BigTV English

Gold Mining: పొలాల్లో కాదు..వెయ్యి టన్నుల గోల్డ్ నిక్షేపాలు, ఈ దేశానికి వరించిన అదృష్టం..

Gold Mining: పొలాల్లో కాదు..వెయ్యి టన్నుల గోల్డ్ నిక్షేపాలు, ఈ దేశానికి వరించిన అదృష్టం..

Gold Mining: బంగారం అంటేనే అందరిలో ఓ ఆసక్తి, ఒక ఆశ, ఒక కోరిక. ఇటీవల ఈ గోల్డ్ ధర దాదాపు లక్షకు చేరువైన తర్వాత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో పెద్ద బంగారు నిధి ఉందని తెలిస్తే చాలు అందరి దృష్టీ అక్కడికి మళ్లుతుంది. అలాంటి ఘనతే తాజాగా చైనా అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిధుల్లో ఒకదాన్ని చైనా కనుగొనడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.


పింగ్జియాంగ్‌లో ధనభాండారం!
హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్ కౌంటీ అనే ప్రదేశంలో సుమారు 1,000 మెట్రిక్ టన్నుల పైగా అధిక నాణ్యత గల బంగారం ఉన్నట్లు జియోలాజికల్ బ్యూరో అంచనా వేసింది. ఇది ఒక్కోగ్రాం కాదు, ఒక్కో కిలో కాదు… మెట్రిక్ టన్నుల్లోనే. దీని విలువను అంచనా వేస్తే అదే $83 బిలియన్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ.6.9 లక్షల కోట్ల పైచిలుకు. ఏ దేశానికైనా ఇది జాక్ పాట్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

సౌత్ డీప్‌ను దాటేసిన చైనా
ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ గని ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా పేరొందింది. అక్కడ 900 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. కానీ ఇప్పుడు చైనా ఆ రికార్డును బ్రేక్ చేసింది. పింగ్జియాంగ్ బంగారు నిల్వ దానిని మించి ఉంది. ఇది కేవలం చైనా మాత్రమే కాదు, గ్రహం మీదే అత్యంత భారీ బంగారు నిల్వగా నిలిచింది.


అంచనాల ప్రకారం

భూ లోతుల్లో బంగారం… 3D మోడలింగ్ తో ఈ విషయాలు బయటపడుతున్నాయి. హునాన్ జియోలాజికల్ బ్యూరో వర్గాల ప్రకారం, 2 కిలోమీటర్ల లోతులోనే 40కి పైగా బంగారు సిరలు ఉన్నట్టు గుర్తించారు. అవే కాకుండా, ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 300 మెట్రిక్ టన్నుల బంగారం అక్కడే ఉండవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, ఆ ప్రాంతాన్ని ఆధునిక 3D మోడలింగ్ టెక్నాలజీ ద్వారా విశ్లేషించగా, మరింత లోతుల్లో అంటే 3 కిలోమీటర్ల లోపల ఇంకా భారీగా బంగారం ఉండవచ్చని ఊహిస్తున్నారు.

Read Also: Baba Vanga: బాబా వంగా భయానక జోస్యం..మనిషి మనసుని …

మెట్రిక్ టన్నుకి 138 గ్రాముల బంగారం..?
ఇది చిన్న విషయంగా అనిపించొచ్చు… కానీ అసలు విషయమేమిటంటే – సాధారణంగా భూగర్భ గనుల్లో ఒక మెట్రిక్ టన్ను రాతి నుంచి 8 గ్రాముల బంగారం వచ్చినా దాన్ని హై గ్రేడ్ ఖనిజంగా పరిగణిస్తారు. కానీ పింగ్జియాంగ్‌లో తీసిన కొన్ని కోర్ నమూనాల్లో ప్రతి మెట్రిక్ టన్నుకు 138 గ్రాములు బంగారం లభించిందట! ఇది నిజంగా అరుదైన విషయమే. హునాన్ జియోలాజికల్ బ్యూరోకు చెందిన సీనియర్ ప్రాస్పెక్టర్ చెన్ రులిన్ చెబుతున్నారు “ఇంత అధిక శాతం బంగారం భూగర్భంలో కనిపించడం చాలా అరుదు. ఇది చైనాలో బంగారు పరిశోధనకు మైలురాయని అన్నారు.

చైనా బంగారం రాజ్యంగా మారుతోందా?
ఇప్పటికే చైనా వద్ద 2,000 మెట్రిక్ టన్నులకిపైగా బంగారు నిల్వలు ఉన్నాయి. తాజా కనుగొనబడిన ఈ 1,000 టన్నులు చైనా బంగారు నిల్వలపై మరింత ఆధిపత్యం తీసుకొస్తాయి. ప్రస్తుతం ప్రపంచ బంగారు ఉత్పత్తిలో చైనా దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కొత్త ఆవిష్కరణతో ఆ మార్కెట్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. స్పష్టంగా చెప్పాలంటే బంగారంపై భవిష్యత్తు పోరులో చైనా కీలక పాత్ర పోషించబోతోంది. ఇది కేవలం ఆర్థికంగా కాదు, వ్యూహాత్మకంగా కూడా కీలకం కానుంది.

బంగారు ఎలా ఏర్పడుతుంది?
భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం భూమిలో ఉన్న మాగ్మా వల్ల లేదా ఇతర భౌగోళిక ఒత్తిడుల వలన ఖనిజాలతో నిండిన ద్రవాలు భూమి లోపల పగుళ్ల గుండా కదులుతూ వివిధ రాళ్లను తాకుతూ బంగారాన్ని శోషిస్తాయి. ఆ తర్వాత ఉష్ణోగ్రత లేదా పీడనం మారిన సమయంలో బంగారం సిరల్లో నిక్షిప్తమవుతుంది. ఈ ప్రక్రియ మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. అందుకే బంగారం నిక్షేపాలు భూమిలో చాలా అరుదుగా కనిపిస్తాయి.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×