E-Paper
Advertisement

పాకిస్తాన్ క్రికెట్ లో వాస్తు దోషం..PCB ఆఫీస్ మార్చాలంటూ ఆదేశాలు

పాకిస్తాన్ క్రికెట్ లో వాస్తు దోషం..PCB ఆఫీస్ మార్చాలంటూ ఆదేశాలు
Advertisement

Pakistan Cricket Board should be shifted from Lahore to Islamabad:  2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) గెలిచేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెటర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ప్రారంభించిన బోర్డు, ఫిట్నెస్ కోసం పాడెల్ గేమ్స్ ఆడాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎలాగైనా టైటిల్ గెలుపే లక్ష్యంగా బోర్డు కూడా ముందుకు దూసుకు వెళ్తోంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెడ్ ఆఫీస్ ( headquarters of the Pakistan Cricket Board) అడ్రస్ మార్చేందుకుగాను చర్యలు తీసుకుంటున్నారట.

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

Advertisement

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif) కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. లాహోర్ ( Lahore) నుంచి ఇస్లామాబాద్ కు ( Islamabad) పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తరలిస్తే… వాస్తు దోషం పోయి, జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తుందని వెల్లడించారట. వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే.. కచ్చితంగా ఇస్లామాబాద్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెడ్ ఆఫీస్ ను తరలించాల్సిందేనని సూచనలు చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

పాకిస్తాన్ క్రికెట్ లో వాస్తు మార్పులు..హెడ్ ఆఫీస్ మార్చాలంటూ ఆదేశాలు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక సూచనలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని లాహోర్ నుంచి వెంటనే ఇస్లామాబాద్ కు తరలించాలని ఆయన వెల్లడించారు. ఇస్లామాబాద్ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సంబంధించిన కార్య కలాపాలు నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. బోర్డులో నిర్ణయాలు తీసుకోవడం… సంస్థ గత విషయాలు, ఇలా ఎన్నో అంశాలను ఇస్లామాబాద్ వేదికగా నిర్ణయం తీసుకుంటే.. వెంటనే అమలు చేయడానికి ఈజీ అవుతుందని తెలిపారు.

Advertisement

సమర్థవంతమైన పాలన పాకిస్తాన్ క్రికెట్లో కనిపిస్తుందని వివరించారు. ప్రభుత్వ పెద్దలు, క్రీడా మంత్రిత్వ శాఖతో నేరుగా సమన్వయం చేసుకునే వెసులుబాటు ఇస్లామాబాద్ వేదికగా ఉంటుందని వివరించారు. లాహోర్ లో అలాంటి అవకాశాలు లేవని స్పష్టం చేశారు. లాహోర్ లో ప్రధాన కార్యాలయానికి వాస్తు దోషాలు ఉన్నాయని కూడా బాంబు పేల్చారు. ఇస్లామాబాద్ కు తరలి వెళ్తే.. 2027 వన్డే వరల్డ్ కప్ ను పాకిస్తాన్ క్రికెట్ జట్టు అవలీలగా గెలిచే అవకాశాలు మెరుగవుతాయని కీలక సూచనలు చేశారు. టీమిండియాను ఓడించే శక్తి కూడా పాకిస్తాన్ కు వస్తుంది అన్నారు. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఇచ్చిన సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని న‌ఖ్వీ కూడా ఇంట‌ర్న‌ల్ గా కూడా చెప్పార‌ట‌.

 

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

Related News

గొడ‌వ‌లు మ‌ర్చిపోయి, మాతో టెస్ట్ సిరీస్ ఆడండి..బీసీసీఐని కోరిన న‌ఖ్వీ

పొద్దున లేస్తే.. రాముడిని, మోదీని తిడ‌తారా? ఇవేం దిక్కుమాలిన నిర‌స‌న‌లు !

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

Big Stories

Advertisement
×