BigTV English

Nindu Noorella Saavasam Serial Today December 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బస్సును హైజాక్‌ చేసిన అరవింద్‌ – మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన నిర్మల

Nindu Noorella Saavasam Serial Today December 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బస్సును హైజాక్‌ చేసిన అరవింద్‌ – మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన నిర్మల

Nindu Noorella Saavasam Serial Today Episode :  అమర్‌ బస్సులో ఉన్న డ్రైవర్‌కు ఫోన్‌ చేసి ఎక్కడ వెళ్తున్నారు అని అడుగుతాడు. హైవే దాటి ఫారెస్ట్‌ లోకి ఎంటర్‌ అవుతున్నాము అని చెప్తాడు. అక్కడ ఏమీ అనుమానంగా లేదు కదా..? అని అడగ్గానే ఏం లేదని చెప్తాడు. మిమ్మల్ని ఎవరూ ఫాలో అవ్వడం లేదా..? అంటే లేదని డ్రైవర్‌ చెప్పగానే ఫోన్‌ కట్‌ అవుతుంది. అమర్‌ షాకింగ్‌ గా నిలబడిపోతాడు. శివరాం భయంగా అమర్‌ ఏమైంది చెప్పు అని అడుగుతాడు. నిర్మల కూడా భయపడుతూ అమర్‌ ఆ డ్రైవర్‌ పిల్లలను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అడుగుతుంది. అమర్‌ ఏమీ పలకడు. ఇంతలో రాథోడ్‌ కూడా ఆ డ్రైవరు.. అంటూ అనుమానంగా అడగుతాడు.


మరోవైపు డ్రైవరుకు అనుమానం వచ్చి ఫోన్‌ చెక్‌ చేసుకుంటాడు. అందులో అమర్‌ నెంబర్‌ ఉండటంతో అరవింద్‌కు ఫోన్‌ చేసి కంగారులో అమర్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడానని.. నేను అతనికి దొరికిపోయానని చెప్తాడు. దీంతో అరవింద్‌ కోపంగా డ్రైవరును తిట్టి.. అమర్‌ చేతిలో నేను ఓడిపోకూడదు.. ఈసారి అమర్‌కు దొరికితే జీవితంలో బయటకు రాలేను అనుకుంటూ రాజుకు ఫోన్‌ చేసి దాబా దగ్గరకు బస్సు వస్తుంది. నువ్వు వెళ్లి ఆ బస్సు ఎక్కు అని చెప్తాడు.

అమర్‌ లాప్‌ టాప్‌ తీసుకుని బస్సును ట్రాక్‌ చేస్తుటాడు. అందరూ భయంతో చూస్తుంటారు. మరోవైపు బస్సు దాబా దగ్గర ఆపగానే రాజు వచ్చి బస్‌ ఎక్కుతాడు. ప్రిన్సిపాల్‌ ఎవరు నువ్వు అని అడుగుతుంది. మేడం మా వాడే అని డ్రైవర్‌ చెప్తాడు. ఇంతలో అరవింద్‌ మళ్లీ డ్రైవరుకు ఫోన్‌ చేసి ఏం చేయాలో చెప్తాడు. డ్రైవరు మీరు చెప్పినట్టే చేస్తానని ఫోన్‌ కట్‌ చేసి బస్సు ఆపుతాడు. బస్సు ఎందుకు ఆపావని ప్రిన్సిపాల్‌ అడుగుతుంది. డ్రైవర్‌ సీట్‌లోంచి వచ్చి గన్‌ తీసి అందర్ని బెదిరిస్తాడు.


ఏం కావాలి మీకు అంటూ ప్రిన్సిపాల్‌ అడగ్గానే.. ఈ బస్సులో ఇప్పటి నుంచి నేను చెప్పిందే వినాలి. ఈ బస్సులో బాంబు ఫిక్స్‌ చేశా.. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. ఒక్క బటన్‌ నొక్కగానే అందరూ పోతారు. అంటూ వెళ్లి బస్‌ స్టార్ట్‌ చేస్తాడు. పిల్లలందరూ భయంతో వణికిపోతుంటారు. డ్రైవర్‌.. రాజును పిలిచి మన మీద అమరేంద్రకు డౌటు వచ్చింది. మనం వీళ్లను మన ప్లేస్‌కు తీసుకెళ్లే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న తప్పటడుగు వేసినా అందరం దొరికిపోతాం అని చెప్తాడు. సరే అన్నా నేను చూసుకుంటాను అంటాడు రాజు.

నిర్మల ఏడుస్తుంది. అసలు తప్పంతా మనదేనండి.. పిల్లలు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం మనమే.. మిస్సమ్మ చెప్తున్నా వినకుండా పిల్లలను పంపించాం. అవునే వాళ్ల వెనక ఇంత కుట్ర జరుగుతుందని తెలియక పంపించాం అంటాడు శివరాం. మామయ్యా పిల్లలు మారం చేస్తుంటే మీరేం చేస్తారు అంటుంది మిస్సమ్మ. ఇక నుంచి పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అమ్మగా మిస్సమ్మే తీసుకోవాలండి.. ఇలా తలా ఒకటి ఆలోచిస్తూ ఏది బడితే అది చేస్తూ పిల్లల ప్రాణానికే ప్రమాదం తీసుకొచ్చాం అంటుంది నిర్మల.

సరిగ్గా చెప్పావే.. తల్లి మనసు కాబట్టి ప్రమాదాన్ని ముందే పసిగట్టింది అంటాడు శివరాం. ప్రతిసారి వీళ్లకు దీని భజన ఏంటో అంటూ మనసులో అనుకుని ఏంటి ఆంటీ ఒక్కసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా తెలుస్తుంది. అనగానే నిర్మల కోపంగా మనోహరిని తిడుతుంది. నువ్వే మధ్యలో వచ్చి వాళ్లు వెళ్లేలా చేశావు అంటుంది. ఇంతలో అమర్‌ వచ్చి నాన్నా మీరేం భయపడకండి పిల్లలను సేఫ్‌గా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి వెళ్లిపోతుంది. మిస్సమ్మ నేను కూడా వస్తాను అని అడుగుతుంది. సరేనని అమర్‌, మిస్సమ్మను తీసుకుని వెళ్లిపోతాడు.

ఆరు బాధగా గుప్త దగ్గరకు వెళ్లి ఏదైనా చేసి నా పిల్లలను కాపాడండి. నేను యమపురికి వస్తే.. నేను అడిగింది చేస్తా అన్నారు కదా..? అంటుంది. బాలికా ఇప్పుడు నా చేతిలో ఏమీ ఉండదని నీకు చెబితిని కదా..? జరుగునది వీక్షించడం తప్పా ఏమీ చేయకూడదు. చేయలేను అంటాడు గుప్త. అయితే నా పిల్లలను నేనే కాపాడుకుంటాను అని ఆరు వెళ్తుంటే గుప్త మంత్రం వేసి ఆరు చుట్టు బంధనం వేస్తాడు. ఆరు వెళ్లకుండా ఆపేస్తాడు. నువ్వు ఆ గీత దాటి బయటకు వస్తే నేను నీ అనుమతి లేకుండా నిన్ను మా లోకానికి తీసుకెళ్లవచ్చు అంటాడు. దీంతో ఆరు బాధతో ఏడుస్తుంది. తర్వాత ఆరు తన చుట్టూ ఉన్న రేఖను దాటడానికి ప్రయత్నిస్తుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ  

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన రాజ్‌

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Big Stories

×