Nindu Noorella Saavasam Serial Today Episode: అనామికలో ఉన్నది అరుంధతియా లేక అనామికనేనా అనేది తెలుసుకోవాలనుకుంటుంది చిత్ర అందుకోసం అనామిక దగ్గరకు వెళ్లి ఏవేవో అడుగుతుంది. అనామిక తెలివిగా సమాధానం ఇస్తుంది. కొన్నింటికి ఏవేవో తిక్క తిక్క సమాధానాలు ఇస్తుంది. దీంతో చిత్ర కన్ఫీజ్ అవుతుంది. అనామిక కూడా చిత్ర ఎందుకు నాతో ఇంతసేపు మాట్లాడుతుంది. మనుకే నా మీద అనుమానం వచ్చి నిజాన్ని కనిపెట్టమని చిత్రను పంపించిందా..? ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో చిత్ర వెంటనే అనామిక చెప్పు మీ ఊరు ఏ ఊరు అని అడుగుతుంది.
దీంతో అనామిక ఈ ఊరు కాదు అని చెప్తుంది. దీంతో అనామిక అదే ఏ ఊరో చెప్పు అని అడుగుతుంది. దీంతో అనామిక అంటే ఈ ఊరు కానప్పుడు మా ఊరు ఏంటో తెలియనప్పుడు ఇంక నా ఊరు గురించి తెలుసుకుని ఏం చేస్తారు అంతే కదా అంటుంది. దీంతో చిత్ర మరి నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావో అదైనా చెప్తావా..? అని అడుగుతుంది. దీంతో ఓ చెప్తాను ఎందుకు చెప్పను అంటూ అనామిక ఏదేదో చెప్తుంటే.. ఇంతలో అనామిక వాళ్ల అన్న, వదిన వస్తుంటారు. దూరం నుంచి చూస్తున్న మనోహరి అసహనంగా అది అనామికనో.. అరుంధతియే కనిపెట్టడం చిత్ర వల్ల కాదు. ఆ బాబ్జీ గాడు వచ్చాడేమో చూసి కనీసం భాగీ పనైనా ఫినిష్ చేస్తాను అనుకుంటూ బయటకు వెళ్తుంది. అనామిక ఆన్సర్ అర్థం కాక చిత్ర ఒక్క నిమిషం ఆగు అసలు నువ్వు ఏం చదువుకున్నావో చెప్పడానికి ఇండియాకు స్వాతంత్రం రావడానికి అసలు ఏంటి సంబంధం అని అడగ్గానే.. అనామకి సంబంధం ఉంది చిత్ర నువ్వు మొత్తం వింటేనే కదా తెలుస్తుంది. అప్పుడు బ్రిటిషర్స్‌కు అని చెప్పబోతుంటే..
చిత్ర అడ్డుపడి వద్దు నువ్వు చెప్పే సోది వినడం కంటే.. అదిగో అక్కడ సీతారాముల కథ చెప్తున్నారు అది వింటే నాకు పుణ్యమైన వస్తుంది ఓకే అంటుంది. దీంతో అనామిక అవును పుణ్యం వస్తుంది. కానీ నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా..? మరి నా గురించి తెలియాలంటే..? నేను చెప్పిందే కదా వినాలి అనగానే.. చిత్ర ఆశ్చర్యంగా ఏంటి.? నువ్వు నీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నావా..? అనగానే అనామిక అవును అంటుంది. దీంతో చిత్ర ఇరిటేటింగ్ గా నీకో దండం అని వెళ్లబోతుంటే.. అనామిక వాళ్ల అన్న వచ్చి పిలుస్తాడు. అది విన్న అనామిక, చిత్ర షాక్ అవుతారు. దగ్గరకు వచ్చిన అన్న వదినలను చూసిన అనామిక గుర్తు పట్టదు. ఎట్లు ఉన్నావు అమ్మా పోయిన సంది నువ్వు ఎట్లున్నవో అని ఎంత కంగారు పడినమో తెలుసా అని వాళ్ల అన్న అడగ్గానే.. అనామిక అలియాస్ అరుంధతి షాక్ అవుతుంది. పక్కనే చిత్ర మాత్రం వాళ్లు అంత ప్రేమగా మాట్లాడుతుంటే పరిచయం లేన్నట్టు చూస్తుందంటే.. ఇది కచ్చితంగా అరుంధతియే అని మనసులో అనుకుంటుంది.
అయ్యో వీళ్లు ఎవరో అనామికకు తెలిసిన వాళ్లలా ఉన్నారు. వీళ్లు అనామికకు ఏమౌతారో ఏంటో..? ఎలా పలకరించాలో ఏంటో ఏం తెలియడం లేదే అని మనసులో అనుకుంటుంది అనామిక. ఇంతలో వాళ్ల వదిన ఏంది మీ అన్న మాట్లాడుతూనే ఉన్నడు. నువ్వేంది పలకకుండా బొమ్మ లెక్క నిల్చున్నావు అంటుంది. వాళ్ల అన్న ఎలా ఉన్నావు అమ్మా అని అడుగుతాడు. దీంతో అనామిక నేను బాగానే ఉన్నాను అన్నా నువ్వెలా ఉన్నావు.. ఎలా ఉన్నావు వదిన అని అడుగుతుంది. దీంతో వాళ్ల వదిన అదేంటి నా బాగోగుల గురించి అడుగుతున్నావు అంటుంది. వాళ్ల అన్న అదేం మాట్లాడినా వంకలు పెడతావేంటి..? మీ వదిన మాటలకేం కానీ కేర్ టేకర్ గా వద్దంటే పోయినవ్ అక్కడ అంతా బాగానే ఉందా..? అని అడగ్గానే… బాగానే ఉందని అనామిక చెప్తుంది.
సరే కళ్యాణం అయినాక ఇంటికి పోదాం.. పండగ అయినాక రేపు డ్యూటికీ పోదువు సరేనా అంటాడు అనామిక వాళ్ల అన్నయ్య. దీంతో అనామిక నేను పిల్లలను చూసుకోవాలి. నేను ఇప్పుడు రాలేను అంటుంది. దీంతో వాళ్ల వదిన అదేంటో నీ పిల్లలను చూసుకోవాలి అన్నట్టు చెప్తున్నావు అంటుంది. దీంతో అనామిక సరే నాకు పనుంది తర్వాత కలుస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతా గమనించిన చిత్ర అనామికను అనుమానిస్తుంది. మనోహరి దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి అరుంధతియే.. అనామిక కాదు అని చెప్తుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది నిజమా..? అయినా నీకెలా తెలిసింది అని మనోహరి అడగ్గానే జరిగింది మొత్తం చెప్తుంది చిత్ర. దీంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటుంది మనోహరి.
మరోవైపు గుడికి సాధువుల వేషాలు వేసుకుని వచ్చిన బాబ్జీ తన మనుషులతో మిస్సమ్మను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మిస్సమ్మ ఒంటరిగా దొరకగానే కాషాయం బట్టలు కప్పి గుడి బయటకు తీసుకెళ్తుంటాడు. అదే టైంలో మిస్సమ్మను వెతుక్కుంటూ అమర్ వస్తాడు. అమర్ ను చూసిన బాబ్జీ భయంతో వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?