CJP Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయా? ఇందులోని కొన్ని వ్యతిరేక శక్తులు ఎంట్రీ ఇచ్చాయా? బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె బయట పెట్టిన వీడియో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైందా? నిరసనల ద్వారా ఇండియాను ముక్కులు చేసేందుకు కుట్ర పన్నాయా? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు.
సీజేపీ ఆందోళనలు తీవ్రతరం- పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో జంతర్‌మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సీజేపీ చేపట్టిన నిరసనలకు ఖలిస్థానీ వేర్పాటువాది సిఖ్స్ ఫర్ జస్టిస్-SFJ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతు ఇచ్చారు. అదే సమయంలో నిరసనకారులకు ఆయన ఆఫర్ ఇచ్చినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.
సీజేపీ ఆఫర్ ఇచ్చిన పన్నూ-వైరల్ అవుతున్న ఆ వీడియోలో పన్నూ నోరు విప్పారు. సీజేపీ నాయకులతో జూమ్ కాల్‌లో తాను మాట్లాడానని ప్రస్తావించాడు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపవద్దని సూచించినట్లుగా ఉంది. ఆగస్టు 15 వరకు ఈ విధంగా ఆందోళనలను కొనసాగిస్తే తాను సీజేపీకి రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందిస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. మోదీ ప్రభుత్వం పతనం ఒక్కటే సరిపోదన్నాడు.
భారత్‌కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు-భారత్ ముక్కలు కావడమే అసలైన పరిష్కారమని దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. నిరసనకారులు దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిరస్కరించాలని పేర్కొన్నాడు. ఆ వీడియోను బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఎక్స్‌లో షేర్ చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నిరసనల వెనుక ఎలాంటి దేశద్రోహ కుట్ర దాగి ఉందని ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? సీజేపీ నిరసనలకు పన్నూన్ మద్దతు పలకడం కొత్త మలుపు తిరిగింది. SFJ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ.. కొన్నాళ్లుగా అమెరికా, యూకె, కెనడాల నుండి తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా బెదిరింపులు జారీ చేస్తూ ఖలిస్తాన్ వేర్పాటువాద ఎజెండాను ప్రచారం చేస్తున్నాడు.
ALSO READ: యువత ఆందోళన వేళ.. ప్రధాని మోదీ ప్రకటన, పేపర్ లీక్ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
గతేడాది ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ పతాకం ఆవిష్కరణ కార్యక్రమానికి అంతరాయం కలిగించడానికి కుట్ర పన్నాడనే ఆరోపణలపై ఎన్ఐఏ పన్నూన్‌పై కేసు నమోదు చేసింది. జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకుంటే వారికి రూ. 11 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు. ఇప్పుడు సీజేపీ నిరసనలకు మద్దతు తెలుపుతూ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అంతరాయం కలిగించాలంటూ ఆయన విడుదల చేసిన వీడియోపై చర్చ మొదలైంది.
पैसे कहॉं से आ रहे हैं? साज़िश क्या है? पिछले 20 दिनों में राहुल गांधी जी विदेश यात्रा में किन किन लोगों से मिले? असली खिलाड़ी कौन? https://t.co/csNggsAtXg
— Dr Nishikant Dubey (@nishikant_dubey) July 22, 2026