BigTV English
Advertisement

Vijayasai Reddy New Game: జగన్‌ను ఇరికిస్తున్న విజయసాయిరెడ్డి.. జనసేనలోకి రూట్ క్లియర్!

Vijayasai Reddy New Game: జగన్‌ను ఇరికిస్తున్న విజయసాయిరెడ్డి.. జనసేనలోకి రూట్ క్లియర్!

Vijayasai Reddy New Game: నేతల మాటలు కత్తి మాదిరిగా రెండు వైపులా పదును ఉంటుందని అప్పుడప్పుడు చెబుతారు. వైసీపీ మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి స్కెచ్ వెనుక ఏం జరిగింది? పవన్‌కు ప్రేమ సందేశం వెనుక ప్లానేంటి? ఢిల్లీ పెద్దల మాటలతో కొత్త ప్లాన్‌కు శ్రీకారం చుట్టారా? కాకినాడ గండం నుంచి గట్టెక్కకుంటే కెరీర్ అయిపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


వైసీపీలో విజయసాయిరెడ్డిని నెంబర్-2 అని అందరు చెబుతుంటారు. శుక్రవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే.. ఏపీని పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ వస్తే బాగుంటుందనేది దాని వెనుకున్న సారాంశం. విజయసాయిరెడ్డి కామెంట్స్ వెనుక ఇంటా బయటా చర్చ జరిగింది.. జరుగుతోంది కూడా. ఆయన స్కెచ్ బాగానే వర్కవుటయ్యింది.

కాకినాడ పోర్టు వ్యవహారంలో పీకల్లోతులో మునిగిపోయారాయన. ఆ కేసులో ఆయనను ఏ-2గా చేర్చింది సీఐడీ. దీన్ని నుంచి బయటపడేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు విషయం తెలియగానే నేరుగా బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. దీనిపై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో చిన్నపాటి చర్చ జరుగుతోంది. నాలుగు రోజుల కిందట హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారట వీఎస్ఆర్.


కాకినాడ సీ పోర్టు కేసులో జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారట. అయితే టీడీపీ ప్రభుత్వమైతే జోక్యం చేసుకునేవారమని అన్నారట. ప్రస్తుత ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్ ఉండడంతో తామేమీ చేయలేమని చేతులెత్తేశారట. దీంతో పవన్ కల్యాణ్ వైపు నుంచి తన అస్త్రాలను విసిరారు. దీనిపై జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

ALSO READ:  ఏపీ రాజకీయాల్లో బన్నీ ఫైరా.. ఫెయిల్యూరా? వైసీపీ కలలు నిజమవుతాయా?

ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల నుంచి చర్చ సందర్భంగా ఇంకో పదేళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండాలని, మీ వెంట మేము నడుస్తామని ఓపెన్‌గా చెప్పేశారు. 2014-19 సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

అప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చీటికి మాటికీ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని తరచుగా కలిసేశారు. అక్కడి తీసిన ఫోటోలు ఏపీలో ప్రచారం మరోలా సాగింది. ఎన్డీయేలోకి వైసీపీ వెళ్తోందని, అందుకే వీఎస్ఆర్‌కి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఆయనతో మాట్లాడడం జరుగుతోందంటూ ప్రచారం సాగింది. ఈ క్రమంలో టీడీపీ ఆగ్రహంతో బయటకు రావడానికి కారణమైంది.

ఇలాంటి చిన్నచిన్నవి పెద్దవి చేసి ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లేలా చేసింది వీఎస్ఆర్. సింపుల్‌గా చెప్పాలంటే పొలిటికల్ క్రిమినల్ స్ట్రాటజీ చేయడంలో ఆయనకు తిరుగులేదు. లేటెస్ట్‌గా ఆయన ట్వీట్‌తో టీడీపీ-జసనేన మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నది విశ్లేషకుల మాట.

మరొక్కసారి వెనక్కి వెళ్దాం.. ఆరు నెలలు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయడు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అని చెప్పింది వీఎస్ఆర్. ఆయన డైరెక్షన్‌లో పవన్ నడుస్తున్నారని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పవన్.. చంద్రబాబుకు ఉపయోగపడతారేమో గానీ, ప్రజలకు ఏమాత్రం పనికిరారని తేల్చేశారు. పవన్ కల్యాణ్‌ను ప్యాకేజ్ స్టార్ అని పేరు పెట్టిందీ వీఎస్ఆరే.

చంద్రబాబు దత్త పుత్రుడని ఎగతాళి చేసిందెవరు? ముగ్గురు భార్యలంటూ మూకుమ్మడిగా దాడి చేసిందెవరు? ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన ఫెయిల్యూర్ లీడరన్నది ఎవరు? ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కల్యాణ్ క్యారెక్టర్‌ను అసాసినేషన్ చేసింది వైసీపీయే. అసలు వైసీపీ వ్యవహారాన్ని వీఎస్ఆర్ బయటపెడుతున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీ రూలింగ్‌లో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ పదవి నుంచి అవమానకరంగా తొలగించారు. ఆ పదవిలో వైవీ సుబ్బారెడ్డిని కూర్చోబెట్టారు. ఆనాటి నుంచి కాసింత ఆగ్రహంతో ఉన్నారట వీఎస్ఆర్.  ఆ తర్వాత నెల్లూరు తరలించారు. కాకినాడ సీ పోర్టు విషయంలో విక్రాంత్‌ని ఇరికించింది ఆయనేనన్న టాక్ పొలిటికట్ సర్కిల్స్‌లో బలంగా సాగుతోంది. సీఐడీ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

Roja: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?

KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

Jagan Tweet: సీపీ బ్రౌన్ జయంతికి జగన్ నివాళి.. కామెంట్లు మామూలుగా లేవు

TDP Politics: కొందరు నేతలపై మంత్రి లోకేష్ సీరియస్.. ఏం జరిగింది? మళ్లీ వచ్చేసరికి

Jagan Chandra Babu: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు

Big Stories

×