Bigg Boss 10:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ డ్రామా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల ఆటను మహాభారతంలోని పాత్రలతో పోలుస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ పౌరాణిక పోలికలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఆసక్తికరమైన పోలికల విశేషాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్‌బాస్ హౌస్‌ను ఒక కురుక్షేత్ర రంగస్థలంగా మారుస్తూ, వీకెండ్‌లో ఎపిసోడ్‌లను నడిపించే సూత్రధారి మన హోస్ట్ కింగ్ నాగార్జున. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ఉండి నడిపించిన శ్రీకృష్ణుడిలాగే.. నాగార్జున హౌస్‌లోని తప్పులను ఎత్తిచూపుతూ, సరైన మార్గదర్శకత్వం చేస్తూ చక్రం తిప్పుతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హౌస్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు రచిస్తూ గేమ్ ఆడే ప్రధాన పాత్రలో ఆటో రామ్ ప్రసాద్ కనిపిస్తున్నారు. అందుకే నెటిజన్లు ఆయన్ను దుర్యోధనుడి పాత్రతో పోల్చారు. ఇక తనదైన మార్క్ ప్లాన్లతో మిగతా వాళ్లకు గట్టిపోటీ ఇస్తూ రామ్ ప్రసాద్ ఆడుతున్న తీరు ఆటలో హైలైట్‌గా నిలుస్తోంది.
టాస్క్‌లలో ఎక్కడా వెనకడుగు వేయకుండా నిలకడగా రాణించే ధీరుడిగా ముకేశ్ గౌడను ‘అర్జునుడు’గా అభివర్ణించారు. అలాగే హౌస్‌లో తన బలమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తూ, ఎవరినైనా ఎదురించే దూకుడు ప్రదర్శించే కంటెస్టెంట్‌గా టెంపర్ వంశీని ‘భీముడు’తో పోల్చారు. వీరిద్దరి ఆటతీరు హౌస్‌లో అప్పుడప్పుడు హీట్ పుట్టిస్తోంది.
also read:మళ్లీ వచ్చేస్తున్న బర్నింగ్ స్టార్.. రీ రిలీజ్ కి సిద్ధమైన కొబ్బరిమట్ట.. ఎప్పుడంటే?
ఈ జాబితాలో కేవలం వీరే కాకుండా మరికొందరు కంటెస్టెంట్లు కూడా పౌరాణిక పాత్రలతో పోల్చబడుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్‌గా ఉంటూ, ప్రతి చర్చకు, గొడవకు కేంద్రబిందువుగా మారిన వర్షిణి సౌందరరాజన్‌ను ‘ద్రౌపది’ పాత్రతో పోల్చారు. అలాగే జబర్దస్త్ నరేష్ నకులుడిగా, రోహిత్ నాయుడు సహదేవుడిగా, రామకృష్ణ ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారు. సింగర్ ఝాన్సీ అంబలా మొండి పట్టుదలతో వాయిస్ వినిపిస్తుండగా, దెబ్జానీ మోదక్ భీష్ముడిలా అనుభవాన్ని చాటుకుంటున్నారు. షాలిని పటేల్ కుంతీ దేవి పాత్రలను గుర్తుకు తెస్తున్నారు.
ఇక మొత్తానికి చూస్తే, బిగ్‌బాస్ 10 హౌస్ ప్రస్తుతం తలపిస్తున్న నామినేషన్ల గందరగోళాన్ని చూస్తుంటే నిజంగానే ఇదొక చిన్న కురుక్షేత్ర యుద్ధంలా కనిపిస్తోంది. కంటెస్టెంట్లను ఇలా మహాభారత పాత్రలతో ముడిపెట్టి నెటిజన్లు చేస్తున్న కామెంట్లు షోపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">