BigTV English

Tollgates: ఇకపై టోల్ గేట్లు ఉండవా? మే ఒకటి నుంచి కొత్త విధానం

Tollgates: ఇకపై టోల్ గేట్లు ఉండవా? మే  ఒకటి నుంచి కొత్త విధానం

Tollgates: టెక్నాలజీ పుణ్యంగా కొత్త కొత్తవి తెరపైకి వస్తున్నాయి. టోల్ గేట్ల వద్ద కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఫాస్టాగ్ విధానాన్ని తొలగించి ఇకపై జీపీఎస్ టోల్ (గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్) వసూలు విధానాన్ని అమలు చేయబోతోంది. దీనికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లుగా మే ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.


ఫాస్టాగ్ కు మంగళం

టెక్నాలజీ పుణ్యమాని కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  సరిగ్గా దశాబ్దం కిందట ఎన్డీయే ప్రభుత్వం జాతీయ రహదారులపై వాహనాలు వేగంగా వెళ్లేందుకు ఫాస్టాగ్ పద్దతిని తీసుకొచ్చింది. దీనివల్ల వాహనదారులకు సమయం ఆదా అయ్యేది. వెళ్లాల్సిన సమయానికి కాస్త అటు ఇటు చేరుకునేవారు. తాజాగా టోల్ గేట్ల వద్ద విప్లవాత్మక మార్పులు తీసుకు రావాలని ఆలోచన చేస్తోంది. ఇకపై జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు విధానాన్ని తీసుకురానుంది.


అంతా అనుకున్నట్లు జరిగితే మే ఒకటి నుంచి ఫాస్టాగ్ విధానానికి మంగళం చెప్పనుంది. జీపీఎస్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేయనుంది. కొత్త విధానంపై వాహనదారుల్లో రకరకాల డౌట్స్ వెంటాడుతున్నాయి. కొత్త విధానం ఎలా పని చేయనుంది. ఫాస్టాగ్ ఖాతాలో మిగతా డబ్బు మాటేంటి? ఇలా ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.

కొత్త విధానం ప్రకారం.. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలను తొలగిస్తారు. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీ వసూలు కానున్నాయి. ఈ లెక్కన టోల్ గేట్ల వద్ద వాహనం ఆపాల్సిన అవసరం లేదన్నమాట. తొలుత వాణిజ్య వాహనాలపై అమలు చేయనుంది. ఆ తర్వాత మిగతా వాహనాలకు విస్తరించాలనే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ALSO READ: పొలాల్లో కాదు వెయ్యి టన్నుల గోల్డ్ నిక్షేపాలు.. ఆ దేశం కష్టాలకు ఫుల్‌స్టాప్

గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్-జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సాంకేతిక ఉపయోగించనుంది. ఇకపై ప్రతి వాహనంలో ట్రాకర్‌ని అమర్చుతారు. శాటిలైట్ ద్వారా వాహనం ఎక్కడుందో ట్రాక్ చేస్తుంది. వాహనం హైవేపైకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు పక్కకు వెళ్లిపోయింది? ఆయా వివరాలను రికార్డు చేస్తుంది.

ఛార్జీ ఎలా చెల్లిస్తారు?

వాహనదారులు ప్రయాణించిన దూరం ఆధారంగా ఛార్జీలను లెక్కిస్తారు. వాటి ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. చెల్లించేందుకు డిజిటల్ వాలెట్ లేకుంటే లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతాయన్నమాట. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు వాహనాలను గుర్తించడంలో ఉపయోగపడతాయి.

జీపీఎస్ పద్దతి వల్ల తొలుత సమయం ఆదా అవుతుంది. ఆ తర్వాత ఇంధనం వంతు కానుంది.  ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. ఇవన్నీ ఆలోచించిన కేంద్రం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.  జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా టోల్ ఎగవేతను నివారించే అవకాశముందని ప్రభుత్వ వర్గాల మాట. మే ఒకటి నుంచి ఫాస్టాగ్ విధానం నిలిపిస్తే ఆ ఖాతాలో మిగిలిన బ్యాలెన్స్ మాటేంటి?

ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ మాటేంటి?

దీని గురించి వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాతీయ రహదారుల సంస్థ ఈ బ్యాలెన్స్‌ను తిరిగి వినియోగదారుల ఖాతాలకు బదిలీ చేయనుంది. ఇందుకోసం కొత్త విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  దేశవ్యాప్తంగా కొత్త పద్దతి ఇంప్లిమెంట్ కావడానికి ఆరు నుంచి ఏడాది వరకు పట్టవచ్చని అంటున్నారు.

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×