వం సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం పెళ్లి పిలుపుల కార్యక్రమం మొదలు కావడంతో అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. అభిమానులు కూడా #Sreenivasakavyanam అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వేడుకకు సంబంధించిన పలు విశేషాలను షేర్ చేస్తూ ముందస్తుగానే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ జంట ఏడడుగులు వేసే వరకు వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించాలని తండ్రి సురేష్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆశీర్వాదాలతో ఏప్రిల్ 29వ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు.