Kobbari Matta Movie:టాలీవుడ్‌లో స్పూఫ్, పేరడీ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కల్ట్ హిట్ చిత్రం ‘కొబ్బరి మట్ట’. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ నవ్వుల హారతి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే కాకుండా మంచి కలెక్షన్లు కూడా సాధించింది. తాజాగా మరోసారి థియేటర్లలో నవ్వులు పూయించడానికి ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘కొబ్బరి మట్ట’ నవంబర్ 14న గ్రాండ్‌గా రీ రిలీజ్ కానుంది. అమృత ప్రొడక్షన్స్ పతాకంపై సాయి రాజేష్ నీలం ఈ చిత్రాన్ని నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. సంపూర్ణేష్ బాబు హీరోగా సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ‘హృదయ కాలేయం’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఆ క్రేజ్‌తోనే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఇటీవల నాని ‘ప్యారడైజ్’ సినిమాలో సీరియస్ రోల్ చేసిన సంపూ, ఇప్పుడు మళ్ళీ తన మార్క్ కామెడీతో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
తెలుగు తెరపై వచ్చిన విభిన్నమైన స్పూఫ్ సినిమాల్లో ‘కొబ్బరి మట్ట’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ట్రిపుల్ రోల్‌లో అదరగొట్టారు. పాపరాయుడు, పెద్దరాయుడు, ఆండ్రాయిడు పాత్రల్లో ఆయన చేసిన కామెడీ టైమింగ్, అల్లరి అప్పట్లో అందరినీ కడుపుబ్బా నవ్విచింది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో సంపూ సరసన ఏడుగురు కథానాయికలు నటించడం మరో విశేషం.
also read:బిగ్ బాస్ 10లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.. మరొకరు కూడా?
తాజాగా నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో ‘బిర్యానీ’ అనే ఒక డిఫరెంట్ రోల్‌లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం కోసం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ గురించిన చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంపూ స్పందిస్తూ.. గతంలో తాను హీరోగా నటించినప్పుడు ఎంత పారితోషికం తీసుకునేవాడినో, ఈ సినిమాకు దానికి ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. గతంలో ఆయన ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగానే పారితోషికం అందుకున్నారన్న టాక్ ఉండటంతో, ఈ లెక్కన ‘ది ప్యారడైజ్’ కోసం ఆయన దాదాపు 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక మొత్తానికి చూస్తే, అప్పట్లో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన ‘కొబ్బరి మట్ట’ మూవీ ఇప్పుడు నవంబర్ 14న మరోసారి రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంపూర్ణేష్ బాబు నాన్‌స్టాప్ కామెడీని పెద్ద తెరపై మళ్ళీ ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Thank you so much @Kiran_Abbavaram Anna, for your love and support ❤️🙏
Let’s all celebrate the madness of #KobbariMatta once again in theatres on November 14th ❤️🔥 https://t.co/Jr94hq4EHE
— Sampoornesh Babu (@sampoornesh) October 24, 2026