E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : బాలు ఎంత మంచోడు సామి..ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..!

Gundeninda Gudigantalu Balu : బాలు ఎంత మంచోడు సామి..ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..!
Advertisement

Gundeninda Gudigantalu Balu : స్టార్ మా లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న సీరియస్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బాలు మాత్రమే. కాస్త మొండిగా మరి కాస్త ప్రేమగా తన డిఫరెంట్ క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు మన బాలు.. పేరుకే తమిళనాడు అయినా కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలకు తెలుగింటి వాడు అయిపోయాడు.. తెలుగులో ఈయన చేసిన సీరియల్స్ కేవలం రెండు మాత్రమే. కానీ ప్రజల దృష్టిలో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలు సీరియల్స్ ద్వారా మాత్రమే కాదు ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు జనాలని బాగా ఆకట్టుకున్నాయి.. తాను చేసే మంచి పనుల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అందరిని మోటివేట్ చేయడం బాగా నచ్చుతుంది.. అందుకే అమ్మాయిలు బాలు అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. బాలు చేస్తున్న పనులకి చాలామంది బాలు లాంటి హస్బెండ్ వస్తే బాగుండు అని కలలు కంటున్నారు. ఎంతైనా బాలు గ్రేట్ కదా అని అనుకుంటున్నారు కూడా.. బాలు రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? నెటిజన్లు ఎందుకు బాలు పై ప్రశంశలు కురిపిస్తున్నారు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

బాలు సానా మంచోడు..

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్ గుండెనిండా గుడి గంటలు హీరో బాలు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన చేస్తున్న మంచి పనులకు హీరోల కన్నా ఎక్కువగా ప్రశంసలు దక్కుతున్నాయి. సీరియల్ హీరో అయి ఉండి కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే బాలుకి జనాలు ఫిదా అయిపోతున్నారు. ఇటీవల కాలంలో చాలామంది చిన్నారులకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసి వాళ్ళకి సాయం అందించాడు.. ఏ కాదండోయ్ తన వర్క్ చేయాల్సిన సాయాన్ని కూడా చేశాడు. ఒక బుల్లితెర నటుడు ఇంత గొప్ప పని చేయడంపై నెటిజన్లు అభినందిస్తున్నారు.. బాలు రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాలు లాంటి కొడుకు ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది అంటూ కొందరు కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా బాలు నిజంగానే గ్రేట్ అంతే..

బాలు రియల్ లైఫ్ & రెమ్యూనరేషన్..

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోగా నటిస్తున్న బాలు అసలు పేరు విష్ణు కాంత్.. ఇతను తెలుగు వాడు కాదు.. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈయన పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు. బాలు మోటు నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. తన అందం అభినయంతో జనాలని కట్టిపడేస్తున్నాడు. బాలు నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట కొందరికి తూటాల్లాగా గుచ్చుకున్న సరే మరికొందరికి మాత్రం బాలు కరెక్ట్ అంటూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ సీరియల్స్లలో పెద్దగా కనిపించకపోవడంతో తెలుగు ప్రేక్షకులు బాలుకి సపోర్ట్ చేస్తున్నారు.. అలాంటి బాలు ఒక్క రోజుకి రెమ్యూనిరేషన్ కూడా బాగానే సంపాదిస్తున్నాడు.. ఈ మధ్యకాలంలో ఒక రోజుకి 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న తమిళనాడు ఇతనే. ఒక్క రోజుకి 40 వేలు అంటే నెలలో 25 రోజులు షూటింగ్ ఉంటుంది కాబట్టి లక్షల్లోనే బాలు సంపాదిస్తున్నాడు అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఇకపోతే బాలు మరో సీరియల్ లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అతి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Also Read :Podarillu kesava : ‘పొదరిల్లు ‘ కేశవ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేశాడో తెలుసా..?

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×